
నల్గోండ , జూలై 28 (ఇయ్యాల తెలంగాణ) : గ్రావిూణ ప్రాంతాల్లో ప్రతియేటా సర్కార్ బడులు మూతపడుతున్నాయి. ఆదే కోవలో ఒక పాఠశాల వుంది. నల్లగొండ జిల్లా సరిహద్దుల్లోని చందంపేట మండలం, పోగిళ్ళ ప్రాథమిక పాఠశాల. అక్కడ వెంకటేశ్వర్లు అనే ఒకే ఒక్క ఉపాధ్యాయుడు విధులు నిర్వర్తిస్తున్నారు. ఆయన 2019 లో బదిలీపై ఇక్కడికి వచ్చినప్పుడు కేవలం ఐదుగురు విద్యార్థులే ఉన్నారు. విద్యార్దుల సంఖ్య పెరగకపోతే పాఠశాల ముసేసె పరిస్థితి వస్తుంది. దాంతో అయన కృషితో.. స్టూడెంట్స్ సంఖ్య 48 కి పెరిగింది. ఒకటి నుంచి ఐదో తరగతి వరకూ.. అన్ని సబ్జెక్టులను వెంకటేశ్వర్లు బోధిస్తున్నారు. పొగిళ్ల గ్రామంలోని విద్యార్థులు, వారి తల్లిదండ్రులు, గ్రామస్తులు అంతా కలిసి.. ప్రభుత్వ బడిని బతికించిన టీచర్ వెంకటేశ్వర్లు ను ఘనంగా సన్మానించారు.