
హైదరాబాద్, జూన్ 13 (ఇయ్యాల తెలంగాణ) : ఓల్డ్ సిటీ లో వేసవి శిక్షణ శిబిరాలు ఘనంగా ముగిసాయి. 2025 సంవత్సరంలో కొనసాగిన వేసవి శిక్షణ శిబిరాలు పాతబస్తీ కులీ కుతుబ్ షా స్టేడియంలో ఈ నెల 11 న ముగింపు వేడుకలను నిర్వహించారు. వేసవి శిక్షణ శిబిరాల్లో వివిధ క్రీడల్లో తర్ఫీదు పొందిన క్రీడా కారులతో పాటు వివిధ క్రీడల కోచ్ లు వేసవి శిక్షణ ముగింపు వేడుకలో తమ తమ టీమ్ సభ్యులతో కలసి వేసవి శిక్షణ శిబిరాల ముగింపు వేడుకలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా చార్మినార్ ఎమ్మెల్యే మీర్ జుల్ఫీకర్ అలీ ముఖ్య అతిథిగా పాల్గొని పలు క్రీడల్లో తర్ఫీదు పొందిన క్రీడాకారులతో కలసి కరచాలనం చేశారు. వేసవి శిక్షణ క్రీడల్లో విద్యార్థులు పొందిన శిక్షణల గురుంచి ఎమ్మెల్యే అడిగి తెలుసుకున్నారు. వేసవి శిక్షణ శిబిరాలు విద్యార్థుల్లో దాగి ఉన్న ప్రతిభను వెలికి తీయడంతో పాటు వారికీ తగిన ప్రోత్సాహాన్ని అందిస్తాయని ఎమ్మెల్యే మీర్ జుల్ఫీకర్ అలీ అన్నారు.

మరో ముఖ్య అతిథి చార్మినార్ జోన్ జోనల్ కమీషనర్ వెంకన్న పాల్గొని పలువురు క్రీడా కారులను కోచ్ లను ప్రశంసించారు. ఈ కార్యక్రమాల్లో వివిధ మంది క్రీడాకారులతో పాటు కోచ్ లు పాల్గొన్నారు. వీరితో పాటు భాగ్యనగర్ బాక్సింగ్ టీమ్ కోచ్ లు బి. ఉదయ్ కుమార్, బి. విష్ణవి,కో- ఆర్డినేటర్ సంఘి మహేష్ బాబు, బాక్సింగ్ క్రీడాకారులు విశాఖ శ్రీవాస్తవ, వర్ష శ్రీవాస్తవ్, కీర్తన గౌడ్, సాయి లాస్య సంఘి, జాన్విక యాదవ్, మీసాల రవళిక,ఎన్. సాయి ప్రజీత్, సాకేత్ గౌడ్, మనీశ్వర్, తరుణ్ తేజ్ తో పాటు ప్రముఖ సంఘ సేవకులు పేరోజి మహేష్, చిన్నారి క్రీడాకారులు పేరోజు నివేదిక, వివేక్ కుమార్, మహేందర్ కుమార్,