.
మద్దికేర జూన్ 28,(ఇయ్యాల తెలంగాణ ):మంల పరిధిలోని పెరవలి గ్రామంలో వెలసిన శ్రీ భూదేవి రాజ్యలక్ష్మి సమేత శ్రీరంగనాథస్వామి ఆలయంలో తొలి ఏకాదశి కు ప్రత్యేక ఏర్పాట్లు చేసినట్లు ఆలయ కార్యనిర్వాహనాధికారి చంద్రశేఖర్ రెడ్డి,ఆలయ పాలక మండలి అధ్యక్షులు దస్తగిరి గౌడ్ తెలిపారు. మంగళవారం వారు విలేకరులతో మాట్లాడుతూ ఆలయ ప్రధాన అర్చకులు కోమండూరి రంగనాథాచార్యులు బృందం ఈనెల 29వ తేదీన ఆషాడ శుద్ధ ఏకాదశి (తొలి ఏకాదశి )ను పురస్కరించుకొని వేకువ రaామున స్వామి వార్ల మూల విరాట్టులకు అభిషేకాదులు, అలంకరణ,అర్చనలు నిర్వహిస్తారని తెలిపారు.శ్రీ భూదేవి రాజ్యలక్ష్మి సమేత శ్రీరంగనాథస్వామి ఉత్సవ మూర్తులను ఆలయ ప్రాంగాణంలోని మండపంలోకి వెంచేసి,తిరుమంజనోత్సవం నిర్వహిస్తారన్నారు. సాయంత్రం శేషశయన అలంకారంలొ భక్తులకు దర్శనమిస్తారని వారు తెలిపారు.భక్తాదులు పై కార్యక్రమంలో పాల్గొని, స్వామి వార్ల తీర్థ ప్రసాదాలు స్వీకరించి,స్వామి వార్ల ఆశీస్సులు పొందాలని తెలిపారు.భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లు చేసామని వారు తెలిపారు.