ఉద్యోగుల భవిష్య నిధి ప్రాంతీయ కార్యాలయం హైదరాబాద్ విశ్రాంత అధికారి మరియు సనత్ నగర్ నెహ్రూ పార్క్ వద్ద గల శ్రీ షిరిడీ సాయి బాబా సేవాసమాజ్ అన్నప్రసాద వితరణ కమిటీ చైర్మన్ శ్రీ చిన్నం సోమసుందర్ రెడ్డి దాదాపు ఐదు దశాబ్దాలుగా శ్రీ సాయిబాబా భక్తునిగా ఎన్నో ఆధ్యాత్మిక మరియు సమాజసేవా కార్యక్రమాలలో చురుగ్గా పాల్గొంటూ వేసవి కాలంలో ఆదివారాంతపు సంతకు వచ్చే కొనుగోలు దారులకు ఉచితంగా మజ్జిగ అందించే వ్యక్తిగా ఒక విశిష్ట గుర్తింపు తెచ్చుకున్నారు. ఆధ్యాత్మిక పరంగానే కాక సనత్ నగర్ రెసిడెంట్స్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షుడుగా కూడా సమాజ సేవ చేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు.
కరోనా వైరస్ నేపథ్యంలో ప్రభుత్వం విధించిన “లాక్ డౌన్” కారణంగా సమాజంలోని ప్రతి వర్గానికి చెందిన ప్రజలు పలు రకాల ఇబ్బందులు ఎదుర్కొంటున్న విషయం దృష్టికి రావడంతో సోమసుందర్ రెడ్డి అమెరికా లోని ప్రవాస భారతీయుడు సామల వినోద్ కుమార్ సౌజన్యంతో వారి తల్లిదండ్రులు కీ శే శ్రీ ఎస్ జి కొండయ్య మరియు కీ శే శ్రీమతి లలితాబాయి ల స్మృత్యర్థం సనత్ నగర్ కాలనీలోని ప్రతి ఇంటినుండి చెత్త సేకరించే దినసరి కూలీలకు మరియు ఇంటి పనులలో హౌస్ కీపర్స్ గా సేవలందించే పనివారికి డిమార్ట్ ఎదురుగా వారి స్వగృహం వద్ద పక్షం రోజులకు సరిపడ నిత్యావసర వస్తువులను అందించి తమ దాతృత్వాన్ని చాటుకున్నారు.
కరోనా వైరస్ వ్యాప్తిని దృష్టిలో ఉంచుకుని కార్మికులకు ముందుగానే టోకెన్స్ ఇచ్చి క్రమపద్ధతిలో వరుసలో నిలబడి క్రమశిక్షణ పాటించిన వారికి మాత్రమే నిత్యావసర సరుకులు అందించడం జరిగిందని కార్యక్రమ నిర్వాహకులు సోమసుందర్ రెడ్డి తెలిపారు.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా స్థానిక కార్పొరేటర్ శ్రీమతి కొలన్ లక్ష్మి బాల్ రెడ్డి, ఆత్మీయ అతిథులుగా తెరాస సనత్ నగర్ డివిజన్ అధ్యక్షుడు కొలన్ బాల్ రెడ్డి, భాజపా మాజీ రాష్ట్ర కౌన్సిల్ సభ్యుడు యేచన్ సురేష్, భాజపా యువమోర్చా నాయకుడు పి సునీల్ కుమార్, భాజపా దళిత మోర్చా నాయకుడు పొలిమేర సంతోష్ కుమార్, ఎస్ మహేష్, కె ఉమ. కె అనీష్ లు విచ్చేసి శ్రీ షిరిడి సాయిబాబా సమాజ్ ఆలయ అన్నప్రసాద వితరణ సభ్యుడు వై వి ఎస్ మూర్తి, మాజీ సబ్ రిజిష్ట్రార్ ఎస్ రమణ మూర్తి, తులసి రామ్ తదితరులతో కలిసి అవసరార్థులకు నిత్యావసర సరుకులు పంపిణీ చేసారు.