హుస్నాబాద్ ఆగష్టు 26 (ఇయ్యాల తెలంగాణ ):హుస్నాబాద్ లో సిపిఐ జాతీయ కార్యవర్గ సభ్యుడు చాడ వెంకటరెడ్డి విూడియా సమావేశం నిర్వహించారు. చాడా మాట్లాడుతూ పొత్తుల కోసం ఎవరితోనూ సంప్రదింపవలసిన అవసరం లేదు ఒకవేళ ఎవరైనా అడిగితే ఆలోచిస్తాం. సీపీఐ కి గట్టిపట్టున్న ఐదు స్థానాలతో పాటు హుస్నాబాద్ నియోజకవర్గంలోనూ పోటీ చేస్తున్నాం. ఇంతకుముందు లాగానే పోత్తులు అంటూనే ఏలాంటి సంప్రదింపులు జరపకుండా కేసీఆర్ అభ్యర్థులను ప్రకటించడం చాలా విడ్డూరం. ఏది ఏమైనా మా బలం ఉన్న ప్రతి చోట అభ్యర్థులను నిలబెడతమని వెల్లడిరచారు. మతోన్మాద బిజెపి పార్టీని ఓడిరచడమే ప్రధాన లక్ష్యంగా ముందుకు వెళ్తామని అన్నారు.
