శ్రీశైలం, ఫిబ్రవరి 21 (ఇయ్యాల తెలంగాణ) : శ్రీశైల దేవస్థానం లో బుధవారం రోజు మహాకుంభాభిషేక మహోత్సవం ఎంతో వైభవంగా జరిపించబడిరది. కాగా ఈ నెల 19వ తేదీన ప్రారంభమైన మహాకుంభాభిషేకం మహోత్సవం ఈ బుధవారం రోజుతో ముగిసింది.
బుధవారం రోజు జరిగి మహాకుంబాభిషేక మహోత్సవంలో కంచికామకోటి పీఠాధిపతులు శ్రీశ్రీశ్రీ విజయేంద్ర సరస్వతీ మహాస్వామివారు, శ్రీశైల జగద్గురు పీఠాధిపతులు శ్రీశ్రీశ్రీ చెన్నసిద్ధరామ పండితారాధ్య శివాచార్య మహాస్వామివారు, పుష్పగిరి పీఠాధిపతులు శ్రీశ్రీశ్రీ విద్యాశంకర భారతీ మహాస్వామివారు, కాశీ పీఠాధిపతి శ్రీశ్రీశ్రీ మల్లికార్జున విశ్వరాధ్య శివాచార్య మహాస్వామివారు పాల్గొన్నారు.
అదేవిధంగా ఈ కార్యక్రమములో గౌరవ ఉపముఖ్యమంత్రివర్యులు మరియు దేవదాయ శాఖామాత్యులు కొట్టు సత్యనారాయణ, నంద్యాల పార్లమెంట్ సభ్యులు పోచాబ్రహ్మానందారెడ్డి. శ్రీశైల నియోజవర్గం
శాసనసభ్యులు శిల్పా చక్రపాణిరెడ్డి, తదితరులు పాల్గొన్నారు.రాష్ట్రదేవదాయశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కరికాల్ వళవన్, రాష్ట్ర దేవదాయశాఖ కవిూషనర్ ఎస్. సత్యనారాయణ కూడా ఈ మహాకుంభాభిషేకమహోత్సవంలో పాల్గొనడం జరిగింది.
అలాగే దేవస్థానం ధర్మకర్తల మండలి అధ్యక్షులు రెడ్డివారి చక్రపాణిరెడ్డి, కార్యనిర్వహణాధికారి డి.పెద్దిరాజు, ధర్మకర్తల మండలి సభ్యులు విరూపాక్షయ్యస్వామి, శ్రీమతి జంగం సుజాతమ్మ జి. నరసింహారెడ్డి, శ్రీమతి ఎం. విజయలక్ష్మీ శ్రీమతి జి. రాజేశ్వరి, శ్రీమతి ఎ. లక్ష్మీసావిత్రమ్మ మేరాజోత్ హనుమంతునాయక్,ఓ మధుసూదన్ రెడ్డి. ప్రత్యేక ఆహ్వానితులు తన్నీరు ధర్మరాజు. కేతిరెడ్డి జగదీశ్వరరెడ్డి కూడా పాల్గొన్నారు.
కాగా ప్రధానాలయంలో శివాజీగోపుర పునర్నిర్మాణం, ఆలయప్రాంగణంలోని కొన్ని ఉపాలయాల పునరుద్ధరణ, పంచమఠాలలోని మూడు మఠాల పునరుద్ధరణ మరియు ఆయా ఉపాలయాలో, మఠాలలో శివలింగ, నందీశ్వరుల ప్రతిష్ఠ సందర్భంగా ఈ మహాకుంభాభిషేకం జరిపించబడిరది.
ప్రధానాలయంలోని శ్రీస్వామివారి గర్భాలయ విమానం, అమ్మవారి గర్భాలయ విమానం, నాలుగుదిక్కులు గల నాలుగు ప్రధానగోపురాలు, అమ్మవారి ద్వారగోపురం మరియు ఆలయ ప్రాంగణంలోని అన్ని ఉపాలయాలు, పరివారఆలయాలలో ఈ కుంభాభిషేకం జరిపించబడిరది.
అదేవిధంగా క్షేత్రంలోని గంగాధరమండపం, ఆరామవీరేశ్వరాలయం, అంకాళమ్మ ఆలయం, నందిగుడి, బయలువీరభద్రస్వామిఆలయం, పాతాళగంగమార్గంలోని ఆంజనేయస్వామి ఆలయం పాతాళేశ్వర ఆలయం, గంగాసదన్ వద్ద గల గణపతి ఆలయం, హేమారెడ్డి మల్లమ్మ మందిరం మరియు పంచమఠాలలో ఈ మహాకుంభాభిషేకం జరిపించబడిరది.అదేవిధంగా సాక్షిగణపతి,హాటకేశ్వరం, శిఖరేశ్వరం మొదలైనచోట్ల మరియు ఇష్టకామేశ్వరి ఆలయంలో కూడా ఈ కుంభాభిషేకం జరిపించబడిరది. కాగా ఈ రోజు జరిగిన కార్యక్రమంలో ముందుగా శాంతి హోమం, పౌష్టిక హోమం,
మహాపూర్ణాహుతి జరిగాయి.
అనంతరం పునరుద్ధరించిన ఆలయాలలో యంత్ర ప్రతిష్టలు, శివలింగ నందిశ్వరుల ప్రతిష్టలు, శివాజీగోపురంపై సువర్ణ కలశ ప్రతిష్టలు జరిగాయి.
అనంతరం అన్నిచోట్ల కూడా ఏకకాలంలో మహాకుంభాభిషేకం జరిపించబడిరది. తరువాత అవబృదం, జగద్గురువులకు గురువందనం జరిపించబడిరది. ఈ సందర్భంగా పీఠాధిపతులందరు కూడా తమ అనుగ్రహ భాషణాన్ని చేశారు.కాగా ఆలయాలలో అరిగే అత్యద్భుత కార్యక్రమమే మహాకుంభాభిషేకం, ఈ మహిమాన్విత కార్యక్రమములో విధివిధానముగా కలశాలను నెలకొల్పి, ఆయా కలశాలలో దేవతాశక్తిని నిక్షిప్తం చేసి పారాయణ,ధ్యాన, హోమాదులను జరిపి, ఆ మంత్రపూరిత జలాలతో ఆలయంలోని గర్భాలయ విమానాలను, గోపురాలను, దేవతామూర్తులను అభిషేకించడం జరుగుతుంది.
ఈ కుంభాభిషేకం చేసినందువల్ల ఆలయ విమాన శిఖరాన్ని దర్శించినంతనే చతుర్విధ పురుషార్ధసిద్ధి, మానసిక ప్రశాంతత, భక్తి, ఆధ్యాత్మిక పరిపుష్టి, ఆయుర్వృద్ధి కీర్తి, జయం కలుగుతాయని, శారీరక, మానసిక వ్యాధులు నశిస్తాయని, సకల ఆపదలు తొలుగుతాయని, అభివృద్ధి చేకూరుతుందని చెప్పబడుతోంది.

