హైదరాబాద్ జులై 1 (ఇయ్యాల తెలంగాణ ):సికింద్రాబాద్ గాంధీ ఆసుపత్రి దగ్గర తీవ్ర ఉద్రిక్తత నెలకింది. నిరాహార దీక్ష చేస్తున్న మోతీలాల్ ను పరామర్శించేందుకు వచ్చిన పల్లా రాజేశ్వర్ రెడ్డి, ఏనుగుల రాకేష్ రెడ్డిలను పోలీసులు అడ్డుకున్నారు. వారిని బలవంతంగా అరెస్టు చేసి పోలీస్ స్టేషన్ కు తరలించారు మరో 40 మంది బీఆర్ఎస్, బీఆర్ఎస్వీ, ఓయూ నేతలను కుడా అరెస్టు చేసారు. పల్లా ను చంద్రయన్ గుట్ట, రాకేష్ రెడ్డిని బొల్లారం పీఎస్ కు తరలించారు.

