America డాలర్‌తో పోలిస్తే కనిష్ఠ స్థాయికి రూపాయి

ముంబై, జనవరి 21 (ఇయ్యాల తెలంగాణ) : అమెరికా డాలర్‌తో పోలిస్తే భారత రూపాయి మారకం విలువ చరిత్రాత్మక కనిష్ఠ స్థాయికి పడిపోయింది. ఇవాళ ట్రేడింగ్‌లో రూపాయి భారీగా నష్టపోయి, ఒక దశలో 91.74 వద్ద ఆల్ టైమ్ కనిష్ఠాన్ని నమోదు చేసింది. మార్కెట్‌లో నెలకొన్న పలు ప్రతికూల పరిణామాల మధ్య ఒక్కరోజే 77 పైసల మేర విలువను కోల్పోయింది.నిన్న 90.97 వద్ద ముగిసిన రూపాయి, ఇవాళ ఉదయం 91.05 వద్ద బలహీనంగా ప్రారంభమైంది. ట్రేడింగ్ సాగుతున్న కొద్దీ అమ్మకాల ఒత్తిడి పెరగడంతో రూపాయి విలువ అంతకంతకూ దిగజారింది. బంగారం, వెండి దిగుమతులు పెరగడం, విదేశీ సంస్థాగత పెట్టుబడిదారులు (ఈఎఎలు) దేశీయ మార్కెట్ల నుంచి తమ పెట్టుబడులను భారీగా ఉపసంహరించుకోవడం పతనానికి ప్రధాన కారణంగా నిలిచింది. మరోవైపు అమెరికా, యూరప్ మధ్య వాణిజ్య యుద్ధ భయాలు, గ్రీన్‌లాండ్‌ను స్వాధీనం చేసుకునేందుకు అమెరికా ప్రయత్నిస్తోందన్న వార్తలు వంటి అంతర్జాతీయ అంశాలు కూడా రూపాయిపై తీవ్ర ఒత్తిడిని పెంచాయి. వీటికి తోడు దేశీయ స్టాక్‌మార్కెట్లు నష్టాల్లో కొనసాగడం రూపాయి విలువను మరింత బలహీనపరిచిందని మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి. 

iyyala telangana: ఇయ్యాల తెలంగాణ తెలుగు దినపత్రిక గత 11 సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్రం నుంచి సరికొత్త వార్తా ధోరణితో పాఠకుల ఆదరణ పొందుతుంది. అనతి కాలంలోనే విశేష ఆదరణ పొంది ఏంతో మంది పాఠకులకు చెరువవుతుంది. మీ అందరి ఆధర అభిమానులతో ముందుకు వెళుతూ ఎప్పటికప్పుడు సరికొత్త వార్తా సమాచారాలను అందరికి అందించాలనే ఆకాంక్షను అందరు ఆదరిస్తూ ఉంటారని ఆశిస్తున్నాము. ప్రస్తుతం అనేక మంది వీక్షకులు, పాఠకులు ఆన్ లైన్ వార్తలనే ఎక్కువగా కోరుకుంటుండటంతో మీ ముందుకు ఎప్పటికప్పుడు నిజమైన వార్తలను ముందుచేలా చేస్తున్న ఇయ్యాల తెలంగాణ పత్రిక, ఆన్ లైన్ సామ్రాజ్యాన్ని ప్రతి ఒక్కరూ ఆదరిస్తూ ఉంటారని మా ఆకాంక్ష .....