80 శాతం డబుల్‌ బెడ్ రూమ్ ఇళ్ల నిర్మాణాలు పూర్తి

80 శాతం డబుల్‌  బెడ్ రూమ్ ఇళ్ల నిర్మాణాలు పూర్తి

హైదరాబాద్ హెచ్ ఆర్ డి లో డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల నిర్మాణంపై సమీక్షించిన కె టి ఆర్ చిత్రంలో మంత్రులు తలసాని,మల్లారెడ్డి తదితరులు


సవిూక్షలో మంత్రి కెటిఆర్‌ వెల్లడి

హైదరాబాద్‌,మే20(ఇయ్యాల తెలంగాణ ): తెలంగాణ ప్రభుత్వం డబుల్‌ బెడ్‌రూం ఇండ్ల నిర్మాణాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకున్నదని  రాష్ట్ర ఐటీ, పురపాక శాఖ మంత్రి కేటీఆర్ ‌స్పష్టం చేశారు. హైదరాబాద్‌లో చాలా చోట్ల 80 శాతానికి పైగా ఇండ్ల నిర్మాణాలు  పూర్తి అయ్యాయని తెలిపారు. ఇప్పటికే కొన్ని చోట్ల లబ్దిదారులకు డబుల్‌ బెడ్‌రూం ఇండ్లను పంపిణీ చేశామని మంత్రి పేర్కొన్నారు. త్వరలోనే మిగిలిన నిర్మాణాలను పూర్తి చేసి లబ్దిదారులకు పంపిణీ చేస్తామని చెప్పారు. హైదరాబాద్‌ నగరంలో నిర్మిస్తున్న డబుల్‌ బెడ్‌రూం ఇండ్లపై ఎంసీహెచ్‌ఆర్‌డీలో మంత్రి కేటీఆర్‌ సవిూక్ష నిర్వహించారు. ఈ సవిూక్షా సమావేశానికి మంత్రులు  మహముద్‌ అలీ, వేముల  ప్రశాంత్‌ రెడ్డి, తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌, మల్లారెడ్డి, జీహెచ్‌ఎంసీ మేయర్‌ బొంతు రామ్మోహన్‌తో పాటు పురపాలక, హౌసింగ్‌ శాఖ అధికారులు  హాజరయ్యారు.   ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్‌ మాట్లాడుతూ.. ఇళ్ల నిర్మాణాలు  పెండిరగ్‌లో ఉన్నచోట త్వరగా పూర్తి  చేయాలన్నారు. ఎక్కడా ఆలస్యం లేకుండా పనులు  సాగాలన్నారు. పేదలకు త్వరగా అందించేలా కార్యాచరణ చేయాలన్నారు. 

iyyala telangana: ఇయ్యాల తెలంగాణ తెలుగు దినపత్రిక గత 11 సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్రం నుంచి సరికొత్త వార్తా ధోరణితో పాఠకుల ఆదరణ పొందుతుంది. అనతి కాలంలోనే విశేష ఆదరణ పొంది ఏంతో మంది పాఠకులకు చెరువవుతుంది. మీ అందరి ఆధర అభిమానులతో ముందుకు వెళుతూ ఎప్పటికప్పుడు సరికొత్త వార్తా సమాచారాలను అందరికి అందించాలనే ఆకాంక్షను అందరు ఆదరిస్తూ ఉంటారని ఆశిస్తున్నాము. ప్రస్తుతం అనేక మంది వీక్షకులు, పాఠకులు ఆన్ లైన్ వార్తలనే ఎక్కువగా కోరుకుంటుండటంతో మీ ముందుకు ఎప్పటికప్పుడు నిజమైన వార్తలను ముందుచేలా చేస్తున్న ఇయ్యాల తెలంగాణ పత్రిక, ఆన్ లైన్ సామ్రాజ్యాన్ని ప్రతి ఒక్కరూ ఆదరిస్తూ ఉంటారని మా ఆకాంక్ష .....