ప్రపంచవ్యాప్తంగా 46,28,821 కరోనా కేసులు

ఇప్పటివరకు 3,08,654 మంది బాధితుల  మృతి

న్యూయార్క్‌,మే 17 (ఇయ్యాల తెలంగాణ ):   ప్రపంచ దేశాలను వణికిస్తున్నది కరోనా వైరస్‌. ఈ మహమ్మారి ప్రభావంతో ప్రపంచ వ్యాప్తంగా ఇప్పటివరకు 46,28,821 కరోనా పాజిటివ్‌ కేసులు  నమోదయ్యాయి. ఈ వైరస్‌ బారిన పడిన వారిలో ఇప్పటివరకు 3,08,654 మంది బాధితులు  మృతిచెందారు. అన్ని దేశాల్లో కలిపి 17,59,702 బాధితులు  కోలుకున్నారు. మరో 25,60,465 కేసులు  యాక్టివ్‌గా ఉన్నాయి. దేశా వారీగా చూస్తే.. అమెరికాలో గత 24 గంటల్లో 26,493 కరోనా పాజిటివ్‌ కేసులు  నమోదయ్యాయి. దీంతో అగ్రరాజ్యం మొత్తం 14,84,285 కరోనా కేసులతో అగ్రస్థానంలో కొనసాగుతున్నది. దేశంలో ఇప్పటివరకు 88,507 మంది బాధితులు  మరణించారు. మరో 10,68,027 కేసు యాక్టివ్‌గా ఉన్నాయి. కరోనా కేసుల్లో రెండో స్థానంలో ఉన్న స్పెయిన్‌లో 2,74,367 పాజిటివ్‌ కేసులు  నమోదయ్యాయి. దేశంలో ఇప్పటివరకు 27,459 మంది మరణించారు. మూడోస్థానానికి దూసుకువచ్చిన రష్యాలో ఇప్పటివరకు 2,62,843 కరోనా కేసులు  నమోదయ్యాయి. ఈ వైరస్‌ ప్రభావంతో 2418 మంది మృతిచెందారు. దేశంలో ఇంకా 2,02,199 కేసులు  యాక్టివ్‌గా ఉండగా, 58,226 మంది కోలుకున్నారు. యూకేలో మొత్తం 2,36,711 కరోనా పాజిటివ్‌ కేసులు  ఉండగా, 33,998 మంది బాధితులు  మరణించారు. ఇటలీలో ఇప్పటివరకు 2,23,885 కరోనా కేసులు  నమోదవగా, 31,610 మంది మృతిచెందారు. 2,20,291 పాజిటివ్‌ కేసులతో బ్రెజిల్‌ ఆరో స్థానంలో ఉండగా, 1,79,506 కరోనా కేసుతో ఫ్రాన్స్‌ ఏడో స్థానంలో ఉన్నది. ఇక 85940 కేసులతో చైనాను దాటింది. దేశంలో ఇప్పటివరకు 2753 మంది మరణించారు.

iyyala telangana: ఇయ్యాల తెలంగాణ తెలుగు దినపత్రిక గత 11 సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్రం నుంచి సరికొత్త వార్తా ధోరణితో పాఠకుల ఆదరణ పొందుతుంది. అనతి కాలంలోనే విశేష ఆదరణ పొంది ఏంతో మంది పాఠకులకు చెరువవుతుంది. మీ అందరి ఆధర అభిమానులతో ముందుకు వెళుతూ ఎప్పటికప్పుడు సరికొత్త వార్తా సమాచారాలను అందరికి అందించాలనే ఆకాంక్షను అందరు ఆదరిస్తూ ఉంటారని ఆశిస్తున్నాము. ప్రస్తుతం అనేక మంది వీక్షకులు, పాఠకులు ఆన్ లైన్ వార్తలనే ఎక్కువగా కోరుకుంటుండటంతో మీ ముందుకు ఎప్పటికప్పుడు నిజమైన వార్తలను ముందుచేలా చేస్తున్న ఇయ్యాల తెలంగాణ పత్రిక, ఆన్ లైన్ సామ్రాజ్యాన్ని ప్రతి ఒక్కరూ ఆదరిస్తూ ఉంటారని మా ఆకాంక్ష .....