కరీంనగర్, మే 21 (ఇయ్యాల తెలంగాణ) : జగిత్యాల జిల్లాలో ఓ దారుణ ఘటన వెలుగుకులోకి వచ్చింది. గురుకుల పాఠశాలలో ఐదవ తరగతి చదువుతున్న విద్యార్ధిని వార్షిక పరీక్షల అనంతరం.. సెలవుల ఇవ్వడంతో ఇంటికి వెళ్లగా.. నెలసరి వచ్చింది. ఇంత చిన్న వయస్సులోనే నెలసరి రావడంతో కంగారుపడిన తల్లిదండ్రులు ఆస్పత్రికి తీసుకెళ్లగా దారుణ నిజం బయటపడిరది. గురుకుల విద్యార్థినిపై లైంగిక దాడికి పాల్పడ్డాడు అక్కడ పనిచేసే ఓ జూనియర్ లెక్చరర్.వివరాల్లోకి వెళ్తే.. మెట్ పల్లిలోని ఓ సోషల్ వెల్‌ఫేర్ పాఠశాలలో 5వ తరగతి చదువుతున్న విద్యార్ధినిపై జూనియర్ లెక్చరర్ లైంగిక దాడి చేశాడు. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వార్షిక పరీక్షల అనంతరం వేసవి సెలవుల కోసం ఇంటికి వెళ్లిన బాలికకు చిన్న వయసులోనే నెలసరి రావడంతో తల్లిదండ్రుల ఆందోళన చెందారు. బిడ్డ ఆరోగ్యం విషయంలో అలసత్వం వహించడకుండా పలు ఆసుపత్రులకు తీసుకెళ్తారు తల్లిదండ్రులు. కరీంనగర్‌కు చెందిన వైద్యురాలు బాలికపై ఎవరైనా అత్యాచారయత్నం చేశారేమోనని అనుమానం వ్యక్తం చేసింది. డాక్టర్ సూచన మేరకు ప్రశ్నించగా.. గత నెలలో ఒక జూనియర్ లెక్చరర్ తనను గదిలోకి తీసుకెళ్లి అసభ్యంగా ప్రవర్తించాడని బాలిక చెప్పింది. తల్లిదండ్రులు పొలీసులకు ఫిర్యాదు చేశారు. విచారణ అనంతరం.. పోక్సో కేసు నమోదు చేసి జూనియర్ లెక్చరర్‌ను రిమాండ్‌కు తరలించారు. బాలికల భద్రత పట్ల కనీస జాగ్రత్తలు తీసుకోని.. గురుకుల సిబ్బందిపై కఠిన చర్యలు తీసుకోవాలని తల్లిదండ్రులు డిమాండ్ చేస్తున్నారు.
- Homepage
- General News
- జగిత్యాలలో 5th Class విద్యార్ధినిపై లైంగిక దాడి
జగిత్యాలలో 5th Class విద్యార్ధినిపై లైంగిక దాడి
Leave a Comment
Related Post