5 రాష్ట్రాల ఎన్నికలు Notification

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 18 (ఇయ్యాల తెలంగాణ) :  ఈ ఏడాదిలో జరగబోయే ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలపై ఈసీ కసరత్తు ప్రారంభించింది. బెంగాల్, తమిళనాడు, కేరళ, అసోం, పుదుచ్చేరీల్లో ఇప్పటికే ఓటర్ల జాబితా ప్రక్షాళన చేపట్టింది. ఈ ప్రక్రియ తుది అంకానికి చేరుకుంది. ఎసఐఆర్‌పై ఓ పక్క విపక్షాలు ఆరోపణలు చేస్తున్నాయి. దీంతో ఎన్నికల తేదీలను మార్చి రెండో వారంలో ప్రకటించి, చివరి వారంలో నోటిఫికేషన్ విడుదల చేస్తుందని విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. ఈసీ అధికారులు.. ఐదు రాష్ట్రాల్లో ఎన్నికల ఏర్పాట్లను పరిశీలిస్తున్నారు.పశ్చిమ బెంగాల్, తమిళనాడు సహా ఐదు రాష్ట్రాల  అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి కీలక అప్డేట్ వచ్చింది. వచ్చే ఏప్రిల్‌లో బెంగాల్, తమిళనాడు శాసనసభకు ఎన్నికలు నిర్వహించే అవకాశం ఉన్నట్లు కేంద్ర ఎన్నికల కమిషన్ వర్గాలు తెలిపాయి. వీటితో పాటు కేరళ, అసోం, పుదుచ్చేరి అసెంబ్లీలకు పోలింగ్ జరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు మార్చి రెండో వారంలో షెడ్యూల్‌ను ఈసీ విడుదల చేసే అవకాశం ఉన్నట్లు తెలిపాయి. ఇక, ఈ రాష్ట్రాల్లో ఎన్నికల ఏర్పాట్లను పరిశీలించేందుకు ఇప్పటికే ఈసీ అధికారులు పర్యటనలు ప్రారంభించారు. ప్రస్తుతం ఈసీ బృందం అసోంలో పర్యటిస్తుంది.తమిళనాడు, కేరళ, పశ్చిమ్ బెంగాల్ అసెంబ్లీలకు మే నెలలోనూ.. పుదుచ్చేరి శాసనసభకు జూన్ 15తో గడువు ముగియనుంది.

ఇక, ఎన్నికల జరగనున్న రాష్ట్రాలో ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియ చివర దశకు చేరుకుంది. ఫిబ్రవరి 10 అసోం, ఫిబ్రవరి 14న పుదుచ్చేరిలో ఓటర్ల జాబితా ప్రచురించిన సంగతి తెలిసిందే. తమిళనాడులో మంగళవారం తుది ఓటర్ల జాబితా విడుదల చేయనున్నారు. ఫిబ్రవరి 21న కేరళ, 28న పశ్చిమ బెంగాల్లో తుది జాబితాలు విడుదలవుతాయి. కానీ, ఎసఐఆర్‌పై తమిళనాడు, బెంగాల్‌లో రగడ కొనసాగుతోంది. తమిళనాడులో డిసెంబరు 19న విడుదల చేసిన ముసాయిదాలో 97 లక్షల మంది పేర్లను తొలగించారు. బెంగాల్‌లోనూ 58 లక్షల మంది పేర్లు డిలీట్ చేశారు. ఇప్పటికే దీనిపై తమిళనాడు, బెంగాల్ ముఖ్యమంత్రులు ఎంకే స్టాలిన్, మమతా బెనర్జీలు తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నారు. కేంద్రంలోని మోదీ ప్రభుత్వంపై దీదీ యుద్ధం ప్రకటించారు. సుప్రీంకోర్టులోనూ పిటిషన్ దాఖలు చేసి, స్వయంగా మమతా బెనర్జీ వాదనలు వినిపించడం గమనార్హం.బెంగాల్‌లో వరుసగా మూడుసార్లు అధికారం చేపట్టిన మమతా బెనర్జీ.. నాలుగోసారి హ్యాట్రిక్ కొట్టేందుకు సిద్ధమయ్యారు. అటు, బీజేపీ సైతం అధికారం కోసం విశ్వప్రయత్నాలు చేస్తోంది. గత ఎన్నికల్లో తామే అధికారంలోకి వస్తామని భారీ అంచనాలు పెట్టుకుంది. ఎగ్జిట్ పోల్స్‌లో ఆ పార్టీకే అనుకూలమని వచ్చినా.. ఫలితాలు మాత్రం కమలానికి షాకిచ్చాయి. 2011, 2016కు మించి భారీ మెజార్టీతో మమతా బెనర్జీ గెలిచారు. ఈసారి ఏ అవకాశం వదులుకోరాదని కమలనాథులు గట్టిగానే కష్టిచేస్తున్నారు.

iyyala telangana: ఇయ్యాల తెలంగాణ తెలుగు దినపత్రిక గత 11 సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్రం నుంచి సరికొత్త వార్తా ధోరణితో పాఠకుల ఆదరణ పొందుతుంది. అనతి కాలంలోనే విశేష ఆదరణ పొంది ఏంతో మంది పాఠకులకు చెరువవుతుంది. మీ అందరి ఆధర అభిమానులతో ముందుకు వెళుతూ ఎప్పటికప్పుడు సరికొత్త వార్తా సమాచారాలను అందరికి అందించాలనే ఆకాంక్షను అందరు ఆదరిస్తూ ఉంటారని ఆశిస్తున్నాము. ప్రస్తుతం అనేక మంది వీక్షకులు, పాఠకులు ఆన్ లైన్ వార్తలనే ఎక్కువగా కోరుకుంటుండటంతో మీ ముందుకు ఎప్పటికప్పుడు నిజమైన వార్తలను ముందుచేలా చేస్తున్న ఇయ్యాల తెలంగాణ పత్రిక, ఆన్ లైన్ సామ్రాజ్యాన్ని ప్రతి ఒక్కరూ ఆదరిస్తూ ఉంటారని మా ఆకాంక్ష .....