`30 వేల Songs పాడిన ఏకైక గాయని లతా ji

👉 గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్‌లో చోటు

👉 తన గానామృతంతో యావత్ భారతీయ సినీరంగాన్నే ఉర్రూతలూగించిన గాయని భారతరత్న లతా మంగేష్కర్

👉`నేడు ఆమె వర్ధంతి

 👉`భారత ప్రభుత్వం నుండి అన్ని అత్యుత్తమ పురస్కారాలు అందుకున్న అరుదైన గాయకురాలు

ఆమె పాడితే చాలు కళాభిమానుల గుండెలు పరవళ్లు తొక్కుతాయి… ఆమె  గానామృతం యావత్ భారతీయ సినీరంగాన్నే ఉర్రూతలూగించింది. భారతీయ సినిమా చరిత్రలో ఆమె పాడిన ప్రతీ పాటదీ ఒక ప్రత్యేకత. ఆమె జీవితం ఎందరో భావి గాయక, గాయనీమణులకు ఆదర్శం. ఆమె పేరే “లతా మంగేష్కర”. భారత కోకిలగా, గాన సరస్వతిగా అభిమానులు ముద్దుగా పిలుచుకొనే ఆ మేటి గాయని అందర్ని  వదిలి 2022 ఫిబ్రవరి 6 న  92 వయస్సు లో దివికేగింది.1929 సెప్టెంబరు 28 తేదీన సుప్రసిద్ధ సంగీతకారుడు దీనానాథ్ మంగేష్కర్‌కు పెద్ద కుమార్తెగా జన్మించిన లతా మంగేష్కర్ అయిదవ ఏటనే సంగీతంపై మక్కువను పెంచుకున్నారు. కె.ఎల్ సైగల్ పాటలకుఆమె వీరాభిమాని. పదమూడేళ్ల వయసులో తండ్రి చనిపోయాక.. కుటుంబ పోషణ తన విÖద పడడంతో లతా మంగేష్కర్ సినీ రంగంలోకి నటిగా, గాయనిగా ప్రవేశించాల్సి వచ్చింది.1942లో పహ్లా మంగళ్ గౌర్ అనే చిత్రంలో నటించి, పాటలు కూడా పాడారు. గులాం హైదర్ అనే సంగీత దర్శకుడు లతను తన కన్నబిడ్డగా భావించి, ప్రోత్సహం ఇవ్వడంతో ఆమె మంచి నేపథ్య గాయకురాలిగా పేరు తెచ్చుకుంది.

తొలుత జీవన్ యాత్ర, మందిర్ లాంటి సినిమాల్లో పాటలుపాడినా, ఆ తర్వాత అల్బేలా, ఛత్రపతి శివాజీ, అనార్కలి వంటి హిట్ చిత్రాలు లత పాటలను ఎందరో అభిమానులకు చేరవేశాయి. లతా నేపథ్య గాయకురాలిగా కొనసాగుతున్న కాలంలో ఖుర్షీద్, నూర్జహాన్ గాయనిలుగా వెలుగుందుతున్నారు. దేశ విభజన సమయంలో వీరు పాకిస్థాన్ వెళ్లడం.. నేపథ్య సంగీతానికి ప్రాధాన్యత పెరగడం లతా మంగేష్కర్కు కలిసొచ్చింది. తర్వాత మంచి నేపథ్య గాయనిగా పేరు తెచ్చుకున్నారు. సినీ ప్రయాణం ప్రారంభంలోనే లతా.. ఎన్నో అవమానాలు ఎదుర్కొన్నారు. ఓ మరాఠి చిత్రం కోసం ఆమె పాడిన తొలి పాటను తొలగించారు. ఆ తర్వాత ‘మజ్‌బూర’లోని ‘దిల్ మేరా తోడా’ పాట పాడారు. ఇది విన్న వారంతా ఆమెను విమర్శించారు. దీనిని సవాలుగా తీసుకున్న ఈమె.. ఉర్దూలో సంగీత శిక్షణ తీసుకున్నారు. అనంతరం ‘మహల’ సినిమాలోని ఆయేగా ఆయేగా పాటతో లతాజీ దశ తిరిగింది. వెనుదిరిగి చూసుకోవాల్సిన అవసరం లేకుండా చేసింది.భారత ప్రభుత్వం నుండి అన్ని అత్యుత్తమ పురస్కారాలు అందుకున్న అరుదైన గాయకురాలు లతా మంగేష్కర్. ప్రముఖ శాస్రీయ గాయకురాలు ఎం.ఎస్. సుబ్బలక్క్ష్మి తరువాత ఇటువంటి ఘనత సాధించిన విశిష్ట వ్యక్తి ఈమె ఒక్కరే కావటం గమానార్హం.ఈమె 1948 నుండి 1978 వరకు 30,000 పాటలు పాడిన ఏకైక గాయనిగా లత గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్‌లో పేరు సంపాదించారు .అలాగే గానకోకిల అనే బిరుదును సొంతం చేసుకున్నారు.

ఈమె తెలుగులో సంతానం (నిదురపోరా తమ్ముడా, సుసర్ల దక్షిణామూర్తి), ఆఖరి పోరాటం (తెల్లచీరకు, ఇళయ రాజా) మొదలైన పాటలు పాడారు .టైం మేగజైన్ కవర్ పేజీ స్టోరీగా లతామంగేష్కర్ గురించి వ్యాసాన్ని ప్రచురించి ఆమెను “భారతీయ నేపథ్యగాయకుల రాణి” గా పేర్కొనడం విశేషం.లతాజీ నోట వినిపించని అందమైన రాగం లేదు. ఆమె పాటతో పరవశించని భారతీయ గీతాభిమాని లేడు. భజనలైనా, భక్తి సంకీర్తనలైనా, దేశభక్తి గీతమైనా, ప్రేమ గానమైనా, విషాద రాగమైనా, వియోగ భరిత ఆలాపన అయినా.. లతాజీ పాడిందే పాట. ఆమె నోట వినిపించిందే పాట. అందుకే ఆమె ఇంటి ముంగిట వద్దకే అనేక అవార్డులు నడుచుకుంటూ వచ్చాయి. 1969లో పద్మభూషణ్, 1999లో పద్మవిభూషణ్, 2001లో భారతరత్న పురాస్కారాలతో భారత ప్రభుత్వం ఆమెను సత్కరించింది. ఎన్‌టీఆర్, ఏఎన్నార్, మహారాష్ట్ర భూషణ్ అవార్డులను దక్కించుకున్నారు. రాజ్యసభ సభ్యత్వం ఇచ్చి కేంద్రం సన్మానించింది. భారత ప్రభుత్వం నుండి అన్ని అత్యుత్తమ పురస్కారాలు అందుకున్న అరుదైన గాయకురాలు. ప్రముఖ శాస్తీయ గాయకురాలు ఎం.ఎస్. సుబ్బలక్క్ష్మి తరువాత ఇటువంటి ఘనత సాధించిన విశిష్ట వ్యక్తి ఈమె ఒక్కరే కావటం గమానార్హం.తన గళంతో ఎన్నో అద్బుతాలు సష్టించి, కోట్లాది మంది అభిమానులను సంపాదించకున్న లతా మంగేష్కర్.. కె.ఎల్ సైగల్ పాటలకు వీరాభిమాని. 1962లో లతా మంగేష్కర్‌పై స్లో పాయిజన్‌ను ప్రయోగించారు. దీనివల్ల ఆమె దాదాపు 3 నెలల పాటు మంచం పట్టారు. ఆ విష ప్రయోగం చేసిందెవరో ఇప్పటికీ తేలలేదు. 2022 ఫిబ్రవరి 6న ముంబై బ్రీచ్ క్యాండీ ఆస్పత్రిలో లతా మంగేష్కర్ కరోనా అనంతర ఆరోగ్య సమస్యలకు చికిత్స పొందుతూ కన్నుమూసారు. చనిపోయేనాటికి ఆమె వయస్సు 92 సంవత్సరాలు.ఆమె జ్ఞాపకార్థం కేంద్ర ప్రభుత్వం రెండు రోజులు 2022 ఫిబ్రవరి 6, 7 తేదీలు  సంతాప దినాలను ప్రకటించింది.

iyyala telangana: ఇయ్యాల తెలంగాణ తెలుగు దినపత్రిక గత 11 సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్రం నుంచి సరికొత్త వార్తా ధోరణితో పాఠకుల ఆదరణ పొందుతుంది. అనతి కాలంలోనే విశేష ఆదరణ పొంది ఏంతో మంది పాఠకులకు చెరువవుతుంది. మీ అందరి ఆధర అభిమానులతో ముందుకు వెళుతూ ఎప్పటికప్పుడు సరికొత్త వార్తా సమాచారాలను అందరికి అందించాలనే ఆకాంక్షను అందరు ఆదరిస్తూ ఉంటారని ఆశిస్తున్నాము. ప్రస్తుతం అనేక మంది వీక్షకులు, పాఠకులు ఆన్ లైన్ వార్తలనే ఎక్కువగా కోరుకుంటుండటంతో మీ ముందుకు ఎప్పటికప్పుడు నిజమైన వార్తలను ముందుచేలా చేస్తున్న ఇయ్యాల తెలంగాణ పత్రిక, ఆన్ లైన్ సామ్రాజ్యాన్ని ప్రతి ఒక్కరూ ఆదరిస్తూ ఉంటారని మా ఆకాంక్ష .....