29 నుంచి దోస్త్‌ సీట్ల కేటాయింపు

హైదరాబాద్‌, మే 23 (ఇయ్యాల తెలంగాణ) : తెలంగాణలో డిగ్రీ కోర్సుల్లో అడ్మిషన్ల కోసం దోస్త్‌ ` 2025 షెడ్యూల్‌ విడుదలైన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా ఫస్ట్‌ ఫేజ్‌ రిజిస్ట్రేషన్ల గడువు  ముగిసింది. మరోవైపు వెబ్‌ ఆప్షన్ల గడువు కూడా పూర్తి కానుంది.మరికొన్ని గంటలు మాత్రమే ఉండటంతో? రిజిస్ట్రేషన్‌ చేసుకున్న అభ్యర్థులు వెంటనే ఈ ప్రక్రియను పూర్తి చేసుకోవాలని అధికారులు సూచించారు.దోస్త్‌ ఫస్ట్‌ ఫేజ్‌ కు సంబంధించి 87వేలకుపైగా విద్యార్థులు రిజిస్ట్రేషన్లుచేసుకున్నారు. వీరిలో 50 వేలకుపైగా మంది విద్యార్థులు వెబ్‌ ఆప్షన్లు ఎంచుకున్నారు. మిగిలిపోయిన విద్యార్థులు కూడా ష్ట్రబిబిజూబ://టనీబబి. ఞణణ.ణనీల.తిని వెబ్‌ సైట్‌ లోకి వెళ్లి ప్రాసెస్‌ పూర్తి చేసుకోవాల్సి ఉంటుంది. మే 29వ తేదీన ఫస్ట్‌ ఫేజ్‌ సీట్లను కేటాయించనున్నారు. దోస్త్‌ 2025 ఫస్ట్‌ ఫేజ్‌ లో సీట్లు పొందే విద్యార్థులు మే 30వ తేదీ నుంచి ఆయా కాలేజీల్లో రిపోర్టింగ్‌ చేయాలి. ఈ గడువు జూన్‌ 6వ తేదీతో ముగుస్తుంది. సీటు పొందిన కాలేజీలో రిపోర్టింగ్‌ చేయకపోతే? వారి సీటు రద్దు అవుతుంది. మొదటి సెమిస్టర్‌ తరగతులు జూన్‌ 30వ తేదీ నుంచి ప్రారంభ         మవుతాయి. దోస్త్‌ ఫస్ట్‌ ఫేజ్‌ లో సీటు పొందే విద్యార్థులు ష్ట్రబిబిజూబ://టనీబబి.ఞణణ. ణనీల.తిని/లివశ్రీఞనీఎవ.టనీ వెబ్‌ సైట్‌ నుంచి అలాట్‌ మెంట్‌ కాపీని పొందవచ్చు. ఈ కాపీతో పాటు విద్యా అర్హత పత్రాలను సంబంధిత కాలేజీలో సమర్పించి అడ్మిషన్‌ ప్రక్రియను పూర్తి చేసుకోవాల్సి ఉంటుంది.తెలంగాణ దోస్త్‌ 2025 రెండో విడత కింద మే 30 నుంచి జూన్‌ 8 వరకు రిజిస్ట్రేషన్లు జరుగుతాయి. మే 30 నుంచి జూన్‌ 9 వరకు వెబ్‌ ఆప్షన్లు ఇచ్చుకోవచ్చు. జూన్‌ 13న సీట్ల కేటాయింపు ఉంటుంది. ఇక మూడో విడత ప్రక్రియ జూన్‌ 13 నుంచి షురూ అవుతుంది. ఇందుకు జూన్‌ 19వ తేదీని తుది గడువుగా నిర్ణయించారు. జూన్‌ 13 నుంచి 19 వరకు వెబ్‌ ఆప్షన్లు ఎంచుకోవాలి. జూన్‌ 23న సీట్ల కేటాయింపు ఉంటుంది.ఇంటర్‌ పూర్తి అయిన విద్యార్థులు డిగ్రీలో ప్రవేశం కోసం దోస్త్‌ లో రిజిస్ట్రేషన్‌ చేసుకోవాల్సి ఉంటుంది. కాలేజీలను ఎంచుకోవాలి. వారి స్కోర్‌, రిజర్వేషన్‌ ఆధారంగా సీట్లను కేటాయిస్తారు. దోస్త్‌ రిజిస్ట్రేషన్ల ద్వారా తెలంగాణలోని ఉస్మానియా యూనివర్శిటీ, కాకతీయ యూనివర్శిటీ, పాలమూరు, మహాత్మగాంధీ, తెలంగాణ వర్శిటీ,చాకలి ఐలమ్మ, శాతవాహన వర్శిటీల పరిధిలోని డిగ్రీ కళాశాలల్లో ప్రవేశాలను కల్పిస్తారు.

iyyala telangana: ఇయ్యాల తెలంగాణ తెలుగు దినపత్రిక గత 11 సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్రం నుంచి సరికొత్త వార్తా ధోరణితో పాఠకుల ఆదరణ పొందుతుంది. అనతి కాలంలోనే విశేష ఆదరణ పొంది ఏంతో మంది పాఠకులకు చెరువవుతుంది. మీ అందరి ఆధర అభిమానులతో ముందుకు వెళుతూ ఎప్పటికప్పుడు సరికొత్త వార్తా సమాచారాలను అందరికి అందించాలనే ఆకాంక్షను అందరు ఆదరిస్తూ ఉంటారని ఆశిస్తున్నాము. ప్రస్తుతం అనేక మంది వీక్షకులు, పాఠకులు ఆన్ లైన్ వార్తలనే ఎక్కువగా కోరుకుంటుండటంతో మీ ముందుకు ఎప్పటికప్పుడు నిజమైన వార్తలను ముందుచేలా చేస్తున్న ఇయ్యాల తెలంగాణ పత్రిక, ఆన్ లైన్ సామ్రాజ్యాన్ని ప్రతి ఒక్కరూ ఆదరిస్తూ ఉంటారని మా ఆకాంక్ష .....