2026 నాటికి అందుబాటులోకి రానున్న బుల్లెట్‌ Train

న్యూ డిల్లీ మార్చ్‌ 19 (ఇయ్యాల తెలంగాణ) : దేశంలో ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న బుల్లెట్‌ రైలు  కు సంబంధించిన ప్రాజెక్టుపై కేంద్రం రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్‌  తాజాగా కీలక అప్‌డేట్‌ ఇచ్చారు. 2026 నాటికి ఈ రైలు అందుబాటులోకి వస్తుందని తెలిపారు.‘రైజింగ్‌ భారత్‌ సమ్మిట్‌’  లో పాల్గొన్న ఆయన బుల్లెట్‌ రైలు ప్రాజెక్టుపై మాట్లాడారు. అహ్మదాబాద్‌`ముంబై మధ్య  నిర్మిస్తున్న దేశంలోనే తొలి బుల్లెట్‌ రైలు సర్వీసును 2026 నాటికి ప్రారంభిస్తామని వెల్లడిరచారు. మొదటగా గుజరాత్‌లోని సూరత్‌ నుంచి బిలిమోరా వరకు దీన్ని నడపనున్నట్లు చెప్పారు. 2028 నాటికి ముంబై ? అహ్మదాబాద్‌ పూర్తి మార్గం అందుబాటులోకి వస్తుందని వివరించారు.ముంబై`అహ్మదాబాద్‌ మధ్య హైస్పీడ్‌ రైలు మార్గాన్ని నిర్మిస్తున్నారు. జపాన్‌ షింకన్‌సెన్‌ టెక్నాలజీని ఉపయోగించి హై`స్పీడ్‌ రైలు మార్గాన్ని కేంద్రం నిర్మిస్తున్నది. రూ.1.10 లక్షల కోట్లతో చేపట్టిన ఈ ప్రాజెక్టును 2022 నాటికి పూర్తి చేయాలని భావించినప్పటికీ భూసేకరణలో అడ్డంకులు ఎదురయ్యాయి. 2026 నాటికి దక్షిణ గుజరాత్‌లోని సూరత్‌, బిలిమోరా మధ్య మొదటి దశ బుల్లెట్‌ రైలును నడపాలని కేంద్రం లక్ష్యంగా పెట్టుకున్నది. ఇక ఈ మొత్తం కారిడార్‌ పొడవు 508.17 కిలోవిూటర్లు. ఇది అందుబాటులోకి వస్తే కేవలం 2.58 గంటల్లో అహ్మదాబాద్‌ నుంచి ముంబై చేరుకోవచ్చు.

iyyala telangana: ఇయ్యాల తెలంగాణ తెలుగు దినపత్రిక గత 11 సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్రం నుంచి సరికొత్త వార్తా ధోరణితో పాఠకుల ఆదరణ పొందుతుంది. అనతి కాలంలోనే విశేష ఆదరణ పొంది ఏంతో మంది పాఠకులకు చెరువవుతుంది. మీ అందరి ఆధర అభిమానులతో ముందుకు వెళుతూ ఎప్పటికప్పుడు సరికొత్త వార్తా సమాచారాలను అందరికి అందించాలనే ఆకాంక్షను అందరు ఆదరిస్తూ ఉంటారని ఆశిస్తున్నాము. ప్రస్తుతం అనేక మంది వీక్షకులు, పాఠకులు ఆన్ లైన్ వార్తలనే ఎక్కువగా కోరుకుంటుండటంతో మీ ముందుకు ఎప్పటికప్పుడు నిజమైన వార్తలను ముందుచేలా చేస్తున్న ఇయ్యాల తెలంగాణ పత్రిక, ఆన్ లైన్ సామ్రాజ్యాన్ని ప్రతి ఒక్కరూ ఆదరిస్తూ ఉంటారని మా ఆకాంక్ష .....