Ticker

6/recent/ticker-posts

Ad Code

Sultan shahi లో మహాత్మా జ్యోతిబా పూలే జయంతి వేడుకలు


హైదరాబాద్, ఏప్రిల్ 11 (ఇయ్యాల తెలంగాణ) : మహాత్మా జ్యోతి బా పూలే 199 వ జయంతి వేడుకలను పురస్కరించుకొని నవ తరంగిణి సామజిక సాంస్కృతిక యువజన సంక్షేమ సమితి ఆధ్వర్యంలో పాతబస్తీలోని సుల్తాన్ షాహీ అశోక్ పిల్లర్ ప్రాంతంలో ఏర్పాటు చేసిన మహాత్మా జ్యోతి బా పూలే జయంతి వేడుకలో బీజేపీ గోల్కొండ జిల్లా ఉపాధ్యక్షుడు ఎం. కుమార్, రాష్ట్ర ఎక్జ్యుక్యుటివ్ సభ్యులు పాశం సురేందర్ పాల్గొని జ్యోతి బా పూలే చిత్ర పటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్బంగా జ్యోతి రావు సేవలను కొనియాడారు. సాంఘిక, సంఘ సంస్కర్తగా పూలే చేసిన సేవలు చిరస్థాయిగా నిలిచి ఉంటాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో బి. కరంజయా, ప్రవీణ్ మిశ్రా, పి. లక్ష్మణ్, సునీల్ తివారి, ప్రవీణ్ బల్లు, ఎం. అరుణ్ కుమార్, జె. మహేష్, నరేష్ అవస్తి, కె. సురేష్, రాజు తో పాటు నవ తరంగిణి సామజిక సాంస్కృతిక యువజన సంక్షేమ సమితి అధ్యక్షులు  ఎం. ప్రేమ్ కుమార్ ఇతర ప్రముఖులు పాల్గొన్నారు. 


కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు