హైదరాబాద్, ఏప్రిల్ 05 (ఇయ్యాల తెలంగాణ) : ఎస్సీ డెవలప్ మెంట్ సొసైటీ ఆధ్వర్యంలో భట్జ్ నగర్, కందికల్ గేట్ ప్రాంతంలో భారత మాజీ ఉప ప్రధాని బాబు జగ్జీవన్ రామ్ 118 వ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్బంగా ఎస్సీ డెవలప్ మెంట్ సొసైటీ అధ్యక్షులు పులికంటి నరేష్ మాట్లాడుతూ స్వాతంత్య్ర సమరయోధుడిగా, సంఘసంస్కర్తగా తన పరిపాలనా దక్షతతో అఖండ భారతావనికి విశేష సేవలందించారని అన్నారు. మాజీ ఉప ప్రధాని డాక్టర్ బాబూ జగ్జీవన్ రామ్ గొప్ప యోధుడని ఆయనకు న హృదయ పూర్వక నమస్సుమాంజలి అని ఎస్సీ డెవలప్మెంట్ సొసైటీ అధ్యక్షులు పులికంటి నరేష్ అన్నారు. బస్తి వాసులతో కలసి పులికంటి నరేష్ భట్జ్ నగర్, కందికల్ గేట్ లో బాబు జగ్జీవన్ రామ్ జయంతి వేడుకలను నిర్వహించారు. భారత దేశంలో అనేక పదవులు నిర్వహించిన బాబు జగ్జీవన్ రామ్ అణగారిన వర్గాల అభ్యున్నతికి నిరంతరం కృషి చేసారని కొనియాడారు. ప్రధాని కావాల్సిన జగ్జీవన్ రామ్ కొందరు స్వార్థ పరుల రాజకీయాల కారణంగా అనేక ఒడిదుడుకులెదుర్కొన్నారని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో బస్తి వాసులు పి నాగేశ్వర్ రావు, బాబురావు, సునీల్, శివకుమార్,గౌతమ్, దీపు,జగన్, సోను,క్రాంతి తదితరులు పాల్గొన్నారు.
0 కామెంట్‌లు