హైదరాబాద్,ఏప్రిల్ 11 (ఇయ్యాల తెలంగాణ) : పాలడుగు నాగయ్య కళా పీఠం నవభారత్ నిర్మాణ సంఘం సంయుక్త ఆధ్వర్యంలో శనివారం రవీంద్రభారతిలో శ్రీ విశ్వ వసునామ సంవత్సర ఉగాది సంబర వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమంలో పలువురు వక్తలు,కవులు, కళాకారులు గాయకులు పాల్గొన్నారు. వేదికపై ఆసీనులైన పెద్దలు జ్యోతి ప్రజ్వలనతో కార్యక్రమాన్ని ముందుకు నడిపించారు. ఇందులో భాగంగా సమాజంలో విశిష్ట సేవలు అందించిన సీనియర్ పాత్రికేయులు, కవులు, కళాకారులను గుర్తించి ప్రత్యేక పురస్కారాలను అందజేశారు, ఈ కార్యక్రమంలో ముఖ్య అథితులుగా భారత పూర్వ మేజర్ జనరల్ శ్రీనివాసరావు, పాట్నా హైకోర్టు మాజీ పూర్వ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎల్. నర్సింహారెడ్డి పాల్గొని పలు అంశాలపై ప్రసంగించారు.
సమాజంలో ఉండాల్సిన విలువలు ప్రస్తుత సమాజ ధోరణి ఏ విధంగా ఉన్నదనే అంశాలపై విశదీకరించారు. కవులు, కళాకారుల గొప్ప తనాలను అవసరమైతే గుర్తించాలే తప్ప విమర్శలు చేయకూడదని హిత బోధ చేసారు. ఈ సందర్బంగా కార్యక్రమంలో పలువురు కళాకారులు, వాగ్గేయ కారులు, రచయితలు, వేదికపై కవితలు, పద్యాలను వినిపించారు.. కొందరు గాయకులు దేశ భక్తి గీతాలను ఆలపించి అందరినీ ఆకట్టుకున్నారు, విశిష్ట పురస్కారాలను అందుకున్న వారిలో పాతబస్తీకి చెందిన సీనియర్ జర్నలిస్ట్ టీయూడబ్ల్యూజే రాష్ట్ర కార్యదర్శి వరకాల యాదగిరి శ్రీ అల్లూరి సీతారామరాజు స్మారక పురస్కారం అవార్డును అందుకున్నారు. అయన పాత్రికేయ వృత్తిలో అందించిన సేవలను గుర్తు చేశారు. అనేక మంది కవులు, కళాకారులూ, గాయకులు పురస్కారాలను అందుకున్నారు.
0 కామెంట్‌లు