హైదరాబాద్, ఏప్రీల్ 18 (ఇయ్యాల తెలంగాణ) : పాతనగరంలో వర్షం దంచి కొడుతోంది. ఈ రోజు ఉదయం నుంచి ఎండగా ఉన్న వాతావరణం కాస్త సాయంత్రం 4 గంటల తరువాత ఒక్కసారిగా చల్ల బడింది. వర్షం సూచనలు కనిపిస్తోన్న, వర్ష సూచనలు అంతగా లేవనే వెదర్ రిపోర్ట్ సూచించింది. కానీ ఆ సూచనలకు వ్యతిరేకంగా వర్షం దంచి కొట్టింది. ఎప్పటిలాగే లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమయ్యాయి . ఉరుములతో కూడిన వర్షం ఒక్కసారిగా వాతావరణాన్ని మార్చేసింది. ఏకధాటిగా కురుస్తున్న వర్షంతో రోడ్లనీ కాలువలను తలపిస్తున్నాయి. ముఖ్యంగా ఛత్రినాక, లలితా బాగ్, ఉప్పుగూడ , భవానీ నగర్, ఫలక్ నుమా ప్రాంతాల్లో రోడ్లన్నీ వర్షం నీటి తో నిండి పోయాయి. సాయంత్రం వేల అప్పుడప్పుడే బయటకు వెళ్లిన ప్రయాణీకులంతా తీవ్ర ఇబ్బందులు పడ్డారు.
0 కామెంట్‌లు