Ticker

6/recent/ticker-posts

Ad Code

Old City లో హనుమాన్ జన్మోత్సవ్ వేడుకలకు ఏర్పాట్లు పూర్తి !

 

హైదరాబాద్, ఏప్రిల్ 11 (ఇయ్యాల తెలంగాణ) : పాతనగరంలో హనుమాన్ జన్మోత్సవ్ వేడుకలకు ప్రధాన ఆలయాలన్నీ ముస్తాబయ్యాయి. శనివారం జరుగనున్న హనుమాన్ జన్మోత్సవ్ కార్యక్రమంలో అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని హనుమాన్ జన్మోత్సవ్ ను విజయవంతం చేయాలని ఆలయ కమిటీ సభ్యులు పిలుపు నిచ్చారు. ప్రధానంగా అలియాబాద్, లాల్ దర్వాజా , ఉప్పుగూడ, ఛత్రినాక, చాంద్రాయణ గుట్ట,సుల్తాన్ షాహీ, కవేలి కమాన్,శాలిబండ ఆలయాలతో పాటు గౌలిగూడ, గోషామహల్, సిద్ధంబర్ బజార్,బేగంబజార్, గొల్ల కిడికి, చార్మినార్, మూసబౌలి తదితర ప్రాంతాలలోని ప్రధాన దేవాలయాలు హనుమాన్ జన్మోత్సవ్ వేడుకలకు ముస్తాబయ్యాయి. జన్మోత్సవ్ వేడుకలకు హాజరయ్యే భక్తులకు ఆలయ కమిటీ సభ్యులు మందు, మాంసం సేవించరాదని సందేశ మందించారు. హనుమాన్ జన్మోత్సవ్ ర్యాలీలో పాల్గొనే భక్తులు విధిగా కాషాయ దుస్తులు ధరిస్తే మంచిదని ఆలయ నిర్వాహకులు పేర్కొన్నారు. తెల్లవారు ఝాము నుంచే హనుమంతుడికి సింధూరం ఎక్కించడం లాంటి ప్రత్యేక కార్యక్రమాలు ఉంటాయని ఆలయ నిర్వాహుకులు తెలిపారు. కొన్ని ఆలయాల వద్ద హనుమాన్ జన్మోత్సవ్ ను పురస్కరించుకొని అన్న ప్రసాద వితరణ కార్యక్రమాలు కొనసాగుతాయని అన్నారు. ఇప్పటికే హనుమాన్ జండాలతో ప్రధాన ద్వారాలన్నీ పండుగ వాతావరణాన్ని సంతరించుకున్నాయి.      


కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు