హైదరాబాద్, ఏప్రిల్ 18, (
ఇయ్యాల తెలంగాణ) : మందు బాబులకు తిప్పలు తప్పడం లేదు. ఇది వారికి షాకింగ్ న్యూస్ అనే చెప్పవచ్చు. త్వరలోనే మళ్లీ మద్యం ధరలు పెంచేందుకు తెలంగాణ ప్రభుత్వం సిద్ధమైంది. ఇప్పటికే బీర్ల ధరలను 15 శాతం పెంచిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు లిక్కర్ ధరలు పెంచాలనే ఆలోచనలో ఉన్నట్టు తెలుస్తోంది.ఒక చీప్ లిక్కర్ తప్ప.. రూ.500 కంటే ఎక్కువ ఉన్న మందు బాటిళ్లపై కనీసం 10 శాతం పెంచనున్నట్లు తెలుస్తోంది. దీన్ని బట్టి ప్రతి లిక్కర్ బాటిల్‌పై కనీసం రూ. 50 పెరిగే అవకాశం ఉంది. ఎక్సైజ్ అధికారులతో, ఇతరు ముఖ్య అధికారులతో సవిూక్షించిన అనంతరం ధరల పెంపుపై ప్రభుత్వం తుది నిర్ణయం తీసుకోనున్నట్లు సమాచారం. త్వరలోనే.. మద్యం ధరలను పెంచి ఆ వివరాలను ప్రభుత్వానికి నివేదించనున్నట్లు తెలుస్తోంది. మద్యం ధరలు పెంచడం ద్వారా ఏడాదికి తక్కువలో తక్కువ అనుకున్నా రూ. 2000 కోట్లు అదనపు ఆదాయం రాష్ట్ర ప్రభుత్వానికి ఉంటుందని అధికారులు అంచనా వేస్తున్నట్టు తెలుస్తోంది.రెండు నెలల క్రితం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం బీర్ల ధరలను పెంచిన విషయం తెలిసిందే. రాష్ట్ర ప్రభుత్వం బీర్ల ధరలను దాదాపు 15 శాతం వరకు పెంచింది. దీనివల్ల ఒక్కో బీరుపై సగటున రూ. 20 నుంచి రూ. 30 వరకు ధర పెరిగిన విషయం తెలిసిందే. ఈ ధరలకే మందు బాబులు తలలు బాదుకుంటున్నారు. తాజాగా లిక్కర్ బాటిళ్లపై కూడా మద్యం ధరలు సైతం పెరుగుతాయని వార్తలు వస్తుండటంతో మందుబాదులకు తిప్పడం తప్పడం లేదు.
0 కామెంట్‌లు