Ticker

6/recent/ticker-posts

Ad Code

MRPS ఆధ్వర్యంలో జగ్జీవన్ రామ్ జయంతి వేడుకలు


హైదరాబాద్, ఏప్రీల్ 5 (ఇయ్యాల తెలంగాణ) :  ఎమ్మార్పీఎస్ ఆధ్వర్యంలో భారత మాజీ ప్రధాని స్వర్గీయ డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ 118 వ జయంతి వేడుకలను పాతబస్తీ ఛత్రినాక చౌరస్తాలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అనేక మంది సంఘ సేవకులు ఎస్సీ కుల సంఘాల నాయకులు అధిక సంఖ్యలో పాల్గొని బాబు జగ్జీవన్ రామ్ చిత్ర పటానికి నివాళులు అర్పించడం జరిగింది. ఎమ్మార్పీఎస్ రాష్ట్ర సీనియర్ నాయకులు బండి నరేష్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన బాబు జగ్జీవన్ రామ్ జయంతి వేడుకల్లో ఛత్రినాక ఇన్ స్పెక్టర్ లు ప్రసాద్ వర్మ, ఆర్. ప్రేమ్ కుమార్ లు ముఖ్య అతిథిగా పాల్గొని బాబూ జగ్జీవన్ రామ్ చిత్ర పటానికి పూల మాలలు వేసి నివాళులు అర్పించారు. మహనీయులు చూపిన సన్మార్గంలో అందరూ ముందుకు నడవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ప్రముఖ సంఘ సేవకులు రాజపాగ అర్జున్ బిజెపి నాయకులు ఆదర్ల మహేష్, పండరి నాథ్, ఎస్సీ కుల సంఘాల నాయకులు వర్కాల సత్యనారాయణ, ఆడాల శివ కుమార్, పార్వతి నరేశ్, ఎం. ముత్యాలు, ఏ, కృష్ణా రావు, ఎమ్మార్పీఎస్ నాయకులు ముక్కెర రమేష్, దార్ల యాదగిరి, జి. లక్ష్మణ్, ఎన్.శంకర్, ఎం. రాజు,వి. శివ కుమార్, ఇతర ప్రముఖులు పాల్గొని బాబు జగ్జీవన్ రామ్ కు ఘన నివాళులు అర్పించారు.  


కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు