Ticker

6/recent/ticker-posts

Ad Code

హైదరాబాద్‌ MLC ఎన్నికల్లో సత్తాచాటిన MIM


హైదరాబాద్‌, ఏప్రిల్‌ 25, (ఇయ్యాల తెలంగాణ) : హైదరాబాద్‌ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఊహిచిందే జరిగింది. నగరంలో పట్టున్న మజ్లిస్‌ పార్టీ ఎమ్మెల్సీ ఎన్నికల్లో విజయం గెలిచింది. ఎంఐఎం అభ్యర్థి విూర్జా రియాజ్‌ ఉల్‌ హాసన్‌ కు 63 ఓట్లు రాగా, బీజేపీ అభ్యర్థి గౌతమ్‌ రావుకు 25 ఓట్లు వచ్చాయి. దాంతో హైదరాబాద్‌ స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా రియాజ్‌ ఉల్‌ హాసన్‌ విజయం సాధించారు. పార్టీ అభ్యర్థి ఘన  విజయం సాధించడంపై ఎంఐఎం అధినేత, హైదరాబాద్‌ ఎంపీ అసదుద్దీన్‌ ఒవైసీ హర్షం వ్యక్తం చేశారు. అభ్యర్థి రియాజ్‌ ఉల్‌ హసన్‌ ను అభినందించారు. ఈ ఎన్నికలకు అధికార పార్టీ కాంగ్రెస్‌, ప్రతిపక్ష బీఆర్‌ఎస్‌ దూరంగా ఉన్నాయని తెలిసిందే.22 ఏళ్ల తర్వాత హైదరాబాద్‌ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ స్థానానికి ఎన్నికలు నిర్వహించార. అధికార కాంగ్రెస్‌, ప్రతిపక్ష బీఆర్‌ఎస్‌ పార్టీలు ఈ ఎన్నికకు దూరంగా ఉంటున్నట్లు ప్రకటించాయి. మరోవైపు అనూహ్యంగా బీజేపీ అభ్యర్థిని బరిలో దింపడంతో ఎన్నిక అనివార్యమైంది. ఎంఐఎం నుంచి రియాజ్‌ ఉల్‌ హాసన్‌ బరిలో నిలవగా, బీజేపీ గౌతం రావును బరిలోకి దింపింది. ఏప్రిల్‌ 23వ తేదీన హైదరాబాద్‌ స్థానిక సంస్థల ఎన్నిక జరిగింది. మొత్తం 112 మంది ఓటర్లు ఉండగా.. వీరిలో 81 మంది కార్పొరేటర్లు,  31 మంది ఎక్స్‌ అఫీషియో సభ్యులు ఓటర్లుగా ఉన్నారు. ఎక్స్‌ అఫీషియో సభ్యులలో 14 మంది ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, 9 మంది ఎంపీలు ఉన్నారు. ఎక్స్‌ అఫీషియో సభ్యులతో కాంగ్రెస్‌కు 7, బీజేపీకి 6.. ఎంఐఎంకు 9, బీఆర్‌ఎస్‌ కు 9 ఓట్లు ఉన్నాయి.  49 మంది ఓటర్లతో ఎంఐఎంకు ఎక్కువ సంఖ్యా బలం ఉంది. వీరికి అదనంగా మరో 14 పోలవడంతో రియాజ్‌ ఉల్‌ హసన్‌ ఈ ఎన్నికల్లో విజయకేతనం ఎగురవేశారు. బీజేపీ అభ్యర్థికి కేవలం 25 ఓట్లు వచ్చాయి.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు