హైదరాబాద్, ఏప్రీల్ 25 (
ఇయ్యాల తెలంగాణ) : పహల్గాం ఉగ్రవాద దాడిని ఖండిస్తూ ఎంఐఎం అధినేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ వినూత్న రీతిలో నిరసన తెలిపారు.ప్రార్థనలకు ముందు శాస్త్రిపురంలోని మసీదు వద్ద ఆయన ఈ నిరసన కార్యక్రమంలో పాల్గొన్నారు. చార్మినార్, మక్కామసీదు పరిసర ప్రాంతాల్లో పోలీసుల బందోబస్తు ఏర్పాటు చేశారు.ప్రార్థనల కోసం మసీదుకు వచ్చిన వారికి అసదుద్దీన్ ఒవైసీ స్వయంగా నల్ల బ్యాడ్జీలను పంపిణీ చేశారు. తాను కూడా చేతికి నల్ల బ్యాడ్జీ ధరించారు. పహల్గాం ఉగ్రదాడికి వ్యతిరేకంగా నిరసన తెలిపేందుకు అందరూ నల్ల బ్యాడ్జీలు ధరించాలని ఆయన అక్కడి వారికి పిలుపునిచ్చారు. ఉగ్రవాద చర్యలను తీవ్రంగా ఖండిరచాల్సిన అవసరం ఉందని ఆయన ఈ సందర్భంగా పేర్కొన్నారు.
0 కామెంట్‌లు