Ticker

6/recent/ticker-posts

Ad Code

ఉగ్రవాదులతో పాకిస్తాన్‌ కు Link !


శ్రీనగర్‌, ఏప్రిల్‌ 25 (ఇయ్యాల తెలంగాణ) : అనంత్‌ నాగ్‌ జిల్లాలోని పహల్గాం దాడిని భారత్‌ సీరియస్‌గా తీసుకుంది. భారత బలగాలు ఉగ్రవాదుల ఏరివేత చేపట్టారు. ఈ క్రమంలో ఉగ్రవాదులకు సంబంధించి గూఢచర్య నివేదికలో సంచలన విషయాలు వెల్లడయ్యాయి. పహల్గాం దాడిని లష్కర్‌`ఏ తోయిబా డిప్యూటీ చీఫ్‌ సైఫుల్లా కసురి ప్లాన్‌ చేశాడు. ఈ దాడికి సంబంధించి ఫిబ్రవరిలో సమావేశమయ్యారు. సైఫుల్లా ఐదుగురు ఉగ్రవాదులను జమ్మూకాశ్మీర్‌ లో ఉగ్రదాడికి సిద్ధం చేశాడు. ఆ తరువాత మార్చిలో ఆ ఉగ్రవాదులు మరోసారి సమావేశమయ్యారు. జమ్ము? కశ్మీర్‌ లోని పహల్గాంలో పర్యాటకులపై జరిగిన ఉగ్రవాద దాడిలో పాకిస్తాన్‌ కు లింక్‌ ఉందని తేలింది. పహల్గాం దాడికి ఈ ఏడాది ఫిబ్రవరి నుంచే ప్లానింగ్‌ ప్రారంభమైంది. లష్కర్‌ ఏ తోయిబా డిప్యూటీ చీఫ్‌ సైఫుల్లా ఆదేశాలతో ఉగ్రదాడి ప్లాన్‌ ప్రారంభమైంది. ఉగ్రవాదులు మొదటి సమావేశం ఫిబ్రవరిలో జరిగింది. ఆ తరువాత మార్చిలో విూర్‌ పూర్‌లో మరోసారి సమావేశమై దాడుల గురించి మరింతగా చర్చించారు. ఈ సమావేశంలో పహల్గాంలో దాడి గురించి ప్లాన్‌ చేశారని నివేదికలో సంచలన విషయాలు వెలుగుచూస్తున్నాయి. తమకు ఏం సంబంధం లేదని పాకిస్తాన్‌ ప్రభుత్వం చెబుతున్నా.. ఆ ఉగ్రవాదులకు పాకిస్తాన్‌ సైన్యం కూడా సహాయం చేసింది.  లష్కర్‌ ఏ తోయిబా డిప్యూటీ చీఫ్‌ కమాండర్‌ సైఫుల్లా ఐదుగురుఉగ్రవాదులతో ఫిబ్రవరి, మార్చి నెలలో సమావేశం అయ్యాడు. ఫిబ్రవరి విూటింగ్‌ తరువాత విూర్‌ పూర్‌ లో పహల్గాం దాడికి ప్లాన్‌ తయారుచేశారు. 

సైఫుల్లా తో సమావేశంలో అబూ మూసా, ఇద్రీస్‌ షాహీన్‌, మొహమ్మద్‌ నవాజ్‌, అబ్దుల్‌ రఫా రసూల్‌, అబ్దుల్లా ఖాలిద్‌ అనే ఉగ్రవాడులు పాల్గొన్నారు. మరోవైపు సైఫుల్లాకు ఎూఎ నుండి ఆదేశాలు వచ్చాయి.  లష్కర్‌ డిప్యూటీ చీఫ్‌ సైఫుల్లా పాకిస్తాన్‌ సైన్యంతో సంప్రదింపులు జరిపేవాడు. ఈ క్రమంలో పాక్‌ ఆర్మీ శిబిరానికి వెళ్లాడు. బహావల్‌ పూర్‌ లోని ప్రధాన కార్యాలయంలో పాకిస్తాన్‌ సైన్యం కెర్నల్‌ ఉగ్రవాది సైఫుల్లాకు ఆహ్వానించాడు. దీనికి సంబంధించిన ఫొటోలు కూడా బయటకు వస్తున్నాయి. పాకిస్తాన్‌ ఆక్రమిత కశ్మీర్‌ లో దీనికి సంబంధించి ఒక కార్యక్రమం జరిగింది.  ఏప్రిల్‌ 18 న రావల్కోట్‌ లో ఉగ్రవాదుల సమావేశం జరిగింది. దీని వీడియో బయటకు రాగా, అందులో సైఫుల్లాతో పాటు ఐదుగురు ఉగ్రవాదులు కనిపించారు. పహల్గాం దాడితో సంబంధం ఉందని అనుమానిత స్థానిక ఉగ్రవాది అదిల్‌ గురి ఇల్లును భద్రతా దళాలు బాంబు పేల్చి ధ్వంసం చేశాయి. బిజ్బెహెరా ప్రాంతంలో ఉగ్రవాది అదిల్‌ గురి ఇల్లు ఉందని సమాచారం తెలుసుకుని బలగాలు ధ్వంసం చేశాయి. త్రాల్‌ లోని ఆసిఫ్‌ షేక్‌ ఇంటిని భారత బలగాలు కూల్చివేశాయి. మరోవైపు బండిపొరలో జరిగిన ఎన్‌ కౌంటర్‌ లో అల్తాఫ్‌ లల్లీ అనే లష్కే తోయిబా టాప్‌ కమాండర్‌ హతమయ్యాడు. ఇద్దరు సైనికులకు గాయాలయ్యాయి.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు