రాయచోటి, ఏప్రిల్ 26 (ఇయ్యాల తెలంగాణ) : మూగజీవాల ఆరోగ్య సంరక్షణలో పశువైద్యుల సేవ అనిర్వచనీయమని జిల్లా సంయుక్త కలెక్టర్ ఆదర్శ రాజేంద్రన్ పేర్కొన్నారు.శనివారం ఉదయం రాయచోటి కలెక్టరేట్లోని పిజిఆర్‌ఎస్ హాల్లో జిల్లా సంయుక్త కలెక్టర్ అధ్యక్షతన జిల్లా పశుసంవర్ధక శాఖ ఆధ్వర్యంలో ప్రపంచ పశు వైద్య దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు.ఈ సందర్భంగా జిల్లా సంయుక్త కలెక్టర్ మాట్లాడుతూ పశువైద్యుల సేవలను గౌరవించడం మరియు పశువుల ఆరోగ్య సంరక్షణలో వారి పాత్రను గుర్తించడానికి ప్రపంచ పశు వైద్య దినోత్సవాన్ని ప్రతి సంవత్సరం ఏప్రిల్ చివరి శనివారం రోజున జరుపుకుంటున్నామన్నారు. రాష్ట్రంలో గ్రావిూణ ప్రజల ముఖ్య జీవనాధారం వ్యవసాయము మరియు పశు పోషణ అని పేర్కొన్నారు. పశు పోషణలో రైతులకు.గొర్రెలు, మేకలు, పందుల మాంసం, కోళ్ల నుంచి గుడ్లు, మాంసం ఉత్పత్తితో పెంపకం దారులకు ఆదాయం లభిస్తుందన్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న కొన్ని కోట్ల మూగజీవాలకు పశువైద్య సిబ్బందే కొండంత అండగా నిలుస్తున్నారన్నారు. పశు ఆసుపత్రుల్లో మందులు పంపిణీ చేయడంతో పాటు వాటి పునరుత్పత్తికి కృత్రిమ గర్భధారణ, శస్త్రచికిత్సలు, వ్యాధి నిరోధక టీకాలు, సంచార వాహనాల ద్వారా పశువులకు ఇంటి వద్దే అత్యవసర వైద్య సేవలు అందిస్తున్నారు అన్నారు. మూగ జీవాలను చీదరించుకోకుండా విశిష్ఠ సేవలు అందిస్తున్న పశువైద్యులను గౌరవించుకోవడం ప్రతి ఒక్కరి బాధ్యత అన్నారు.
ఈ సందర్భంగా డిఆర్‌ఓ మధుసూదన్ రావు మాట్లాడుతూ.పశు వైద్యులు కేవలం జంతు వైద్యులు మాత్రమే కాదని, ప్రజారోగ్య రక్షణలో ఫ్రంట్ లైన్ వారియర్స్ అని కొనియాడారు. పశువులు ఆరోగ్యంగా ఉన్నప్పుడే ప్రజారోగ్యం బాగుంటుందన్నారు. ముఖ్యంగా గ్రావిూణ ప్రాంతంలో ప్రజలు మరియు పశువులు కలిసి జీవించడం జరుగుతుందని, పశువుల ఆరోగ్యం బాగుంటేనే గ్రావిూణ ప్రజల ఆరోగ్యం బాగుంటుందన్నారు. తనకు స్వతహాగా మూగజీవాలంటే ప్రేమ అని, తనకు కూడా పశు వైద్య అంటే ఇష్టమని అయితే అనుకొని పరిస్థితులలో రెవెన్యూ శాఖ అధికారిగా పనిచేస్తున్నానన్నారు. మూగజీవాలు కేవలం గ్రావిూణ ప్రాంతాల ప్రజలకు మాత్రమే సేవలందించడం లేదని, పోలీసు శాఖ అధికారులకు శాంతి భద్రతల పరిరక్షణలో విశేష సేవలు అందిస్తున్నాయన్నారు. ఈ సందర్భంగా జిల్లా పశుసంవర్ధక శాఖ అధికారి గుణశేఖర్ పిళ్ళై మాట్లాడుతూ. మూగజీవాల సంరక్షణలో ఉన్న పశుసంవర్ధక శాఖ అధికారిగా ఉన్నందుకు, మరియు వాటి సంరక్షణ మరియు పోషణలో భాగమైనందుకు ఎంతో ఆనందంగా ఉందని పేర్కొన్నారు. ఈ సంవత్సరం పశువైద్య దినోత్సవాన్ని ‘‘యానిమల్ హెల్త్ టేక్స్ ఎ టీం’’ అనే దీంతో జరుపుకుంటున్నామన్నారు. మహాత్మా గాంధీ చెప్పినట్లుగాఒక దేశ నైతిక అభివృద్ధి ఆ దేశ పశువుల పట్ల ప్రజలు ప్రవర్తించే విధానంపై ఆధారపడి ఉంటుందన్నారు. ఏ దేశమైనా ఆర్థిక అభివృద్ధి తో పాటు నైతిక అభివృద్ధి సాధించినప్పుడే అభివృద్ధి చెందిన దేశంగా పరిగణించబడుతుందన్నారు. నైతిక అభివృద్ధి సాధించాలంటే పశువుల పట్ల మానవతా దృక్పథంతో ఉండాలనన్నారు. ఈ సందర్భంగా డాక్టర్ విశ్వేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ మూగజీవాలకు సేవలు అందించడం ఎంతో ఆనందం కలిగిస్తుందన్నారు. జిల్లాలోని పలు పశువైద్యశాలలలో టాయిలెట్లు సరిగా లేవని, వాటికి తగిన చర్యలు తీసుకోవాలని జిల్లా రెవెన్యూ అధికారిని కోరారు.
ఈ సందర్భంగా అత్తిరాల పశు వైద్యురాలు డాక్టర్ భాగ్యవతి మాట్లాడుతూ.ప్రస్తుత సామాజిక పరిస్థితులలో ఉమ్మడి కుటుంబాలు కనుమరుగైన నేపథ్యంలో మూగజీవాలు మనుషులకు అండగా నిలుస్తున్నాయని, వాటికి సోకే వ్యాధుల పట్ల ప్రతి ఒక్కరు అవగాహన కలిగి ఉండాలని సూచించారు. ఈ సమావేశంలో డిఆర్‌ఓ మధుసూదన్ రావు, జిల్లా పశుసంవర్ధక శాఖ అధికారి గుణశేఖర్ పిళ్ళై, మదనపల్లి, రాజంపేట, రాయచోటి ఉపసంచాలకులు సత్యనారాయణరావు, విజయభాస్కర రావు,విజయకుమార్, మరియు సహాయ సంచాలకులు, జిల్లాలో పనిచేస్తున్న పశు వైద్యులు మరియు సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.అనంతరం అన్నమయ్య జిల్లా పెద్దమండ్యం మండలంలో పర్యటించారు.మండలంలో పారిశుద్ధ కార్యక్రమాలను పటిష్టంగా అమలు చేయాలని... రోడ్ల పక్కన పేర్కొన్న చెత్తాచెదారాలను తొలగించి గ్రామాన్ని పరిశుభ్రంగా ఉంచాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.
పెద్దమండెం మండలంలో కలెక్టర్ ఆకస్మికంగా పర్యటించారు. ఈ సందర్భంగా మొదట మండల కేంద్రంలోని చెత్త నుండి సంపద తయారీ కేంద్రాన్ని పరిశీలించారు. అక్కడ తడి చెత్త, పొడి చెత్త మరియు ప్లాస్టిక్ ను వేర్వేరు చేయకుండా ఉండడంపై ఇన్చార్జ్ ఎంపీడీవో శ్రీధర్ రావు, పంచాయతీ సెక్రెటరీ సుబ్రహ్మణ్యం, డిఎల్పిఓ నాగరాజు ల పని తీరుపై అసంతృప్తి వ్యక్తం చేశారు. అనంతరం స్థానిక తాసిల్దార్ కార్యాలయంలో మండల అధికారులతో సమావేశం నిర్వహించారు.
0 కామెంట్‌లు