Ticker

6/recent/ticker-posts

Ad Code

Hyderabad లో నలుగురు పాకిస్థానీలకు నోటీసులు !


హైదరాబాద్‌, ఏప్రీల్ 26 (ఇయ్యాల తెలంగాణ) :  హైదరాబాద్‌ లో 4 గురు పాకిస్థానీలకు పోలీసులు నోటీసులు  జారీ చేసారు. ఈ నలుగురు షార్ట్‌ టర్మ్‌ వీసా (ూుప) హోల్డర్స్‌ గా ఉన్నట్టు గుర్తించారు. ఆదివారం లోగా హైదరాబాద్‌ విడిచి వెళ్లాలని నోటీస్‌ లో పోలీసులు పేర్కోన్నారు. హైదరాబాద్‌ , సైబరాబాద్‌, రాచకొండ మూడు కమిషనరేట్‌ లో కలిపి 213 మంది పాకిస్తానీ లు వున్నారు. వీరిలో నలు గురు షార్ట్‌ టర్మ్‌ వీసా మినహాయిస్తే  మిగతా అందరికీ లాంగ్‌ టర్మ్‌ వీసాలు (ఒుప) ఉన్నట్టు గుర్తించారు. లాంగ్‌ టర్మ్‌ వీసా లు కలిగిన పాకిస్తానీలకు కేంద్రం మినహాయింపు ఇచ్చింది. దీంతో షార్ట్‌ టర్మ్‌ వీసా కలిగిన నాలుగు పాకిస్తానీ లకు హైదరాబాద్‌ పోలీసులు నోటీసులు ఇచ్చారు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు