Ticker

6/recent/ticker-posts

Ad Code

కులం, మతం పేరుతో రాజకీయాలు తప్ప.. BJPకి అభివృద్ధి పట్టదు !

బిజెపి పార్టీపై టీపిసిసి అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌ గౌడ్‌ ఫైర్‌  


హైదరాబాద్‌ ఏప్రిల్‌ 18 (ఇయ్యాల తెలంగాణ) :  బిజెపి పార్టీపై టీపిసిసి అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌ గౌడ్‌ ఫైరయ్యారు.  కులం, మతం పేరుతో రాజకీయాలు తప్ప.. బిజెపికి అభివృద్ధి పట్టదని విమర్శించారు. ఈ మేరకు ఆయన విూడియాతో మాట్లాడుతూ.. కిషన్‌ రెడ్డి వ్యాఖ్యలపై మండిపడ్డారు. బిజెపి నేతలు ఇంకెన్నాళ్లు రజాకార్ల గురించి మాట్లాడతారు? ప్రశ్నించారు.వాళ్లు మతం గురించి తప్ప.. అభివృద్ధి గురించి ఎప్పుడైనా మాట్లాడారా? అని దుయ్యబట్టారు. రాష్ట్రంలో సన్నం బియ్యం ఇస్తున్నామని.. బిజెపి పాలిత రాష్ట్రాల్లో సన్నబియ్యం ఇస్తున్నారా? నిలదీశారు. బిజెపి ప్రభుత్వం సన్నబియ్యం ఇస్తున్న రాష్ట్రాల్లో మోదీ ఫొటో పెట్టుకోవాలని మహేశ్‌కుమార్‌ గౌడ్‌ అన్నారు.కాగా, హైదరాబాద్‌ స్థానికసంస్థల ఎమ్మెల్సీ ఎన్నికలపై బిజెపి సమావేశం నిర్వహించింది. ఈ సందర్భంగా బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్రమంత్రి కిషన్‌ రెడ్డి విూడియాతో మాట్లాడారు. ఎంఐఎం పార్టీకి కాంగ్రెస్‌, బిఆర్‌ఎస్‌ జీ హుజూర్‌ అంటూ సలాం కొడుతున్నాయని కిషన్‌ రెడ్డి విమర్శలు గుప్పించారు. కాంగ్రెస్‌, బిఆర్‌ఎస్‌ ఎందుకు పోటీచేయడం లేదో ప్రజలకు చెప్పాలని నిలదీశారు. మజ్లిస్‌ మోచేతి నీళ్లు తాగుతూ బిజెపిని విమర్శించే నైతిక హక్కు కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ, బిఆర్‌ఎస్‌ అధినేత, మాజీ సిఎం కేసీఆర్‌కు ఉందా? అని ఆయన ప్రశ్నించారు. తాము రజాకార్ల వారసులకు వ్యతిరేకంగా పోరాటం చేస్తామని కిషన్‌ రెడ్డి అన్నారు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు