హైదరాబాద్, ఏప్రిల్ 11 (ఇయ్యాల తెలంగాణ) : భరతమాత ముద్దు బిడ్డ, బడుగు, బలహీన వర్గాల ఆశాజ్యోతి మహాత్మా జ్యోతిబా ఫూలే అని అఖిలభారత ముదిరాజ్ కోహ్లీ ఎగ్జిక్యూటివ్ మెంబర్ పొట్లకాయల వెంకటేశ్వర్ ముదిరాజ్ అన్నారు. మహాత్మా జ్యోతి బా పూలే 199 వ జయంతి వేడుకలను పురస్కరించుకొని వెంకటేశ్వర్ జ్యోతి బా పూలే చిత్ర పటానికి పూల మాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ సమాజంలో అంటరానితనాన్ని రూపు మాపడానికి జ్యోతి బా పూలే చేసిన సేవలు ఎనలేనివని గుర్తు చేశారు. సామాజిక సంస్కర్త, మహిళా విద్యాభివృద్ధికి మార్గదర్శి అయిన నిత్య స్ఫూర్తి ప్రదాత మహాత్మా జ్యోతిబా ఫూలే ఆశయాల కనుగుణంగా ప్రతి ఒక్కరు ముందుకు వెళ్లాలని పొట్లకాయల వెంకటేశ్వర్ ముదిరాజ్ కోరారు.
0 కామెంట్‌లు