హైదరాబాద్, ఏప్రీల్ 18 (ఇయ్యాల తెలంగాణ) : తెలంగాణలో ఇంజనీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించే ఎంసెట్ `2025 పరీక్ష కు హల్ టికెట్స్ సంబంధించి తేదీలను ప్రకటించారు అధికారులు.ఈ సారి మొట్టమొదటిసారిగా హాల్ టిక్కెట్ పైన క్యూ ఆర్ కోడ్ తో పరీక్ష కేంద్రానికి సంబంధించిన వివరాలు తో పాటు నేరుగా అక్కడికి వెళ్లి వీలుగా అభివృద్ధి చేసాము అని అన్నారు. అగ్రికల్చర్ మరియు ఫార్మసీ విభాగానికి సంబంధించి ఈ నెల 19వ తేదీ నుండి హాల్ టికెట్స్ డౌన్లోడ్ చేసుకోవచ్చు అని తెలిపారు. ఏప్రిల్ 29వ తేదీ నుండి 30వ తేదీ వరకు పరీక్షను నిర్వహిస్తున్నామని అన్నారు.
ఇంజనీరింగ్ విభాగానికి సంబంధించి 22 వ తేదీ నుండి హాల్ టికెట్స్ అందుబాటులో ఉండనున్నాయి అని మే 2వ తేదీ నుండి 4వ తేదీ వరకు పరీక్ష జరగనున్నాయి. రెండు విభాగాలకు సంబంధించి ఉదయం 9 గంటల నుండి 12 గంటల వరకు అదేవిధంగా మధ్యాహ్నం 3 గంటల నుండి 6 గంటల వరకు రెండు సెషన్స్ లో పరీక్ష నిర్వహిస్తాము అని అన్నారు. ఒక్క నిమిషం పరీక్ష సెంటర్ కి లేట్ వచ్చిన అనుమతి ఇవ్వం అని తేల్చిన చెప్పారు. పరీక్షల కోసం తెలంగాణ వ్యాప్తంగా 16 టెస్ట్ జోన్ ఏర్పాటు చేయడం తో పాటు ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఏర్పాటు చేస్తున్నాం అని అన్నారు. ఇంజనీరింగ్ విభాగానికి సంబంధించి రెండు లక్షల 19 వేల 420 దరఖాస్తు చేసుకున్నారు. అగ్రికల్చర్ మరియు ఫార్మసీకి సంబంధించి 86 వేల 101 మంది , రెండు విభాగానికి సంబంధించి 253 మంది విద్యార్థులు భరిస్తూ చేసుకున్నారు.
0 కామెంట్‌లు