Ticker

6/recent/ticker-posts

Ad Code

రానున్న రోజుల్లో ఎండలు మండిపోతాయి ! Weather Alert

 హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం హెచ్చరికలు జారీ

హైదరాబాద్‌ మార్చి 1 (ఇయ్యాల తెలంగాణ) : ఈ ఏడాది ఫిబ్రవరిలోనే భానుడు తన ప్రతాపం చూపించడం ప్రారంభించాడు. అయితే రాష్ట్రంలో రానున్న రోజుల్లో ఎండలు మండిపోతాయి అంటూ.. హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం హెచ్చరికలు జారీ చేసింది. మార్చి, ఏప్రిల్‌, మే నెలల్లో ఎండలు తీవ్రంగా ఉంటాయని, ఇక ఏప్రిల్‌, మేలలో 44 నుంచి 46 డిగ్రీల వరకూ ఉష్ణోగ్రతలు నమోదు కావచ్చని అంచనా వేసింది.1901 నుంచి 2025 వరకు సరాసరి సగటు తీసుకుంటే.. ఈ ఏడాది ఎండ తీవ్రత ఎక్కువగా ఉండే అవకాశం ఉన్నట్లు తెలిపింది. దక్షిణ, మధ్య తెలంగాణలతో పాటు.. హైదరాబాద్‌ నగర పరిసర ప్రాంతాల్లో భానుడి భగభగలు తీవ్రంగా నమోదు అయ్యే అవకాశాలు ఉన్నాయి. దక్షిణ, ఉత్తర తెలంగాణలో రాత్రిపూట ఉష్టోగ్రతలు సైతం సాధారణం కంటే రెండు డిగ్రీలు పెరిగే అవకాశం ఉన్నట్లు పేర్కొంది.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు