నవసారి, మార్చి 8 : ఇయ్యాల తెలంగాణ : గడచిన పది సంవత్సరాల్లో తన ప్రభుత్వం మహిళల భద్రతలకు అగ్ర ప్రాధాన్యం ఇచ్చిందని, అత్యాచారం వంట దారుణ నేరాలకు మరణశిక్ష పడేలా చట్టాలను సవరించిందని ప్రధాని నరేంద్ర మోడీ శనివారం వెల్లడిరచారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా నవసారి జిల్లా వన్సీ బోర్సి గ్రామంలో భారీ జన సమూహాన్ని ఉద్దేశించి ప్రధాని మోడీ ప్రసంగిస్తూ, మహిళల నాయకత్వంలోని అభివృద్ధి మార్గంలో భారత్ నడుస్తోందని తెలియజేశారు. ‘ఒక బాలిక (ఇంటికి) ఆలస్యంగా తిరిగివచ్చినప్పుడు ఆమె తల్లిదండ్రులు ప్రశ్నలు అడుగుతుంటారు, కానీ ఒక బాలుడు ఆలస్యంగా వస్తే వారు అలా అడగరుడ వారు అడగవలసిందే.గడచిన దశాబ్దంలో మేము మహిళల క్షేమం, భద్రతకు అత్యధిక ప్రాధాన్యం ఇచ్చాం. మహిళలపై నేరాల కట్టడికి మేము నిబంధనలు, చట్టాలు మార్చాం’ అని ఆయన తెలిపారు.‘అత్యాచారం వంటి హీనమైన నేరాలకు మరణశిక్ష విధించేందుకు నా ప్రభుత్వం చట్టాన్ని మార్చింది’ అని ప్రధాని మోడీ చెప్పారు.
‘మహిళల గౌరవానికి, సౌకర్యాలకు మా ప్రభుత్వం అత్యధిక ప్రాముఖ్యం ఇస్తోంది’ అని ఆయన చెప్పారు. గ్రావిూణ ప్రాంతాల్లో మహిళలకు సాధికారత కల్పించవలసిన అగత్యం ఉందని ప్రధాని ఉద్ఘాటించారు, ‘దేశం ఆత్మ గ్రామాల్లో నివసిస్తుంటుందని (మహాత్మా) గాంధీజీ చెబుతుండేవారు. మహిళలు మన గ్రావిూణ ప్రాంతాల ఆత్మ అని, గ్రావిూణ భారతం ఆత్మ గ్రావిూణ మహిళల సాధికారతలో నివసిస్తుంటుందని నేను దానికి జోడిరచాలని ఆకాంక్షిస్తున్నాను’ అని మోడీ తెలియజేశారు.‘మా ప్రభుత్వం మహిళల కోసం పని చేస్తోంది, మేము వేలాది మరుగుదొడ్లు నిర్మించి, మహిళలకు గౌరవం ఇచ్చాం. మా ప్రభుత్వం ట్రిపుల్ తలాక్‌కు వ్యతిరేకంగా కఠిన చట్టాలు తీసుకువచ్చి, లక్షలాది మహిళల జీవితాలు విచ్ఛిన్నం కాకుండా వారికి రక్షణ కల్పించింది’ అని మోడీ తెలియజేశారు. అమూల్, లిజ్జత్ పాపడ్ వంటి బ్రాండ్లు మహిళల సారథ్యంలోని విజయవంతమైన వ్యాపారాలకు తార్కాణాలు అని గుజరాత్‌లో ‘లాఖ్‌పతి దీదీ సమ్మేళన్’లో ప్రధాని మోడీ పేర్కొన్నారు. ప్రధాని మోడీ తన ప్రసంగం ఆరంభంలో తాను ప్రపంచంలోనే అత్యంత సంపన్న వ్యక్తిని అని, ఎందుకంటే తనకు కోట్లాది మంది తల్లులు, సోదరీమణుల ఆశీస్సులు ఉన్నాయని చెప్పారు.
0 కామెంట్‌లు