Ticker

6/recent/ticker-posts

Ad Code

March 14న దయచేసి ‘కోర్ట్‌’ సినిమాకి వెళ్ళండి. !


మార్చి 14న దయచేసి ‘కోర్ట్‌’ సినిమాకి వెళ్ళండి. ఇంత మంచి సినిమాని మిస్‌ అవ్వకండి. ఫ్యామిలీతో కలసి చూడండి. ఖచ్చితంగా గ్రేట్‌ సినిమాని ఎక్స్‌ పీరియన్స్‌ చేస్తారు: గ్రాండ్‌  ప్రీరిలీజ్‌ డ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ లో నేచురల్‌ స్టార్‌ నాని

నేచురల్‌ స్టార్‌ నాని వాల్‌ పోస్టర్‌ సినిమా సమర్పించిన మూవీ ‘కోర్ట్‌’ ` స్టేట్‌ వర్సెస్‌ ఎ నోబడీ’ ప్రియదర్శి ప్రధాన పాత్రలో నటిస్తున్న నటిస్తున్న ఈ చిత్రాన్ని రామ్‌ జగదీష్‌ దర్శకత్వం వహించారు. ప్రశాంతి తిపిర్నేని నిర్మించారు. దీప్తి గంటా సహ నిర్మాతగా వ్యవహరించారు. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా ప్రమోషనల్‌ కంటెంట్‌ సినిమాపై మంచి బజ్‌ క్రియేట్‌ చేసింది. ఈ చిత్రం మార్చి 14న హోలీ పండుగ సందర్భంగా విడుదల కానుంది. ఈ సందర్భంగా మేకర్స్‌ గ్రాండ్‌  ప్రీరిలీజ్‌ డ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ ని నిర్వహించారు. బ్లాక్‌ బస్టర్‌ డైరెక్టర్స్‌ నాగ్‌ అశ్విన్‌, ప్రశాంత్‌ వర్మ, శైలేష్‌ కొలను, శ్రీకాంత్‌ ఓదెల, శౌర్యువ్‌, ఇంద్రగంటి మోహన కృష్ణ, దేవకట్టా ఈ వేడుకలో అతిధులుగా పాల్గొన్నారు.

ప్రీరిలీజ్‌ ఈవెంట్‌ లో నేచురల్‌ స్టార్‌ నాని మాట్లాడుతూ...ఇక్కడికి వచ్చిన మా డైరెక్టర్స్‌ కి థాంక్యూ సో మచ్‌. ఈ సినిమా గురించి ఒక విషయం బలంగా చెబుతున్నాను. 14న ఈ సినిమాని విూరు మిస్‌ అవ్వకండి. నా కెరియర్‌ లో ఎప్పుడూ కూడా దయచేసి సినిమా చూడండి అని అడగలేదు. కానీ ఈ సినిమా కడుగుతున్నాను. దయచేసి ఈ సినిమా చూడండి. 14న థియేటర్‌ కి వెళ్ళండి. ఇలాంటి మంచి సినిమా విూరు మిస్‌ అవ్వకూడదని చెబుతున్నాను. మాకేదో సక్సెస్‌ రావాలని కాదు. తెలుగు ప్రేక్షకులు ఇలాంటి మంచి సినిమాని మిస్‌ కాకూడదని చెబుతున్నాను. విూ అందరిని బ్రతిమాలుతున్నాను. ఫ్యామిలీతో కలిసి సినిమాకి వెళ్ళండి. గొప్ప సినిమా చూశారానే ఫీలింగ్‌ తో వస్తారు. ఒకవవేళ 14న కోర్ట్‌ సినిమాకి వెళ్లి నేను చెప్పిన అంచనాలని మ్యాచ్‌ కాలేదని అనిపిస్తే...ఇంకో రెండు నెలల్లో రిలీజ్‌ అవుతున్న నా హిట్‌ 3ని ఎవరూ చూడొద్దు. ఇంతకంటే బలంగా చెప్పలేను. 14న థియేటర్‌ కి వెళ్ళండి. చాలా హ్యాపీగా ఫీలౌతారు. సినిమా చూసినప్పుడు నాకు గొప్ప ఎక్స్‌ పీరియన్స్‌ కలిగింది. సినిమా చూసిన తర్వాత విూరే అందరికీ చెబుతారు. టీం అందరికీ కంగ్రాట్స్‌ అండ్‌ థాంక్‌ యూ. తెలుగు సినిమాకి గ్రేట్‌ కోర్ట్‌ రూమ్‌ డ్రామా ఇచ్చారు. మార్చి14న థియేటర్స్‌ లో కలుద్దాం’అన్నారు.

యాక్టర్‌ ప్రియదర్శి మాట్లాడుతూ.. నాని అన్న థాంక్యూ సో మచ్‌. బలగం తర్వాత ఎలాంటి సినిమా చేయాలి అని ఆలోచిస్తున్నప్పుడు ఈ సినిమా చేయమని చెప్పారు. మా టీమ్‌ అంతా ఇక్కడ ఉండడానికి  ముఖ్య కారణం నాని అన్న. ఈ సినిమాలలో పని చేసిన అందరికీ పేరుపేరునా ధన్యవాదాలు. అందరూ చాలా గొప్పగా చేశారు. ఇంతమంది దర్శకులు నాని అన్న కోసం ఈ సినిమా కోసం రావడం చాలా ఆనందంగా ఉంది. నేను నాని అన్న తమ్ముణ్ణి అని చెప్పుకోవడం చాలా గర్వంగా ఉంటుంది. ఈ సినిమా 14న థియేటర్లో వస్తుంది. ఇది కూడా ఒక సూపర్‌ హీరో లాంటి కథ. కోటేసుకున్న ప్రతిసారి ఒక బ్యాట్మెన్‌ లో ఫీల్‌  అయ్యా. 14న థియేటర్లో కలుద్దాం. సక్సెస్‌ ని సెలబ్రేట్‌ చేసుకుందాం’అన్నారు.

డైరెక్టర్‌ శ్రీకాంత్‌ ఓదెల మాట్లాడుతూ.. కోర్ట్‌ పెద్ద హిట్‌ కావాలని కోరుకుంటున్నాను. రోషన్‌ శ్రీదేవి చాలా సహజంగా కనిపిస్తున్నారు. దర్శి అన్న మల్లేశం సినిమాకి నేను పెద్ద ఫ్యాన్‌ ని. ఆయన అలాంటి సినిమాలు చాలా చేయాలని కోరుకుంటున్నాను. డైరెక్టర్‌ జగదీశ్‌ కంగ్రాట్స్‌. నాని అన్న థాంక్‌ యూ. సినిమా బ్లాక్‌ బస్టర్‌ అవ్వాలని కోరుకుంటున్నాను

డైరెక్టర్‌ నాగ్‌ అశ్విన్‌ మాట్లాడుతూ.. అందరికీ కంగ్రాట్స్‌. ఇది ఒక స్పెషల్‌ ఈవెంట్‌ లా ఉంది. బిహైండ్‌ తి సీన్స్‌ కోర్ట్‌ ఒక సినిమా తీస్తే ఎలా ఉంటుందో ఈవెంట్‌ అలా ఉంది. చాలా ఫ్రెష్‌ టాలెంట్‌. అందరిలో ప్యాషన్‌ కనిపిస్తోంది. ఫస్ట్‌ సినిమాకి ఎంత ఎక్సైట్మెంట్‌ ఉంటుందో నాకు తెలుసు. జగదీష్‌ ఫేస్‌ లో అది నాకు కనిపించింది. పదేళ్ల క్రితం ఎవడే సుబ్రహ్మణ్యం సినిమాకి నేను కూడా అదే పొజిషన్లో ఉన్నాను. అప్పటినుంచి ఇప్పటివరకు నేను ఒక మూడు సినిమాలు చేశాను. కానీ నాని  ఒక 20 సినిమాలు చేశారు. యాక్టర్‌ గా,  ప్రొడ్యూసర్‌ గా ఇంత స్పీడ్‌ గా ఎలా చేస్తున్నారని చాలా సార్లు అడిగాను. నిజంగా అది గొప్ప లెగసి. ఈ సినిమా మ్యాసీవ్‌ సక్సెస్‌ కావాలని కోరుకుంటున్నాను’అన్నారు.

డైరెక్టర్‌ ప్రశాంత్‌ వర్మ మాట్లాడుతూ.. కోర్ట్‌ ట్రైలర్‌ చాలా గ్రిప్‌ంగా ఉంది. సినిమా కూడా అంతే ఎంగేజింగ్‌ గా ఉంటుందని భావిస్తున్నాను. నాని వాల్‌ పోస్టర్‌ సినిమా ద్వారా నన్ను డైరెక్టర్‌ గా పరిచయం చేశారు.. ఆయన గత సినిమాలు ఎంత సక్సెస్‌ అయ్యాయో ఈ సినిమా కూడా అంత పెద్ద సక్సెస్‌ సాధించాలని కోరుకుంటున్నాను. నాని గారు నుంచి చాలా విషయాలు నేర్చుకున్నాను. నాని గారి వల్లే ఈరోజు ఒక యూనివర్స్‌ క్రియేట్‌ చేయగలుగుతున్నాను’అన్నారు.

డైరెక్టర్‌ శైలేష్‌ కొలను  మాట్లాడుతూ.. కోర్ట్‌ ట్రైలర్‌ చాల ప్రామెసింగ్‌ గా వుంది. సినిమా అద్భుతంగా వచ్చిందనిపిస్తోంది. నాని గారి ఈ సినిమా గురించి చాలా చెప్పేవారు. ట్రైలర్‌ చూసిన తర్వాత ఆయన ఎందుకు అంతలా చెప్పారో అర్ధమైయింది. డైరెక్టర్‌ రామ్‌ జగదీశ్‌ నానిని నీడలో వున్నారు. అది గొప్ప బాధ్యత. ఆయన చెయ్యి వదలమాకు. టీం అందరికీ కంగ్రాట్స్‌’అన్నారు.  

డైరెక్టర్‌ దేవకట్ట మాట్లాడుతూ.. కొన్ని సినిమాలు మనతోపాటు మన ఇంటికి వస్తాయి. కోర్టు కూడా అలాంటి సినిమా అనిపిస్తుంది. ట్రైలర్‌ లో చాలా అద్భుతమైన మూమెంట్స్‌ ఉన్నాయి. ఈ కథ నానినే ఎక్సైటింగ్‌ చేసేలా వచ్చిందంటే డైరెక్టర్‌ రామ్‌ జగదీష్‌ కి కంగ్రాజులేషన్స్‌. వాల్‌ పోస్టర్‌ సినిమా నాని పారడైజ్‌. అయితే ఈ ప్యారడైజ్‌ తనకోసం కట్టుకోవడం లేదు. ఆడియన్స్‌ కోసం కొత్త టాలెంట్‌ కోసం కొత్త ఐడియాల కోసం కొత్త సినిమా కోసం. ఈ సినిమా రిచెస్ట్‌ మూవీ అనిపిస్తోంది. 14న ఈ సినిమాని ఆడియన్స్‌ సెలబ్రేట్‌ చేసుకుంటారని భావిస్తున్నాను’అన్నారు.

నిర్మాత దీప్తి మాట్లాడుతూ..  నలుగురు సినిమా పిచ్చోళ్ళు ఒక చోటికి చేరితే సినిమా ఎలా వస్తుందో కోర్టు అలా ఉంటుంది. జగదీష్‌ విజన్‌ స్క్రీన్‌ విూద ఒక పోయెట్రీ క్రియేట్‌ చేసింది. విజయ్‌ తన మ్యూజిక్‌ తో మ్యాజిక్‌ చేశాడు. దర్శి చాలా అద్భుతంగా నటించాడు. రోషన్‌ శ్రీదేవి ఆడియన్స్‌ కి గుర్తుండిపోతారు ఇది చాలా బ్యూటిఫుల్‌ మూవీ మార్చి 14న అందరూ థియేటర్లో చూస్తారని కోరుకుంటున్నాను’అన్నారు  

డైరెక్టర్‌ రామ్‌ జగదీష్‌ మాట్లాడుతూ.. ఈ స్టేజ్‌ నాకు చాలా ప్రత్యేకం. నా జర్నీలో సపోర్ట్‌ చేసిన అందరికీ పేరుపేరునా ధన్యవాదాలు. నా రైటింగ్‌ టీం డైరెక్షన్‌ టీం కి థాంక్యూ. వీళ్లంతా పేపర్‌ విూద సినిమా చూసిన మనుషులు. డీవోపీ దినేష్‌ లవ్‌ టుడే మహారాజా లాంటి 100 కోట్లు సినిమా తీసిన కెమెరామెన్‌. ఆయన మా కోర్ట్‌ ని సెలెక్ట్‌ చేసుకోవడం లక్కీగా ఫీల్‌ అవుతున్నా. తన కెమెరాతో ఈ సినిమాకి జీవం పోశాడు. విజయ్‌ అద్భుతమైన మ్యూజిక్‌ ఇచ్చాడు. విటల్‌ గారు  సహజంగా కనిపించే సెట్స్‌ వేశారు. ప్రశాంతి గారు దీప్తి గారు ఈ సినిమాకి మెయిన్‌ పిల్లర్స్‌.   ఈ సినిమాకి పనిచేసిన అందరికీ పేరుపేరునా ధన్యవాదాలు. రోషన్‌ శ్రీదేవి ఈ సినిమాకి హార్ట్‌ అండ్‌ సోల్‌. దర్శి అన్నకి బలగం ముందు ఈ కథ చెప్పాను. అప్పటికీ ఇప్పటికీ ఒకేలా వున్నారు. నాని గారు వన్‌ అండ్‌ ఓన్లీ. నాని ప్రోడక్ట్‌ కావడం చాలా ఆనందంగా వుంది. ఇదొక గొప్ప లెగసీ. ఆయన నమ్మిన విధానం అద్భుతం. అది చాలా బాధ్యత పెంచింది. 14 తారీకు ఆ నమ్మకాన్ని తిరిగి ఇచ్చేస్తాను. కోర్టు మన అందరికీ జీవితం. థియేటర్స్‌ కి రండి. ఆ రోజు మాట్లాడుకుందాం’అన్నారు.

యాక్టర్‌ హర్ష రోషన్‌ మాట్లాడుతూ..ఈ సినిమా నాకు చాలా స్పెషల్‌. నాని అన్న ప్రొడక్షన్లో సినిమా రావడం చాలా ఎక్సైటింగ్‌ అనిపించింది. కథ విన్న తర్వాత మరింత ఎక్సైట్‌ అయ్యాను. ఇది కోర్ట్‌ రూమ్‌ డ్రామా అని అందరూ అనుకుంటారు ఇది ఒక బ్యూటిఫుల్‌ లవ్‌ స్టోరీ కూడా. ప్రతి ఒక్కరూ వెళ్లి చూడాల్సిన సినిమా ఇది. ప్రతి ఏజ్‌ గ్రూప్‌ చూడాల్సిన సినిమా. డైరెక్టర్‌ గారికి, దర్శి అన్నకి, సినిమాలో పని చేసిన అందరికీ థాంక్‌ యూ. మార్చి 14 విూరందరూ సినిమా చూసి మమ్మల్ని బ్లెస్‌ చేస్తారని భావిస్తున్నాను’అన్నారు.

యాక్టర్‌ శ్రీదేవి మాట్లాడుతూ..వాల్‌ పోస్టర్‌ సినిమాల్లో మూవీ చేయడం ఐ ఆమ్‌ వెరీ లక్కీ. నాకు జాబిల్లి క్యారెక్టర్‌ ఇచ్చిన డైరెక్టర్‌ గారికి థాంక్యూ. నన్ను నమ్మి ఈ అవకాశం ఇచ్చిన నాని గారికి థాంక్‌ యూ. మార్చి 14నఅందరూ వచ్చి ఈ సినిమా చూడాలి’అన్నారు.

డైరెక్టర్‌ ఇంద్రగంటి మోహన్‌ కృష్ణ మాట్లాడుతూ..17 ఏళ్ల క్రితం నా ఆఫీసులో కూర్చున్న కుర్రాడు.. ఈరోజు ఇంతమందికి స్ఫూర్తినిస్తూ నటుడిగా గొప్ప స్థాయికి ఎదగడమే కాకుండా నిర్మాతగా ఎన్నో అద్భుతమైన కథలను నటులని దర్శకులని పరిచయం చేయడం చాలా ఆనందంగా ఉంది. నాని ఆయన ప్రౌడ్‌ అఫ్‌ యు. దర్శి మై డియర్‌ యాక్టర్‌. ఈ సినిమాప్రోమోస్‌ చాలా ఇంట్రెస్టింగ్‌ గా ఉన్నాయి. ఇలాంటి సినిమాలు నాకు చాలా ఇష్టం. పెద్ద హృదయం ఉన్న చిన్న సినిమాలు ఇవి. ప్రపంచాన్ని జయించగల హృదయం ఈ సినిమాలు ఉంటుంది. అందరికీ ఆల్‌ ది బెస్ట్‌. అందరూ థియేటర్స్‌ లో చూడాలని కోరుకుంటున్నాను’అన్నారు.

డైరెక్టర్‌ శౌర్యువ్‌ మాట్లాడుతూ.. ఈ సినిమా ట్రైలర్‌ చాలా బాగుంది. టీమ్‌ అందరికీ కంగ్రాజులేషన్స్‌. దర్శి గారు క్యారెక్టర్‌ కోసం చాలా హార్డ్‌ వర్క్‌ చేస్తారు. నాని గారు ఒక కథను నమ్మారంటే తప్పకుండా అందులో వర్త్‌ ఉంటుంది. మార్చి 14న కోర్ట్‌ సినిమా వస్తుంది. నేను తప్పకుండా వెళుతున్నాను. అందరూ థియేటర్స్‌ లో కలుద్దాం’అన్నారు.మ్యూజిక్‌ డైరెక్టర్‌ విజయ్‌ బుల్గానిన్‌.. ఇంత మంచి సినిమా నాకు ఇచ్చిన డైరెక్టర్‌ గారికి నాని గారికి థాంక్యూ సో మచ్‌. నాని గారి ప్రోడక్ట్‌ గా చెప్పుకోవడం నా అదృష్టం. దర్శితో పాటు అందరూ చక్కగా నటించారు. సినిమా అద్భుతంగా వచ్చింది. విూ అందరికీ నచ్చుతుంది’అన్నారు.  

యాక్టర్‌ రోహిణి మాట్లాడుతూ....వాల్‌ పోస్టర్‌ సినిమా జర్నీలో ఒక పార్ట్‌ అవడం చాలా ఆనందంగా ఉంది. నాని గారు ఒక సినిమా సెలెక్ట్‌ చేశారంటే అందరికీ ఒక నమ్మకం ఉంటుంది.  ప్రేక్షకుల సమయాన్ని విలువైన సమయంగా మార్చడానికి ఆయన ఎప్పుడు ప్రయత్నిస్తుంటారు. ఇది చాలా మంచి సినిమా. చాలా ఎంగేజ్‌ చేస్తుంది. స్క్రీన్‌ ప్లే చాలా అద్భుతంగా ఉంటుంది. ఇందులో నా క్యారెక్టర్‌ అందరూ రిలేట్‌ చేసుకునేలా వుంటుంది. నటిగా చాలా సంతోషాన్ని ఇచ్చింది సినిమా ఇది. అందరికీ థాంక్‌ యూ. కచ్చితంగా వాల్‌ పోస్టర్‌ సినిమా లో ఇది మరో బ్లాక్‌ బస్టర్‌ అవుతుంది’అన్నారు.  

లిరిక్‌ రైటర్‌ పూర్ణాచారి మాట్లాడుతూ.... ఈ సినిమాలో నేను రాసిన పాట కోటి హృదయాన్ని తాకబోతోంది. డైరెక్టర్‌ గారు వాటిని ప్రేమించి ఈ పాటను రాయించారు. నన్ను నమ్మి ఈపాటి ఇచ్చినందుకు థాంక్యూ. విజయ అద్భుతమైన మ్యూజిక్‌ ఇచ్చారు. నాని గారితో అసోసియేట్‌ అయి వర్క్‌ చేయడం చాలా ఆనందంగా ఉంది. ఈ సినిమా ప్రేక్షకులకు ఓ అద్భుతమైన అనుభూతిని ఇవ్వబోతోంది’అన్నారు.

యాక్టర్‌ శ్రీనివాస్‌ భోగి రెడ్డి మాట్లాడుతూ.. వాల్‌ పోస్టర్‌ సినిమాలో ఇది నాకు సెకండ్‌ ప్రాజెక్టు. ఫస్ట్‌ విూట్‌ క్యూట్‌ చేశాను. నాని గారు ప్రొడక్షన్లో పనిచేయడం చాలా ఆనందాన్ని ఇచ్చింది. ఈ సినిమాల్లో చాలా డిఫరెంట్‌ క్యారెక్టర్‌ చేశాను.  జడ్జి పాత్రకి ఆడిషన్‌ ఏముంటుంది అనుకున్నాను కానీ ఆ పాత్ర చేసిన తర్వాత తెలిసింది ఎందుకు ఆడిషన్‌ కి రమ్మన్నారో. ఈ క్యారెక్టర్‌ కి ఎంపిక చేసిన దర్శక నిర్మాతలకి థాంక్యూ. మార్చి 14న ఈ సినిమా రిలీజ్‌ కాబోతుంది. ఆడియన్స్‌ అందరూ థియేటర్స్‌ కి వెళ్లి ఈ సినిమా చూడాలని కోరుకుంటున్నాను’అన్నారు.

యాక్టర్‌ సురభి ప్రభావతి మాట్లాడుతూ.. నాని గారితో మూడు సినిమాలు చేశాను. ఈ మూడు సినిమాలు కూడా నాకు చాలా మంచి పేరు తీసుకొచ్చాయి. ఈ సినిమాలో అవకాశం ఇచ్చిన డైరెక్టర్‌ గారికి థాంక్‌ యూ. సినిమా చాలా అద్భుతంగా వచ్చింది. ఇంత నమ్మకంగా మాకు ఈ క్యారెక్టర్‌ ఇచ్చిన దర్శక నిర్మాతలకి థాంక్యూ’అన్నారు


కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు