Ticker

6/recent/ticker-posts

Ad Code

LRS ప్రక్రియ షురూ... ఉదయం నుంచి రిజిస్ట్రేషన్ ఆఫీసుకు జనాలు !


హైదరాబాద్‌, మార్చి 3 (ఇయ్యాల తెలంగాణ) : తెలంగాణలో పట్టణ, గ్రావిూణ ప్రాంతాల్లో అనుమతి లేని లేఔట్ల క్రమబద్ధీకరణకు ప్రభుత్వ శ్రీకారం చుట్టింది. సోమవారం నుంచి రిజిస్ట్రేషన్లు మొదలయ్యాయి. ఎల్‌ఆర్‌ఎస్‌కు దరఖాస్తు చేసిన వాటిలో ఇప్పటివరకు 25 లక్షల అప్లికేషన్లు మాత్రమే వచ్చాయి. అందులో 10 లక్షల వరకు చెరువులు, ప్రభుత్వ భూముల్లో ఉన్నట్లు తెలుస్తోంది. దాదాపు 40 శాతానికి పైగా ప్లాట్లు ఇలా చెరువు, ప్రభుత్వ భూముల్లో ఉన్నట్లు సమాచారం.ఈ తరహా ప్లాట్లు ఎన్నిఉన్నాయో తెలుసుకునే పనిలో అధికారులు నిమగ్నమయ్యారు. ప్లాట్లు ప్రభుత్వం భూమిలో ఉంటే రెవిన్యూ విభాగానికి, చెరువు ఎఫ్‌టీఎల్‌కు 200 విూటర్లు పరిధిలో ఉంటే ఇరిగేషన్‌ శాఖకు పంపాలని అధికారులు నిర్ణయించారు. వచ్చిన దరఖాస్తులను పైరెండు కేటగిరీలుగా డివైడ్‌ చేసి సర్వే నెంబరుతో సహా సెంటర్‌ ఫర గుడ్‌ గవర్నెన్స్‌కు పంపనున్నారు. 2020 ఆగస్టు 26 కంటే ముందు రిజిస్టర్‌ చేసిన లే ఔట్లకు ఎల్‌ఆర్‌ఎస్‌ వర్తిస్తుందని ప్రభుత్వం తెలిపింది. అదే ఏడాది అక్టోబర్‌ 15 లోపు స్వీకరించిన దరఖాస్తులను తీసుకుంటామని వెల్లడిరచింది. ఎలాంటి లింకు డాక్యుమెంట్లు లేకపోయినా ఓపెన్‌ ప్లాట్లను రిజిస్ట్రేషన్‌ చేయడం మొదటిది. ఎల్‌ఆర్‌ఎస్‌ ప్రక్రియ పూర్తి చేయాలని నిర్ణయించింది.ఇప్పటికే ప్రీ`రిజిస్ట్రేషన్‌ మాడ్యుల్‌ను ప్రభుత్వం రెడీ చేసింది. ఈ అవకాశం ఎల్‌ఆర్‌ఎస్‌`2020 దరఖాస్తుదారులకు మాత్రమే. కొత్తగా అఫ్లికేషన్లు పెట్టుకోబోతున్నవారికీ ఉందని స్టాంప్స్‌ అండ్‌ రిజిస్ట్రేషన్‌ జారీ చేసిన సర్క్యూలర్‌లో తెలిపింది.  

అనధికార లేఅవుట్‌లో 10 శాతం ఓపెన్‌ ప్లాట్లు ఇప్పటికే అమ్ముడు పోయాయి. దానితో ఎలాంటి సంబంధం లేకుండా ఎల్‌ఆర్‌ఎస్‌`2020 కింద దరఖాస్తు చేసుకున్నా, చేయకపోయినా వాటికి రిజిస్ట్రేషన్‌ చేయనున్నారు.దరఖాస్తుల పరిష్కారంలో రెవెన్యూ`ఇరిగేషన్‌ అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నట్లు కనిపిస్తోంది. ఇరిగేషన్‌ అధికారుల వద్ద 3 లక్షలకు పైగా దరఖాస్తులు, రెవెన్యూ అధికారుల వద్ద మరో మూడున్నర లక్షలకు పైగా పెండిరగ్‌లో ఉన్నట్లు అధికారుల మాట. ఇరుశాఖల అధికారులు పరిశీలించిన తర్వాత మున్సిపల్‌, టౌన్‌ ప్లానింగ్‌ అధికారులువాటిని ఆమోదించనున్నారు.రెగ్యులరైజేషన్‌ కోసం రెండో దశలో చెల్లించాల్సిన ఛార్జీలకు సంబంధించి సబ్‌ రిజిస్ట్రార్లకు స్పెషల్‌గా లింకును పంపినట్టు తెలుస్తోంది. ఏదైనా కారణంతో దరఖాస్తు తిరస్కరణకు గురయితే వినియోగదారుడు చెల్లిన ఛార్జీల్లో 10 శాతాన్ని ప్రాసెసింగ్‌ ఫీజుగా కట్‌ చేసి మిగిలిన మొత్తాన్ని తిరిగి చెల్లించనున్నట్లు పురపాలక శాఖ తెలిపింది.మార్చి 31 లోపు చెల్లిస్తే 25 శాతం రాయితీ ఇవ్వనుంది ప్రభుత్వం. రూల్స్‌ ప్రకారం వచ్చిన దరఖాస్తులు ఫీల్డ్‌ వెరిఫికేషన్‌ లేకుండా ఉన్నవాటిని వెంటనే క్లియర్‌ చేస్తున్నారు. వాటి తర్వాత ఆటోమేటిక్‌గా ఛార్జీలు జనరేట్‌ అవుతాయి. సెకండ్‌ ఫీజును మార్చి 31 లోపు చెల్లిస్తే రాయితీ ఇవ్వనున్నారు. మొత్తం మున్సిపాటిలీలో దాదాపు 14 న్నర లక్షల దరఖాస్తులు ఉన్నట్లు ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయిప్రభుత్వ ఉత్తర్వులకు ముందు 4,80 లక్షల దరఖాస్తులను క్లియర్‌ చేసినట్టు చెబుతున్నారు. గడిచిన ఐదు రోజల్లో 20 వేల అప్లికేషన్లు క్లియర్‌ అయినట్టు మున్సిపల్‌ అధికారుల మాట. ప్రభుత్వ ఆఫీసుకు వచ్చిన వారిని గైడ్‌ చేసేందుకు జోనల్‌ ఆఫీసులో ప్రత్యేకంగా హెల్ప్‌డెస్క్‌లను ఏర్పాటు చేశారు. ఎల్‌ఆర్‌ఎస్‌ అఫ్లికేషన్లు ఆన్‌లైన్‌లో అప్‌లోడ్‌ చేసేందుకు ప్రభుత్వం ఓ లాగిన్‌ను తీసుకొచ్చింది. అప్లికేషన్‌ సమయంలో సమర్పించని డాక్యుమెంట్లను అప్‌లోడ్‌ చేయాలని సూచించింది.


కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు