ఇయ్యాల తెలంగాణ, Business న్యూస్ ప్రతినిధి : పెట్రోల్ ధరలు రోజు రోజుకీ పెరుగుతున్న నేపథ్యంలో మార్కెట్లో సీఎన్జీ వాహనాలపై ఎక్కువ మంది మక్కువ చూపుతున్నారు. ప్రస్తుత ట్రెండింగ్ కూడా సీఎన్జీ వాహనాలకు ఎక్కువ మంది టూ వీలర్ వినియోగ దారులు మక్కువ చూపుతుండడంతో ప్రముఖ బైక్ కంపెనీలు సైతం టూ వీలర్ లలో సీఎన్జీ వాహనాల మార్కెటింగ్ పై దృష్టిని కేంద్రీకరిస్తున్నాయి. దీనికి తోడు అనేక మోటార్ కంపెనీలు పోటీపడి సీఎన్జీ వాహనాలను మార్కెట్లోకి తీసుకు రావడానికి తలమునకలై ఉన్నాయి. అత్యంత జనాదరణ కలిగి యున్న టూ- వీలర్ వాహనాల కస్టమర్ల మన్ననలు పొందిన హోండా యాక్టీవా కంపెనీ కూడా ఇప్పుడు సీఎన్జీ వాహనాలను మార్కెట్లోకి విడుదల చేయడానికి ప్రయత్నాలను ముమ్మరం చేస్తున్నాయి. ఇందుకు మొగ్గు చూపుతూ యాక్టీవాను సీఎన్జీలో అదిరిపోయే ఫీచర్లను తీసుకొస్తున్నట్లు ప్రచారం కొనసాగుతుంది. ఇందుకు సంబంధించి కొన్ని రకాల యాక్టీవా సీఎన్జీ స్కూటీ ఫీచర్లు వైరల్ అవుతున్నాయి.
HONDA యాక్టీవా సీఎన్జీ స్కూటీ ఫీచర్లు
డిజిటల్ స్పీడోమీటర్, డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ డిజిటల్ ఓడో మీటర్ డిజిటల్ ట్రిప్ మీటర్ ఎల్ఇడి హెడ్ లైట్, ఎల్ఇడి ఇండికేటర్స్ ఫ్రంట్, బ్యాక్ డిస్క్ బ్రేక్ యాంటీ లాక్ బ్రేకింగ్ సిస్టమ్ (ఏబీఎస్) ట్యూబ్ లెస్ టైర్లు అల్లాయ్ వీల్స్ కేవలం మాడ్రన్ లుక్ మాత్రమే కాకుండా బధ్రత సౌకర్యమైన రౌండింగ్ అనుభూతిని అందించేలా యాక్టీవా సీఎన్జీ స్కూటీ ఫీచర్లను అందించనున్నారు.
HONDA యాక్టీవా సీఎన్జీ స్కూటీ మైలేజి మరియు పనితీరు :
సీఎన్జీ స్కూటీ పనితీరు విషయానికొస్తే శక్తివంతమైన ఇంజన్ తో తీసుకొచ్చే అవకాశాలు ఉన్నాయి. ఈ స్కూటర్ లో 110 సీసీ సింగల్ సిలిండర్ ఎయిర్ - కూల్డ్ ఇంజిన్ అందించనున్నారు. ఇది గరిష్టంగా 7.79 BHP పవర్ ను, 8. 7 NM టార్క్ కెపాసిటీని ప్రొడ్యూస్ చేస్తుంది. మైలేజీ విషయంలో యాక్టీవా సీఎన్జీ స్కూటీ ప్రధాన ఆకర్షణగా చెప్పవచ్చు. ఈ స్కూటర్ ను ఒక్కసారి ఫుల్ ట్యాంక్ చేస్తే ఏకంగా 320 నుంచి 400 కిలోమీటర్లు దూసుకెళ్లొచ్చని తెలుస్తోంది. ఈ మైలేజ్ పెట్రోల్ వెర్షన్ తో పోల్చితే చాలా ఎక్కువ మైలేజీ ని అందిస్తుంది.
యాక్టీవా CNG ధర విషయానికొస్తే :
హోండా యాక్టీవా ధర విషయంలో ఇప్పటి వరకు ఎలాంటి అధికారిక ప్రకటన చేయక పోయినప్పటికీ యాక్టీవా సీఎన్జీ స్కూటీ ధర 90 వేల రూపాయల నుంచి లక్ష రూపాయల దాకా ఎక్స్ షో రూమ్ ధరలు అందుబాటులో ఉండవచ్చని టూ -వీలర్ వినియోగ దారులు భావిస్తున్నారు.
0 కామెంట్‌లు