జ్వరం వచ్చినప్పుడు ఏం తినాలి ఏం తినకూడదు అనేది చాలా మంది సందేహం. ఇక అనారోగ్యాంగా ఉన్నప్పుడు నాన్ - వెజ్ తినాలా వద్దా అన్న దానిపైనే ఎక్కువ మంది సందేహం. ఇందులో ముఖ్యంగా మటన్ లాంటి మాంసాహారం తినడం వల్ల లాభాలు, నష్టాలు ఏంటో చాలా మందికి తెలియదు. సాధారణంగా జ్వరం వచ్చినప్పుడు తేలికగా జీర్ణమయ్యే ఆహారాలను తీసుకోవడం మంచిది. మటన్ లాంటి మాంసాహారం జీర్ణం కావడానికి కాస్త ఎక్కువ సమయం పడుతుంది. అంతేకాకుండా జ్వరం వల్ల శరీరం బలహీనంగా ఉన్నప్పుడు మాంసం జీర్ణం కావడం కష్టం అవుతుంది. ఇది జీర్ణ సంబంధిత సమస్యలకు దారి తీయవచ్చు. కానీ ఈ విషయంలో ఒక నిర్ధిష్ట నియమం లేదు. కొంతమంది వైద్య నిపుణులు, జ్వరం తీవ్రత వ్యక్తి ఆరోగ్య పరిస్థితులు బట్టి మాంసాహారం తీసుకోవడం గురించి వేర్వేరు సలహాలు ఇస్తారు. మటన్ లో ప్రోటీన్ లు ఎక్కువగా ఉండడం వల్ల, జ్వరం వల్ల శరీరం బలహీన పడినప్పుడు, ఈ ప్రోటీన్లు శరీరాన్ని తిరిగి బలోపేతం చేయడానికి సహాయ పడతాయి. మటన్ లో ఐరన్ పుష్కలంగా ఉంటుంది. జ్వరం వల్ల రక్త హీనత వచ్చే అవకాశం ఉంటుంది. ఈ సమయంలో ఐరన్ శరీరానికి చాలా అవసరం. మటన్ లో విటమిన్ బి 12, జింక్ వంటి ఇతర ముఖ్యమైన పోషకాలు కూడా ఉంటాయి. ఇవి శరీర రోగ నిరోధక శక్తిని పెంచడానికి సహాయ పడతాయి. అందుకే చాలామందికి వైద్య నిపుణులు మటన్ తినడానికి అవకాశం ఇవ్వడం జరుగుతుంది. జ్వరం తో బాధ పడుతున్న ప్రతి ఒక్కరికి డాక్టర్లు మటన్ తినడానికి ప్రోత్సహించక పోవచ్చు. వ్యక్తి యొక్క ఇతర ఆరోగ్య సమస్యలను దృష్టిలో ఉంచుకొని వైద్య నిపుణులు సలహాలు ఇవ్వవచ్చు. జ్వరం వచ్చినప్పుడు జీర్ణ వ్యవస్థ చాలా బలహీనంగా ఉంటుంది. మటన్ లాంటి భారీ ఆహారాన్ని జీర్ణించుకోవడం కష్టం కావచ్చు. ఇది జీర్ణ సమస్యలకు దారి తీయవచ్చు. కొందరిలో మటన్ తినడం వల్ల జ్వరం మరింత పెరగవచ్చు. ఎందుకంటే మటన్ శరీరం ఉష్ణోగ్రతను పెంచే స్వభావం కలిగి ఉంటుంది. మటన్ లో కొవ్వు శాతం కూడా ఎక్కువగా ఉంటుంది. జ్వరం వచ్చినప్పుడు కొవ్వు శాతం ఎక్కువగా ఉన్న ఆహారాన్ని తీసుకోవడం ఏ మాత్రం మంచిది కాదు. ఇలాంటి పరిస్థితులలో జ్వరం వచ్చినప్పుడు అసలు మటన్ తినాలా ? వద్దా ? అనే నిర్ణయం వ్యక్తి ఆరోగ్య పరిస్థితులు, జ్వరం తీవ్రతను బట్టి కేంద్రీకృతమై ఉంటుంది. వైద్యుని సలహా ఆధారంగా తగిన నిర్ణయం తీసుకోవలసి ఉంటుంది. సాధారణంగా జ్వరంతో బాధ పడుతున్నప్పుడు తేలికపాటి ఆహారాలను తీసుకోవడం మంచిది.
👉 గమనిక : ఈ సమాచారం కేవలం సాధారణ సమాచారంగానే తెలియజేయడం జరుగుతున్నది. మీకు ఆరోగ్య సమస్యలు ఉన్నపుడు వైద్యుల సలహాలు తీసుకోవడం చాల ముఖ్యం.
0 కామెంట్‌లు