Ticker

6/recent/ticker-posts

Ad Code

‘‘23’’లో నిజ జీవిత కథని నిజాయితీగా చెప్పాం ! Director రాజ్‌ R


‘‘23’’లో నిజ జీవిత కథని నిజాయితీగా చెప్పాం. మూవీ అందరికీ కనెక్ట్‌ అయ్యేలా ఉంటుంది: టీజర్‌ లాంచ్‌ ఈవెంట్‌ లో డైరెక్టర్‌ రాజ్‌ ఆర్‌

మల్లేశం డ 8 ం.ఓ. మెట్రో ఫేమ్‌ డైరెక్టర్‌ రాజ్‌ ఆర్‌, రానా దగ్గుబాటి స్పిరిట్‌ విూడియా ‘‘23’’ మూవీ హార్డ్‌ హిట్టింగ్‌ టీజర్‌ లాంచ్‌  

మల్లేశం, 8 ం.ఓ. మెట్రో చిత్రాలతో ప్రశంసలు పొందిన దర్శకుడు రాజ్‌ ఆర్‌ నిజమైన సంఘటనల నుండి ప్రేరణ పొందిన మరో ఆసక్తికరమైన ప్రాజెక్ట్‌ ‘‘23’’ తో వస్తున్నారు. స్టూడియో 99 నిర్మించిన ఈ చిత్రంలో తేజ, తన్మయి ప్రధాన పాత్రలు పోషించారు. వెంకట్‌ సిద్దారెడ్డి  ఎగ్జిక్యూటివ్‌ ప్రొడ్యూసర్‌. ఈ సినిమాని రానా దగ్గుబాటి స్పిరిట్‌ విూడియా డిస్ట్రిబ్యూషన్‌ చేస్తుంది. ఇటీవల ఫస్ట్‌ లుక్‌ పోస్టర్‌ను విడుదల చేయడం ద్వారా ప్రమోషన్‌లను ప్రారంభించిన మేకర్స్‌ ఈరోజు టీజర్‌ ని లాంచ్‌ చేశారు.

1991 సుండూరు ఊచకోత, 1993 చిలకలూరిపేట బస్సు దహనం, 1997 జూబ్లీ హిల్స్‌ కార్‌ బాంబు పేలుడు.. ఈ మూడు సామూహిక హత్యల  నేపధ్యంలో ‘‘23’’ టీజర్‌ గ్రిపింగ్‌ నెరేటివ్‌ ని ప్రజెంట్‌ చేసింది. ఇది న్యాయం కోసం పోరాటం, విషాదాల యొక్క భావోద్వేగ, సామాజిక ప్రభావం, చరిత్రను రూపొందించిన హింస యొక్క కఠినమైన వాస్తవాలను అన్వేషిస్తుంది.

రాజ్‌ ఆర్‌ యొక్క నైపుణ్యం అతని రచన, దర్శకత్వం రెండిరటిలోనూ స్పష్టంగా కనిపిస్తుంది,  మూడు విభిన్న కథలను సమర్ధవంతంగా బ్లెండ్‌ చేశాడు, ప్రతి ఒక్కటి శక్తివంతమైన, భావోద్వేగాలతో నిండి ఉంది. ఈ కథనాలను లోతుగా చిత్రీకరించే అతని సామర్థ్యం నిజంగా అద్భుతమైనది.

ప్రధాన నటులు బలమైన నటనను ప్రదర్శించారు, వారి పాత్రలకు ప్రామాణికతను తీసుకువచ్చారు. సన్నీ కూరపాటి అద్భుతమైన సినిమాటోగ్రఫీ,  మార్క్‌ కె రాబిన్‌ అద్భుతమైన స్కోర్‌ కథనాన్ని మరింత ఎఫెక్టివ్‌ గా ప్రజెంట్‌ చేశాయి . నిర్మాతలు త్వరలో సినిమా విడుదల తేదీని అనౌన్స్‌ చేశారు.

టీజర్‌ లాంచ్‌ ఈవెంట్‌ లో దర్శకుడు రాజ్‌ రాచకొండ మాట్లాడుతూ.. మంచి యాక్టర్స్‌ దొరకడం ఒక అదృష్టం. నాకు మల్లేశం లో అలాంటి మంచి యాక్టర్స్‌ దొరికారు. ఆ యాక్టర్స్‌ అందరికీ మంచి బ్రేక్స్‌ వచ్చాయి. అనన్య, దర్శి, పుష్ప లో కేశవ అందరూ చాలా మంచి సినిమాలు చేస్తున్నారు. 23 సినిమాకి కూడా అలాంటి మంచి యాక్టర్స్‌ దొరికారు. మలయాళీ సినిమాలకు ధీటుగా పెర్ఫామ్‌ చేసే యాక్టర్స్‌ దొరకడం నిజంగా అదృష్టం. పవన్‌, తన్మై సినిమా రిలీజ్‌ కాకుండా ఎడిట్‌ లో చూసే చాలా బిజీ అయ్యారు. రaాన్సీ గారి కాంట్రిబ్యూషన్‌ ని మర్చిపోలేను. మల్లేశం కూడా మంచి పాత్ర చేశారు. ఇందులో కూడా చాలా బరువైన పాత్రలో కనిపించబోతున్నారు. ఇందులో తేజాది చాలా డిఫరెంట్‌ రోల్‌. చాలా చక్కగా పెర్ఫార్మ్‌ చేశాడు. టీజర్‌ లో చూపించినట్లుగా వీళ్ళ క్రైమ్‌ తో చనిపోయిన వారు 23 మంది. అందుకే ఈ సినిమాకి ఈ టైటిల్‌ పెట్టాం. ఈ సినిమా హ్యూమన్‌ రైట్స్‌ వైపు వుంటుంది. న్యాయం దొరకని వారి తరపున వుంటుంది. తప్పుని తప్పని తెలుసుకోవడం ఈ సినిమా ఉద్దేశం. ఈ సినిమా హింసకి వ్యతిరేకంగా తీసిన సినిమా. నేను జరిగినదే చూపించాను. బీనా గారు చెప్పిన చాలా విషయాలు ఇందులో చూపించాను. మూడు ఘటనలు జరిగాయి. చాలా మంది చినిపోయారు. అయితే చంపిన వారందరికీ సమానంగా శిక్ష పడిరదా లేదా ? అనేది ప్రశ్న. జైలుకి వెళ్ళిన తర్వాత మనిషి పరివర్తనని కూడా సినిమాలో చూపించాం. నేను కనెక్ట్‌ అయిన కథని చేయాలని భావిస్తాను. ఇప్పటివరకు చేసిన కథలన్నీ అలాంటివే’అన్నారు  
బీనా గారు మాట్లాడుతూ.. నాకు సినిమాల గురించి తెలీదు. జైలు గురించి మాట్లాడగలను. రాజ్‌ ఫోన్‌ చేసి జైలు గురించి ఒక కథ రాస్తున్నానని చెప్పాడు. కలిసి మాట్లాడాలని అడిగాడు. చాలాసార్లు ఫోన్‌ చేశాడు. నేను చెప్పిన ఎక్స్పీరియన్స్‌ ని చాలా సీరియస్‌ గా రాసుకున్నాడు. జైలు వేరే లోకం వేరే ప్రపంచం. మన మాటలతో మార్పు తీసుకొచ్చే అవకాశం.  అక్కడ చాలా ధైర్యంగా మాట్లాడాలి.  ఇక్కడ చాలామంది మార్పు చెందిన మనుషులు ఉన్నారు. నా మాటలతో చాలామంది జీవితంలో మార్పు తీసుకురావడం చాలా ఆనందంగా ఉంది. రాజ్‌ విజన్‌ చాలా ఇంపాక్ట్‌ ఫుల్‌ గా వుంది’అన్నారు
యాక్టర్‌ రaాన్సీ మాట్లాడుతూ.. అందరికి నమస్కారం. 23 అద్భుతమైనటువంటి కాన్సెప్ట్‌. రాజ్‌ గారు నిజాయితీగల ఫిలిం మేకర్‌. ఈ సినిమాలో పార్ట్‌ కావడం ఒక గౌరవంగా భావిస్తున్నాను. నిజ జీవిత కథని నిజాయితీగా చెప్పారు. నిజాయితీగా కథ చెప్తే పవర్‌ ఉంటుంది. ఈ సినిమాలో దమ్ముంది. నిజాయితీ ఉంది. ఇలాంటి సినిమాని ప్రేక్షకుడు వెతుక్కుంటూ వస్తాడనే నమ్మకం ఉంది. 23 చరిత్రలో నిలిచిపోయే గొప్ప సినిమా.’అన్నారు  
యాక్టర్‌ తేజ మాట్లాడుతూ.. ఇది నా డెబ్యూ ఫిల్మ్‌. యాక్టర్‌ కావాలనేది చిన్నప్పటి నుంచి కల. చాలా ఆడిషన్స్‌ ఇచ్చాను. దాదాపు 5 ఏళ్ళు ప్రయత్నించాను. ఈ అవకాశం ఇచ్చిన రాజ్‌ గారి థాంక్యూ సో మచ్‌. ఆయన సపోర్ట్‌ ని మర్చిపోలేను. ఇంత ఇంటెన్స్‌ ప్రాజెక్ట్‌ లో అవకాశం రావడం చాలా ఆనందంగా వుంది. సినిమాలో పని చేసిన అందరికీ థాంక్‌ యూ సో మచ్‌.
యాక్టర్‌ తాగుబోతు రమేష్‌ మాట్లాడుతూ... సమాజానికి ఏదైనా ఒక మంచి విషయం చెప్పాలి అనే తపనతో సినిమాలు చేసే దర్శకుడు రాజ్‌. ఇప్పటివరకు చాలా సినిమాలు చేశాను. కానీ ఈ సినిమా మాత్రం చాలా భయపడుతూ చేశా.  చాలా కంట్రోల్‌ గా నాతో యాక్ట్‌  చేయించారు. ఈ సినిమా నా జీవితంలో ఎప్పుడూ మర్చిపోలేను. ఎందుకు ఇంతలా చెప్తున్నానంటే అది సినిమా రిలీజ్‌ అయిన తర్వాత విూకు అర్థమవుతుంది. ఇలాంటి సినిమా చేయడం నా అదృష్టం’ అన్నారు. మూవీ యూనిట్‌ అంతా పాల్గొన్న ఈ వేడుక గ్రాండ్‌ గా జరిగింది.
తారాగణం: తేజ, తన్మయి, రaాన్సీ, పావోన్‌ రమేష్‌, తాగుబోతు రమేష్‌, ప్రణీత్‌


కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు