Ticker

6/recent/ticker-posts

Ad Code

WhatsApp తో ఇంద్రకీలాద్రి సేవలు !


విజయవాడ, ఫిబ్రవరి 12, (ఇయ్యాల తెలంగాణ) : వాట్సాప్‌ ద్వారా ఇంద్రకీలాద్రి సేవలు అందుబాటులోకి వస్తున్నాయి. ఏపీ ప్రభుత్వం పౌర సేవలు సులభముగా పొందడానికి ‘95523 00009 అనే వాట్సాప్‌ నెంబర్‌ ను ప్రవేశ పెట్టింది. ఇందులో భాగంగా దేవాదాయ శాఖ ఏపీలో రెండో ప్రధాన దేవాలయం అయిన విజయవాడ శ్రీ దుర్గామల్లేశ్వర స్వామివార్ల దేవస్థానం, ఇంద్రకీలాద్రి దర్శనాలు, సేవలు  బుక్‌ చేసుకోడానికి, విరాళము  అందించడాన్ని సులభతరం చేసింది. ప్రతి ఒక్కరూ సులభంగా అర్ధం చేసుకునేలా 9552300009 వాట్సాప్‌ నెంబర్‌ కు ‘హై’ అని వాట్సప్‌ లో మెసేజి చేయడం ద్వారా సేవలు అందుకోవచ్చునని ఆలయ ఈవో కె.రామచంద్ర మోహన్‌ ఒక ప్రకటనలో తెలిపారు.ప్రస్తుతం

వాట్సాప్‌ లో టికెట్‌ పొందే విధానం

👉 అందుబాటులోకి 150 సేవలు

 మన మిత్ర పేరుతో వాట్సాప్‌ గవర్నెన్స్‌ సేవలు ప్రారంభించింది. 150కిపైగా సేవలు ఇక్కడ నుంచి ప్రజలు పొందవచ్చని పేర్కొంది. బస్‌ టికెట్లు మొదలు కొని క్యాస్ట్‌, ఇన్‌కం సర్టిఫికేట్‌, దేవాలయాల దర్శనాలు ఇలా 161 సేవలు లభిస్తాయి. కార్యాలయాల చుట్టూ తిరగకుండా ఇంటి వద్ద నుంచి ఒక్క క్లిక్‌తో చాలా సేవలు లభించనున్నాయి. .ఇక్కడ క్యాస్ట్‌ సర్టిఫికెట్‌ పొందాలనుకునే వాళ్లు రెండు విషయాలు తెలుసుకోవాలి. ఓ ఏడాదిలో ఒకసారైనా ఈ క్యాస్ట్‌ సర్టిఫికెట్‌ తీసుకున్న వాళ్లు మాత్రమే ఈ వాట్సాప్‌లో క్యాస్ట్‌ సర్టిఫికేట్‌ తీసుకోగలరు. అలా తీసుకోని వాళ్లు మాత్రం ఒకసారి నేరుగా వెళ్లి క్యాస్ట్‌ సర్టిఫికెట్‌ పొందాల్సి ఉంటుంది. ఆ తర్వాత విూరు ఎప్పుడు కావాలంటే అప్పుడు క్యాస్ట్‌ సర్టిఫికేట్‌ పొందగలుగుతారు. 

విూరు 9552300009 నెంబర్‌ను సేవ్‌ చేసి పెట్టుకోండి. ఆ తర్వాత వాట్సాప్‌లోకి వెళ్లి ఆ నెంబర్‌కు మెసేజ్‌ పంపించాల్సి ఉంటుంది. హాయ్‌ అని పంపించాలి. సర్వర్‌ బిజీని బట్టి విూకు రిప్లై వస్తుంది. సర్వర్‌ బిజీగా ఉంటే లేట్‌గా రిప్లై వస్తుంది. లేకుంటే త్వరగా రిప్లై వస్తుంది. రిప్లై వచ్చిన తర్వాత సేవలను అన్వేషించండి అని వస్తుంది. ఆ సేవలను అన్వేషించండి బటన్‌పై క్లిక్‌ చేస్తే మెయిన్‌ మెనూలోకి వెళ్తారు. అక్కడ విూరు ఏ కేటగిరిలో సేవలు కావాలనుకుంటున్నారో ఆ విభాగం పై క్లిక్‌ చేయాలి. విూకు కావాల్సింది క్యాస్ట్‌ సర్టిఫికేట్‌ కాబట్టి రెవెన్యూ విభాగంపై క్లిక్‌ చేయాలి. రెవెన్యూ విభాగంపై క్లిక్‌ చేస్తే అందులో లభించే సేవల జాబితా విూకు కనిపిస్తుంది. అందులో 13 రకాల సేవలు ఉంటాయి. ఆ సేవల విభాగంలో విూకు క్యాస్ట్‌ సర్టిఫికెట్‌ కోసం ప్రత్యేకంగా ఏం కాలమ్‌ కనిపించదు. కానీ ఇంటిగ్రేటెడ్‌ సర్టిఫికేట్‌ జారీ అనే విభాగం ఉంటుంది. ఇంటిగ్రేటెడ్‌ సర్టిఫికేట్‌ జారీ విభాగంపై క్లిక్‌ చేస్తే ఆధార్‌ కార్డు ఎంట్రీ చేసేందుకు కాలమ్‌ కనిపిస్తుంది. విూ ఆధార్‌ కార్డు ఎంట్రీ చేయాల్సి ఉంటుంది. విూరు ఎంట్రీ చేసిన ఆధార్‌ కార్డు విూదా కాదా అని చెక్‌ చేసేందుకు ఓటీపీ కూడా వస్తుంది. అలా వచ్చిన ఓటీపీ ఎంటర్‌ చేసి వెరిఫై క్లిక్‌ చేయాలి. ఒకసారి ఆధార్‌ వెరిఫికేషన్‌ పూర్తి అయిన తర్వాత విూ తండ్రి, భర్త పేరు, మతం, విద్యార్హతలు, వైవాహిక స్థితి, మెయిల్‌ ఐడి అడుగుతుంది. ఇక్కడ మెయిల్‌ ఐడీ అనేది ఆప్షనల్‌. ఉంటే ఇవ్వొచ్చు లేకుంటే లేదు. ఈ వివరాలు నిర్దారించుకోమని అడుగుతుంది. ప్రభుత్వం వద్ద ఉన్న వివరాలతో మ్యాచ్‌ అయితే విూరు తర్వాత దశకు తీసుకెళ్తుంది. ప్రభుత్వం వద్ద ఉన్న రికార్డులతో విూ వివరాలు మ్యాచ్‌ కాకుంటే మాత్రం అక్కడితో సేవలు ముగిసిపోతాయి. అంటే విూరు నేరుగా వెళ్లి సర్టిఫికెట్‌ తీసుకోవాలని సూచిస్తుంది. 


ఒకసారి వివరాలు పూర్తిగా ఇచ్చిన తర్వాత సమర్పించండి అనే ఆప్షన్‌పై క్లిక్‌ చేయాలి. అలా క్లిక్‌ చేసిన తర్వాత వాట్సాప్‌ ద్వారా వాళ్లకు మెసేజ్‌ వెళ్తుంది. కాసేపు ఆగిన తర్వాత అక్కడి నుంచి రిప్లై వస్తుంది. అందులో ఇంటిగ్రేటెడ్‌ సర్టిఫికేట్‌ అని ఉంటుంది. దాన్ని క్లిక్‌ చేస్తే విూ వివరాలతో ఓ పేజీ వస్తుంది. అందులో ప్రస్తుతం విూరు ఉన్న అడ్రెస్‌, పర్మినెంట్‌ అడ్రెస్‌ ఒకటై ఉంటే అక్కడ ఉండే ఓ ఆప్షన్‌ను క్లిక్‌ చేయాలి. లేదంటే ప్రజెంట్‌ అడ్రెస్‌ కింద క్లిక్‌ చేసి అడ్రెస్‌ రాయాల్సి ఉంటుంది. ఇన్ని వివరాలు ఇచ్చిన తర్వాత కొనసాగించండీ అనే ఆప్షన్‌పై క్లిక్‌ చేయాలి. వెంటనే విూకు ఓ నెంబర్‌ కేటాయిస్తున్నట్లు వస్తుంది. గతంలో విూకు సర్టిఫికెట్‌ వచ్చి ఉంటే దాన్ని విూరు ఎంటర్‌ చేయాల్సి ఉంటుంది. అలా ఎంటర్‌ చేసిన తర్వాత శాశ్వత చిరునామా లేకుంటే తాత్కాలిక చిరునామా అని అడుగుతుంది. అందులో ఏది కావాలంటే దాన్ని విూరు క్లిక్‌ చేస్తే విూ ఊరి పేరు ఇతర వివరాలు కనిపిస్తాయి. అక్కడ ముందుగా విూరు ఊరి పేరు సెలెక్ట్‌ చేసుకోవాలి. ఆ తర్వాత విూరు రెండోసారి ఎందుకు అప్లై చేస్తున్నారో చెప్పాల్సి ఉంటుంది. 

దీనికి రిలేటెడ్‌గా నాలుగు ఆప్షన్స్‌ ఉంటాయి. స్కూల్‌, కాలేజీలో అడ్మిషన్‌ కోసమా లేదా. ఉపాధి కోసమా, ఏవైనా స్కీమ్స్‌ కోసమా, రుణాల కోసమా, లేదా పేరు దిద్దుబాటు కోసమా అని చెప్పాల్సి ఉంటుంది. అలా క్లిక్‌ చేసిన తర్వాత ముందుకెళ్లండి అనే ఆప్షన్‌పై నొక్కితే అప్లికెంట్‌ పూర్తి వివరాలు వస్తాయి. అప్లై చేసిన వ్యక్తి ఎవరు, వయసు, తండ్రి పేరు, ఊరు, ఎప్పుడు అప్లై చేశారు. ఎప్పుడు అప్రూవ్‌ అయింది. ఇలా అన్ని వివరాలు వస్తాయి. ఆ తర్వాత చివరిగా ఉన్న రెండు ఆప్షన్స్‌పై క్లిక్‌ చేసి సమర్పించండి అని ఉంటుంది. దాన్ని క్లిక్‌ చేయాలి. వెంటనే రెవెన్యూ అధికారులకు విూ రిక్వెస్ట్‌ వెళ్తుంది. ఇంతలో విూకు గతంలో ఇచ్చిన క్యాస్ట్‌ సర్టిఫికేట్‌, ఆధార్‌ కార్డును స్కాన్‌ చేసి పీడీఎఫ్‌ రెడీ చేసుకోవాలి. ఇది 1 ఎంబీ లోపు సైజు ఉండాలి. ఆ వివరాలు పంపాలని మెసేజ్‌ వచ్చిన వెంటనే ఈ రెండూ ఒకే ఫైల్‌లో వాట్సాప్‌ ద్వారానే పంపించాల్సి ఉంటుంది. ఆ వివరాలు కరెక్ట్‌ అయితే 40 రూపాయలు చెల్లించాలని చూపిస్తుంది. క్యాస్ట్‌ సర్టిఫికెట్‌ మరోసారి జారీ చేస్తున్నందుకు ఈ డబ్బులు వసూలు చేస్తున్నారు. ఈ డబ్బులను కూడా అక్కడే చెల్లించవచ్చు. చెల్లించు అనే ఆప్షన్‌ కనిపిస్తుంది. దానిపై క్లిక్‌ చేసి పేమెంట్‌ చేయాల్సి ఉంటుంది. పేమెంట్‌ విజయవంతమైనట్టు కూడా మెసేజ్‌ వస్తుంది. వచ్చిన వెంటనే సర్టిఫికెట్‌ వస్తుంది. దాన్ని డౌన్‌లోడ్‌ చేసుకొని వాడుకోవచ్చు. అందులో ఉండే క్యూఆర్‌ కోడ్‌ ద్వారా కూడా విూరు వాడుకోవచ్చు.

క్యాస్ట్‌ సర్టిఫికేట్‌తోపాటు రెసిడెన్స్‌, పుట్టిన తేదీ రిలేటెడ్‌ వివరాలు కూడా ఉంటాయి. అందుకే మూడు విషయాలు ఇంటిగ్రేట్‌ అయ్యి ఉంటాయి కాబట్టి దీన్ని ఇంటిగ్రేటెడ్‌ సర్టిఫికెట్‌ అంటారు. ఇదే క్యాస్ట్‌ సర్టిఫికేట్‌గా కూడా చెల్లుబాటు అవుతుంది.



కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు