Ticker

6/recent/ticker-posts

Ad Code

దావత్ లో చికెన్ కి బదులుగా మటన్‌... Menu Change



ఏలూరు, ఫిబ్రవరి 14, (ఇయ్యాల తెలంగాణ) : వెంకి పెళ్లి సుబ్బి చావుకు వచ్చిందట.. అలా ఉంది.. ఇప్పడు బర్డ్‌ఫ్లూ వైరస్‌ శుభకార్యాలయాలపై ఎఫెక్ట్‌ పడుతోంది. మహూర్తాలు బాగున్నాయని పెళ్లిలు, ఇతర శుభకార్యక్రమాలు ఎక్కువ పెట్టుకున్నారుర జనాలు. సడెన్‌గా బర్డ్‌ఫ్లూ రావడంతో దాని ఎఫెక్ట్‌ భోజనాలపై తీవ్రంగా పడిరదని అంటున్నారు నిర్వాహకులు. ఇటీవల కాలంలో ప్రతీ వేడుకకు ముక్కలేకుండా ముద్దదిగదని పరిస్థితి నెలకొంది. చాలా మంది నాన్‌వెజ్‌ వంటకాలకే అత్యధిక ప్రాధాన్యత ఇస్తున్నారు. కొందరు పెళ్లి వేడుక రోజున కేవలం వెజ్‌ వంటకాలు వడ్డిస్తున్నప్పటికీ ఆ తరువాత జరిపే వేడుకలకు, రిసెప్షన్లకు మాంసాహార వంటకాలు తప్పనిసరి చేస్తున్నారు.బర్డ్‌ ఫ్లూ పుణ్యమా అని నాన్‌వెజ్‌ వంటకాల్లో చికెన్‌ స్థానంలో మటన్‌ వచ్చి చేర్చాల్సిన పరిస్థితి ఏర్పడిరది. బర్డ్‌ఫ్లూ వైరస్‌ వల్ల లక్షల్లో కోళ్లు మృత్యువాతపడడం, బర్డ్‌ఫ్లూ వైరస్‌ చాలా వేగంగా వ్యాప్తి చెందడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. కట్టడి చర్యలు తీసుకున్నారు. ప్రస్తుతం వైరస్‌ ప్రభావం లేదని చెబుతున్నా జనం భయం మాత్రం పోలేదు. ఈ క్రమంలోనే చికెన్‌, కోడిగుడ్లు అమ్మకాలు పడిపోతున్నాయి. అంతే కాదు పంక్షన్ల మెనూ నుంచి చికెన్‌ ఐటెం తీసేసి దాని స్థానంలో మటన్‌ చేర్చుతున్నారు. దీంతో ఒక్కసారిగా ఖర్చు భారీగా పెరగడంతో లబోదిబో మంటున్నారు నిర్వాహకులు. కిలో చికెన్‌ రూ.250 అదే కిలో మటన్‌ ధర 800 పైమాటే..  వైరస్‌ ఉన్నందున మెనూ మార్చాల్సిన పరిస్థితి వచ్చిందని అంటున్నారు. దీని బట్టి ఒక్కో కిలోకు సుమారు రూ.500 అదనంగా ఖర్చుచేయాల్సిన పరిస్థితి ఏర్పడిరది. చాలా పంక్షన్లలో చికెన్‌లోనే మూడు నాలుగు రకాల ఐటెమ్స్‌ పెట్టి కేవలం కర్రీ వరకు మటన్‌ వండుతుంటారు. ఇప్పుడు మొత్తం మటన్‌ వండాల్సి వస్తోంది. మటన్‌ బిర్యానీ వంటి ఐటెం చేయించడంతో ఖర్చు పెరిగిపోతుందంటున్నారు. 

మరికొన్ని పంక్షన్లలో ఫిష్‌కు ప్రాధాన్యనిస్తున్నారు. దీని వల్ల కూడా ఖర్చు భారీగా పెరిగిపోయిన పరిస్థితి. ఒక కిలో ఫిష్‌ రూ.300 నుంచి రూ.500 వరకు ఉండడంతో ఫిష్‌ వంటకాలు చేయించాలన్నా అదనపు ఖర్చు అవుతోంది.  బయట తప్పక తినాల్సిన పరిస్థితుల్లో ఎక్కువ శాతం మంది విజిటేరియన్‌ భోజనానికే ప్రాధాన్యతనిస్తారు. అయితే మాంసాహార ప్రియులు మాత్రం మటన్‌, ఫిష్‌లతో చేసిన ఐటెమ్స్‌కు ప్రాధాన్యతనిస్తున్నట్లు చెబుతున్నారు. తీరా తినేశాక బిల్లు చూసి ఘొల్లుమనే పరిస్థితి ఉంటుందని చెప్పుకుంటున్నారు. ఒక పూట ఏదైనా హోటల్‌కు వెళ్లి తప్పనిసరిగ్గా తినాల్సి వచ్చినప్పుడు మటన్‌ స్టార్టర్‌ లేదా ఫిష్‌ స్టార్టర్‌ ఆర్డర్‌ ఇచ్చి ఆపై మటన్‌ లేదా, ఫిష్‌ బిర్యానీ అంతకీ లేదంటే మటన్‌, ఫిష్‌ కర్రీ ఆర్డర్‌ ఇస్తున్నారు. దీంతో రెట్టింపు ఖర్చు జేబుకు చిల్లు పెడుతోందని వాపోతున్నారు.  రూ.1000 అయ్యే ఖర్చు చికెన్‌ ఐటెమ్‌లు తినక పోవడం వల్ల మటన్‌, ఫిష్‌ ఐటెమ్స్‌కు ప్రాధాన్యత ఇవ్వడంతో రూ.2000 పైనే బిల్లు చెల్లించాల్సి వస్తోంది. మొత్తం విూద ముక్కలేకుండా ముద్ద దిగని మాంసాహార ప్రియులు మాత్రం అదనపు ఖర్చు వల్ల మాత్రం కాస్త ఇబ్బందులు పడుతున్నారు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు