ఉత్తర భారత దేశంలో ఏడు శతాబ్దాల క్రితం భక్తి ఉద్యమాన్ని కొత్త పుంతలు తొక్కించిన
ఆధ్యాత్మిక యోధుడు, కర్మయోగి సంత్ రవిదాస్. పేదరికంలో అందులో చర్మకార (చమార్)
వృత్తిని నిర్వహిస్తూ గొప్ప ఆధ్యాత్మిక గురువుగా, మార్గదర్శకునిగా నిలిచారు.భక్తికి, జ్ఞానానికి
కులం ప్రధానం కాదు. పెద్దగా శాస్త్రాలు చదువాల్సిన అవసరమే లేదు.సన్మార్గంతో భగవం
తున్ని చేరుకోవచ్చని నిరూపించారు సంత్ రవిదాస్. సంత్ రవిదాస్ ఎప్పుడు జన్మించారనే
విషయంలో భిన్న వాదనలున్నాయి. 1377 లేదా 1399 సంవత్సరంలో ఆయన జన్మిం
చాడని అంటారు. మరికొందరు 1450లో జన్మించారని చెబుతున్నారు. కాశీ నగరానికి
సమీపంలోని సీర్ గోవర్ధన్‌పూర్‌కుచ గ్రామంలో మాఘ పూర్ణిమ నాడు ఖల్‌సాదేవి,
సంతోస్ దాస్ దంపతులకు రవిదాస్ జన్మించారు. రవిదాస్ పేరును రైదాస్ అని కూడా
చెబుతారు. చమార్ కులంలో జన్మించిన రవిదాస్ చిన్నప్పటి నుండే ఆధ్యాత్మిక జీవితం
పట్ల మక్కువ పెంచుకున్నారు. గంగానదిలో స్నానం చేసి, అక్కడ సాధుసంతులు చేసే
బోధనలను శ్రద్దగా ఆలకించేవారు. తాత్విక, ఆధ్యాత్మిక జ్ఞానాన్ని పొందిన రవిదాస్
భగవంతున్ని స్థుతిస్తూ కీర్తనలు, భజనలు ఆలపిస్తూ అందరినీ ఆకట్టుకునేవారు.
సమాజంలో కుల వివక్ష, అంటరానితనం ఆయన్ని తీవ్ర ఆందోళనకు గురి చేసేవి.
రవిదాస్ ధోరణి పట్ల ఆందోళన చెందాడు ఆయన తండ్రి పెళ్లి చేస్తే కానీ దారిలోకి
రాడని భావించారు. అలా లోనాదేవితో చిన్న తనంలోనే వివాహం జరిగింది.
పెళ్లి చేసుకున్నా ఆధ్యాత్మిక మార్గాన్ని వీడలేదు రవిదాస్. లోనాదేవి తన భర్తను చక్కగా అర్ధం
చేసకుంది. ఇద్దరూ కుల వృత్తి అయిన చెప్పులు కుట్టుకుంటూ దైవ చింతనను కొనసాగించారు.
రవిదాసు ఎంతో శ్రద్దగా పాదరక్షలు కుట్టేవాడు. అయితే దాన్ని ఆదాయవనరుగా భావించలేదు. తీర్థయాత్రలు చేసే సాధుసంతులకు ఉచితంగా ఇచ్చే వాడు. దీంతో భుక్తి గడవడం కష్టమైంది. దుర్భర దారిద్య్రంలో ఉన్నదాంట్లోనే సరి పెట్టుకుంటూ భక్తి మార్గంలో నడిచేవాడు రవిదాస్. క్రమంగా రవిదాస్ కీర్తి అందరికీ తెలియడం మొదలైంది. పేదరికంలో ఉన్న ఆయన్ని ఆదుకోవాలని భావించారు సంత్ ప్రేమానంద్. రవిదాసుకు పరుసవేదిని బహుకరించారు. దానితో ఇనుమును తాకితే బంగారం అవుతుందని, ఆర్ధిక పరిస్థితుల నుండి గట్టెక్కవచ్చని సూచించాడు. రవిదాస్ దాన్ని తీసు కోడానికి ఇష్టపడలేదు. ప్రేమానంద్ వత్తిడితో అయిష్టంగానే తీసుకొని చూరులో పెట్టేశాడు. రవిదాస్ దృష్టి దానిపై పడనేలేదు. తన జీవితం ఎప్పటి లాగే గడుస్తూ వచ్చింది. కొంత కాలం తర్వాత సంత్ ప్రేమానంద్ మరోసారి రవిదాస్ పూరిపాకకు వెళ్లారు. రవిదాస్ పేదరికం నుండి గట్టెక్కి ఉంటా డని భావించారాయన. కానీ పరుసవేది పెట్టిన చూరులోనే అలాగే భద్రంగా ఉంది. రవిదాస్ నిరాడబరమై జీవితంలోనే అలౌకిక ఆనందం పొందు తున్నాడని గ్రహించి ఆయనకు సవినయంగా నమస్కరించారు ప్రేమానంద్. రాజస్థాన్ చిత్తోడ్ గడ్ రాజపుత్ర యోధుడు రాణా సాంగా తల్లి రతన్ కువారీకి రవిదాసు గురించి తెలుసుకుంది. తన సైన్యంతో సహా వచ్చి రవిదాస్ పూరిపాక ముందు సవినయంగా మోకరిల్లి తనను శిష్యురాలిగా స్వీకరించమని కోరింది. రతన్ కువారీ కోరిక మేరకు రవిదాసు, ఆయన సతీమణి లోనాదేవి చిత్తోడ్ గడ్ వెళ్లారు. అక్కడ వారిని ఘనంగా సత్కరించి ఏనుగు అంబారీపై ఊరేగించారు. రాణా సాంగా భార్య మీరాబాయి కూడా రవిదాస్ శిష్యురాలిగా మారిపోయారు. రవిదాస్ ఖ్యాతి నలుదిశలా వ్యాపించింది. కాశీ మహారాజ దంపతులతో సహా ఎందరో రాజులు, రాణులు, సాధుసంతులు రవిదాస్ బోధనల పట్ల ఆకర్షితులై ఆయన శిష్యులుగా మారారు. సంత్ రవిదాస్ చిత్తోడ్ లోనే తన 120వ ఏట చైత్రశుద్ద చతుర్ధశి నాడు భగవంతునిలో లీనమైపోయారు. సంత్ రవిదాస్ బోధనలను సిక్కు ల ఐదో గురువు అర్జున్ దేవ్ పవిత్ర గ్రంధం గురు గ్రంధసాహిబ్ లో చేర్చారు. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ తాను రాసిన ‘‘అస్పృశ్యులు ఎవరే’’ అనే గ్రంధాన్ని సంత్ రవిదాస్ కు అంకితం ఇచ్చారు. సంత్ రవిదాస్ బోధనలు ఉత్తర భారత దేశానికే పరిమితం కాలేదు. ప్రపంచ వ్యాప్తంగా ఎంతో మంది ఆయన సందేశం నుండి స్పూర్తి పొందారు. రవిదాస్ సూచించిన మార్గం అందరికీ, ఎప్పటికీ, అన్ని వేళలా అనుసరణీయం.
రవిదాసు ఎంతో శ్రద్దగా పాదరక్షలు కుట్టేవాడు. అయితే దాన్ని ఆదాయవనరుగా భావించలేదు. తీర్థయాత్రలు చేసే సాధుసంతులకు ఉచితంగా ఇచ్చే వాడు. దీంతో భుక్తి గడవడం కష్టమైంది. దుర్భర దారిద్య్రంలో ఉన్నదాంట్లోనే సరి పెట్టుకుంటూ భక్తి మార్గంలో నడిచేవాడు రవిదాస్. క్రమంగా రవిదాస్ కీర్తి అందరికీ తెలియడం మొదలైంది. పేదరికంలో ఉన్న ఆయన్ని ఆదుకోవాలని భావించారు సంత్ ప్రేమానంద్. రవిదాసుకు పరుసవేదిని బహుకరించారు. దానితో ఇనుమును తాకితే బంగారం అవుతుందని, ఆర్ధిక పరిస్థితుల నుండి గట్టెక్కవచ్చని సూచించాడు. రవిదాస్ దాన్ని తీసు కోడానికి ఇష్టపడలేదు. ప్రేమానంద్ వత్తిడితో అయిష్టంగానే తీసుకొని చూరులో పెట్టేశాడు. రవిదాస్ దృష్టి దానిపై పడనేలేదు. తన జీవితం ఎప్పటి లాగే గడుస్తూ వచ్చింది. కొంత కాలం తర్వాత సంత్ ప్రేమానంద్ మరోసారి రవిదాస్ పూరిపాకకు వెళ్లారు. రవిదాస్ పేదరికం నుండి గట్టెక్కి ఉంటా డని భావించారాయన. కానీ పరుసవేది పెట్టిన చూరులోనే అలాగే భద్రంగా ఉంది. రవిదాస్ నిరాడబరమై జీవితంలోనే అలౌకిక ఆనందం పొందు తున్నాడని గ్రహించి ఆయనకు సవినయంగా నమస్కరించారు ప్రేమానంద్. రాజస్థాన్ చిత్తోడ్ గడ్ రాజపుత్ర యోధుడు రాణా సాంగా తల్లి రతన్ కువారీకి రవిదాసు గురించి తెలుసుకుంది. తన సైన్యంతో సహా వచ్చి రవిదాస్ పూరిపాక ముందు సవినయంగా మోకరిల్లి తనను శిష్యురాలిగా స్వీకరించమని కోరింది. రతన్ కువారీ కోరిక మేరకు రవిదాసు, ఆయన సతీమణి లోనాదేవి చిత్తోడ్ గడ్ వెళ్లారు. అక్కడ వారిని ఘనంగా సత్కరించి ఏనుగు అంబారీపై ఊరేగించారు. రాణా సాంగా భార్య మీరాబాయి కూడా రవిదాస్ శిష్యురాలిగా మారిపోయారు. రవిదాస్ ఖ్యాతి నలుదిశలా వ్యాపించింది. కాశీ మహారాజ దంపతులతో సహా ఎందరో రాజులు, రాణులు, సాధుసంతులు రవిదాస్ బోధనల పట్ల ఆకర్షితులై ఆయన శిష్యులుగా మారారు. సంత్ రవిదాస్ చిత్తోడ్ లోనే తన 120వ ఏట చైత్రశుద్ద చతుర్ధశి నాడు భగవంతునిలో లీనమైపోయారు. సంత్ రవిదాస్ బోధనలను సిక్కు ల ఐదో గురువు అర్జున్ దేవ్ పవిత్ర గ్రంధం గురు గ్రంధసాహిబ్ లో చేర్చారు. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ తాను రాసిన ‘‘అస్పృశ్యులు ఎవరే’’ అనే గ్రంధాన్ని సంత్ రవిదాస్ కు అంకితం ఇచ్చారు. సంత్ రవిదాస్ బోధనలు ఉత్తర భారత దేశానికే పరిమితం కాలేదు. ప్రపంచ వ్యాప్తంగా ఎంతో మంది ఆయన సందేశం నుండి స్పూర్తి పొందారు. రవిదాస్ సూచించిన మార్గం అందరికీ, ఎప్పటికీ, అన్ని వేళలా అనుసరణీయం. అంబేద్కర్ స్ఫూర్తి పొందిన భక్తి కవులలో ముఖ్యమయిన వారీగా కబీర్, సంత్ రవిదాస్‌లని చెప్పవచ్చు. రవిదాస్ కుల, మత, వర్గ అసమానతలు లేని సమాజాన్ని కోరుకున్నారు. మానవతావాదాన్ని తన కవితోద్యమంగా మలిచారు. కులం మానవత్వానికి అడ్డుగోడలుగా నిలుస్తుందని ఆయన హెచ్ఛ రించారు. తన భావజాలంతో ఎంతో మందిని ప్రభావితం చేసి నేటికాలానికి దిశా నిర్ధేశం చేసారు. అందుకే రావిదాస్ అనుచరులు ఆయన బంగారు విగ్రహాన్ని జలందర్ నుంచి కాశీ వరకూ మోసుకొచ్చారు. ఆయన ప్రభావం నేడు పంజాబ్ నుంచి దేశమంతా విస్తరించింది. సంత్ రవిదాస్ భక్తి కవుల్లో ఒకవైపు ఆధ్యాత్మిక భావాన్ని, మరోవైపు సామాజిక భావాలనూ అభివృద్ధి చేశారు. ఆయన బానిస భావాలను పూర్తిగా వ్యతిరేకించారు. మాన సిక బానిసత్వాన్ని, కుల బానిసత్యాన్ని, శారీరక బానిసత్వాన్ని వ్యతిరేకించాడు. మనిషి స్వతంత్రుడై ఉండాలని, ఆత్మగౌరవంతో కూడిన ఆలోచనలతో జీవించాలని, ఇతరులకు తలవంచి జీవించడాన్ని నిరాకరించారు. ప్రతి మనిషిలోని చైతన్యాన్ని ఆయన ప్రేరేపించారు. మానవతావాదిగా మనిషి ఉండాలని, ఈ సమాజాన్ని సంస్కర్తలు ప్రశ్నించాలని తన కవిత్వం ద్వారా, తన పాటల ద్వారా ఈ లోకానికి చాటిచెప్పారు. సమాజాన్ని మేల్కొలిపారు. హిందూ బ్రాహ్మణవాదంలో ఉన్న వర్ణ కులాధిపత్యాన్ని వ్యతిరేకించారు. సంత్ రవిదాస్ కబీర్‌కు సమకాలీకుడని చరిత్రకారులు తేల్చారు. ఆయన ఆధ్యాత్మిక గురువుగానే శూద్రుల్లో, అంటరానివారిలో ఉద్యమాన్ని నడిపారు. వారి సాంఘిక విముక్తి కోసం కృషిచేశారు. లక్షలాది శూద్ర, అంటరాని కులాలకు చెందిన ప్రజలు ఆయనను అనుసరించారు. సామాన్యులే కాదు,శ్రీకృష్ణుని ఆరాధకురాలయిన అంత:పురవాసి మీరాబాయి లాంటి వారెంద రో సాంప్రదాయ బ్రాహ్మణులు సైతంరవిదాస్ వెంటనడిచారు.
ఆయన పదాలు బనారస్ దాటి ఉత్తరప్రదేశ్, పంజాబ్, గుజరాత్‌ల వరకూ ప్రవహించాయి.ఆయన కవితల్లో అతి సున్నితంగా సందేశం, శాంతి సమానతలు ప్రజల ఆలోచనల్లో అద్భుతమైన ప్రభావంచూపుతాయి. రవిదాస్‌కు కాశీ మహా రాజు, మహారాణి కూడా శిష్యులయ్యారు. రవిదాస్ జీవితాంతం తన చర్మకార వృత్తిని అవలంబిస్తూనే అత్యంత నిరాడంబరంగా బతికారు. బౌద్ధ దమ్మ సూత్రాలలోని సిద్ధాంత సారమంతా రవిదాస్ పదాలలో ఉంది. ‘’ఐసా బహురాజ్ మై జహో మిలైసబన్ కో అక్న్ చోట్ బడో సబ్ సమ్ బసై రైదాస్ రహె ప్రసన్న్’’
ఎక్కడైతే అందరికీ భోజనం లభిస్తుందో, ఎవరూ ఆకలితో నిద్రపోరో, ఎక్కడ ఎక్కువ తక్కువుల అసమానతలు లేకుండా ప్రజలు జీవిస్తూ ఉంటారో అలాంటి సమాజాన్ని, అలాంటి పాలనా వ్యవస్థని రవిదాస్ కోరుకున్నారు.
’హిందూ పూజయి దేహరా ముసల్‌మాన్ మసీతి రవిదాస్ పూజయి ఉస్ రామ్‌కో జిస్ నిరంతరా ప్రీతి’’ - హిందువులు దేవతల్ని పూజిస్తారు. ముస్లీంలు మసీదులకు వెళ్లి నమాజు చదువుతారు. కానీ, మనుషుల్లో నివశించే భగవంతుడే అన్నిటి కన్నా ఉత్తమం.
అదే అందర్నీ సుఖంగా ఉంచుతుంది. అని రవిదాస్ చెప్పేవారు. - అంటే మనిషితో మనిషిని కలిపే స్నేహ భావమే ఉన్నత మైనదని ఆయన చెబుతారు. అందుకే ఆయన శత్రువులతో కూడా స్నేహం చేసి వారిని మిత్రులుగా, శిష్యులుగా మార్చుకున్నారు. ‘’కులం గురించి ఎవరూ, ఎవర్నీ అడగ కూడదు. బ్రాహ్మణుడు, క్షత్రియుడు, వైశ్యుడు, శూద్రుడు అందరూ మనిషి కులానికి చెందినవారే. మాన వత్వమే పరమ ధర్మం’’ అని ఆయన బోధించారు. రవిదాస్ భక్తి ఉద్యమంలో కుల వ్యతిరేక పోరాట దృక్పధం ఉంది. ఆయన చెప్పే ప్రతి మాటా అనుభవం నుంచి, అధ్యయనం నుంచి, అవగాహన నుంచి మానవతా వాదం నుంచి పుట్టుకొచ్చాయి. మతాలు, కులాలు, దేవుళ్లందరూ మానవత్వం తరువాతేనని ఆయన ప్రభోధించారు. రవిదాస్ తననను తాను చమార్‌గా ప్రభోదించుకుంటూ, ‘’మేము మసీదును అసహ్యించుకోవడం లేదు. దేవాల యాన్ని ప్రేమించడం లేదు. రెండిరటిలోనూ ఈశ్వరుడు, అల్లా , రాముడు ఎవ్వరూ లేరు. వ్యర్ధమైన పూజలు, పునస్కారాలను వదలివేసి, నిర్మలమైన మనస్సుతో ప్రజలకు సేవ చేయండి.’’ అని ఉద్భోదించారు. కులాలను దేవుడు సృష్టించలేదని, వాటిని మనిషే సృష్టించాడని స్పష్టంగా చెప్పాడు. మనిషి పీల్చుతున్న శ్వాస బ్రాహ్మణుడిదైనా, చండాలుడ్కెట్కనా ఒక్కటే అయినప్పుడు మనుషులలో ఎక్కువ తక్కువలు ఎందుకని ప్రశ్నించాడు. బ్రాహ్మ ణాధిపత్యం అధికంగా ఉన్న రోజుల్లోనే బ్రాహ్మణాధిపత్యాన్ని వ్యతిరేకించారు. రవిదాస్ తన కులం గురించి గర్వంగా చెప్పేవారు. ‘’నా కులం చమా ర్. ప్రజలు దాన్ని తక్కువగా చూస్తున్నారు. మా జాతి చనిపోయిన జంతువులను ఊరికి దూరంగా మోసుకెళ్లి పర్యావరణం దెబ్బతినకుండా చూస్తూ ఉంది. మంచి గాలిని సమాజానికి ప్రసాదిస్తూ, సమాజ హితానికి తోడ్పడుతోంది’’ అని చాటారు. ‘’గుణ హీనుడైన బ్రాహ్మణుడిని పూజించడం కన్నా, గుణవంతుడైన చంఢాలుడిని పూజించడం మేలు. మనిషి కులాన్ని బట్టి ఉన్నతుడు కాలేడు. గుణంతో, పనులతో గొప్పవాడు అవుతాడు’’ అని చాటా రు. బౌద్ధం తరువాత సమాజంపై ఇంత గొప్ప ప్రభావం చూపిన సాహిత్యం మరొకటి లేదు. ఈ సాహిత్యం కులాన్ని, మతాన్ని, దేవుళ్లనే కాక రాజ్యా న్ని ప్రశ్నించే స్థాయికి వెళ్లింది. ఎవరినైనా ప్రశ్నించవచ్చనే ధైర్యాన్ని ప్రజలలో నింపారు. జాతి వైతాళికులైన అంబేద్కర్, ఫూలే, పెరియార్ లాంటి వారిపై రవిదాస్, తదితర భక్తి కవుల ప్రభావం ఉంది. రవిదాస్ నేడు సామాజిక న్యాయం కోసం పోరాడే ప్రతి ఒక్కరికీ ఒక స్పూర్తి, ఒక ఉత్తేజం.
0 కామెంట్‌లు