Ticker

6/recent/ticker-posts

Ad Code

MLC ఎన్నికల నేపథ్యంలో వరంగల్‌ లో కిషన్‌ రెడ్డి ప్రచారం !


వరంగల్‌, ఫిబ్రవరి 16, (ఇయ్యాల తెలంగాణ) : తెలంగాణలో స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల వేడి హీటెక్కింది. ఈ ఎన్నికలకు బీఆర్‌ఎస్‌ దూరంగా ఉంది. దీంతో అధికార కాంగ్రెస్‌` విపక్ష బీజేపీలో కీలక నేతలు సుడిగాలి పర్యటనలు చేస్తున్నారు. గ్రాడ్యుయేట్‌, టీచర్లను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. తాజాగా వరంగల్‌లో బీజేపీ అధ్యక్షుడు కిషన్‌ రెడ్డి పర్యటించారు. గెలుపు మాదేనని ధీమా వ్యక్తం చేశారాయన.రెండు ఉపాధ్యాయ, ఒక పట్టభద్రుల స్థానానికి ఎన్నికలు జరుగుతున్నాయి. ప్రధాన పార్టీలైన అధికార కాంగ్రెస్‌`బీజేపీలు తమ అభ్యర్థులను గెలుపించు కునేందుకు తీవ్రంగా ప్రచారం చేస్తున్నారు. రోజుకో నియోజకవర్గంలో సుడిగాలి పర్యటన చేస్తున్నారు. సార్వత్రిక ఎన్నికల తర్వాత జరిగిన రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో  బీజేపీ విజయం సాధించింది. దీంతో ఆ పార్టీ నేతలు ఫుల్‌జోష్‌లో ఉన్నారు. తెలంగాణ జరగనున్న మూడు ఎమ్మెల్సీలను కైవసం చేసుకోవాలని భావిస్తున్నారు. తెర వెనుక పావులు కదుపుతున్నారు.టీచర్స్‌ ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు కిషన్‌ రెడ్డి. వేద ఫంక్షన్‌ హాల్‌లో ఏర్పాటు చేసిన విూడియా సమావేశంలో కీలక విషయాలు ప్రస్తావించారాయన. తెలంగాణలో జరగనున్న రెండు ఉపాధ్యాయ, ఒక పట్టభద్రుల స్థానంలో తమ పార్టీ అభ్యర్థులు విజయం సాధించడం ఖాయమన్నారు. మేధావులు, ఉపాధ్యాయులు, పట్టభద్రులు బీజేపీ వైపు చూస్తున్నారని తెలిపారు. బీఆర్‌ఎస్‌పై వ్యతిరేకత వల్ల సాధారణ ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీని గెలిపించిందన్నారు. కాంగ్రెస్‌ పై వ్యతిరేకత వల్ల బీజేపీకి గెలుస్తుందని జోస్యం చెప్పారు. బీఆర్‌ఎస్‌ను గద్దె దించేందుకు ప్రజలకు పదేళ్లు పట్టిందన్నారు. ప్రతిపక్షం, ప్రశ్నించే గొంతు ఉండకూడదని ఆ పార్టీ ప్రయత్నించి బోర్లా పడిరదన్నారు. కాంగ్రెస్‌ పార్టీ సభ్యులను పార్టీలో చేర్చుకొని శాసన మండలిని నీరు గార్చారని దుయ్యబట్టారు. శాసన మండలిలో మేధావులు, విద్యావంతులు ప్రభుత్వానికి కీలక సూచనలు చేస్తారని గుర్తు చేశారు. అందుకే శాసన మండలిని రాజ్యాంగ నిపుణులు ఏర్పాటు చేశారని వివరించారు. శాసనసభ చేసిన చట్టాలపై మేదావులు మండలిలో సూచనలు, సలహాలు చేసేవారని చెప్పుకొచ్చారు. 

ప్రజల గుండె చప్పుడు వినిపించే మండలిని తన భజన చేసే సభగా కేసీఆర్‌ మార్చారని మండిపడ్డారు.పనిలోపనిగా కాంగ్రెస్‌ సర్కార్‌పై నోరు ఎత్తారు. ప్రభుత్వంపై ఏడాదిలో వ్యతిరేకత మొదలైందన్నారు కిషన్‌ రెడ్డి. ప్రస్తుతం కాంగ్రెస్‌ను, బీఆర్‌ఎస్‌ను ప్రజలు పట్టించుకునే పరిస్థితుల్లో లేరన్నారు. వంద రోజుల్లో ఆరు గ్యారెంటీలు అమలుచేస్తామని చెప్పి ఇప్పటివరకు చేయలేదన్నారు. ఇచ్చిన హావిూలు అమలు చేయలేని నిస్సహాయ స్థితిలో ప్రభుత్వం ఉందన్నారు.వ్యతిరేకతను మరల్చేందుకు లేని విషయాలను సీఎం రేవంత్‌రెడ్డి మాట్లాడు తున్నారని చెప్పుకొచ్చారు బీజేపీ అధ్యక్షుడు. మోడీపై, కేంద్రంపై మాట్లాడినంత మాత్రాన వైఫల్యాలను ప్రజలు మార్చిపోరని గుర్తు చేశారు. రాబోయే రోజుల్లో కాంగ్రెస్‌ పార్టీ వైఫల్యాలపై బీజేపీ పోరాటం చేస్తుందని వెల్లడిరచారు.బీఆర్‌ఎస్‌  పార్టీ మద్దతుదారులను తమవైపు తిప్పుకునేందుకు తీవ్ర ప్రయత్నాలు చేస్తోంది బీజేపీ. ఈ క్రమంలో మాటల యుద్ధానికి తెరలేపినట్టు కనిపిస్తోంది. నార్మల్‌గా అయితే అధికార పార్టీ ఎన్నికల్లో ఎడ్జ్‌ ఉంటుందని కొందరు నేతల మాట. ఉపాధ్యాయ, ఒక పట్టభద్రుల స్థానానికి గెలుచుకుని అధికార పార్టీకి తామే ప్రత్యామ్నాయమని చెప్పే ప్రయత్నం చేస్తోంది బీజేపీ. మరి ఓటర్లు ఎటువైపు అన్నది చూడాలంటే కొద్దిరోజులు వెయిట్‌ చేయాల్సిందే.


కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు