Ticker

6/recent/ticker-posts

Ad Code

నటి , నిర్మాత KRISHNAVENI ఇక లేరు


అలనాటి నటి, నిర్మాత కృష్ణవేణి ఆదివారం ఉదయం  తుదిశ్వాస విడిచారు. ఆమె వయసు 102 సంవత్సరాలు. నందమూరి తారక రామారావు  మనదేశం సినిమాలో సినిమా రంగానికి పరిచయం చేశారు. ఆమె మృతి మృతి పట్ల నటుడు బాలకృష్ణ సంతాపం వ్యక్తం చేసారు. ఆమె  బహుముఖ ప్రజ్ఞాశాలి. నటిగా, నిర్మాతగా, స్టూడియో అధినేతగా తెలుగు సినీ చరిత్రలో ఆమెది ఓ ప్రత్యేక అధ్యాయం. మన దేశం లాంటి గొప్ప చిత్రాలు నిర్మించి సమాజంలో ఉన్నత విలువలను పెంచడానికి కృషి చేశారు. ప్రభుత్వ పరంగా ఎన్నో అవార్డ్స్‌ అందుకొన్నారు.  కృష్ణవేణి గారి మృతి వ్యక్తిగతంగా మాకు తీరని లోటు. వారి ఆత్మకు శాంతి చేకూరాలని ఆ భగవంతుణ్ణి ప్రార్థిస్తూ వారి కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతిని తెలియ జేస్తున్నానని అన్నారు.

. అలనాటి నటీమణి, సినీ నిర్మాత కృష్ణవేణి మృతి నన్ను బాధించిందని సీఎం చంద్రబాబు పేర్కోన్నారు. . 102 సంవత్సరాల పరిపూర్ణ జీవితం గడిపిన కృష్ణవేణి గారి ఆత్మకు శాంతి చేకూర్చాలని ఆ భగవంతుడిని ప్రార్ధిస్తున్నాను. ‘మన దేశం’ చిత్రంతో ఎన్టీఆర్‌ ను చిత్ర రంగానికి పరిచయం చేసి కళారంగానికి వారు చేసిన సేవ మరువలేనిది. వారి కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతిని తెలియచేస్తున్నానని అన్నారు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు