సృష్టిలో కవలలు ఒక అద్భుతం. జన్యుపరమైన అమరిక వల్ల ఈ విధంగా శిశువులు ఏకరూపంలో జన్మిస్తారని విజ్ఞానశాస్త్రం చెబుతున్నా ఇంత సారూప్యత కనిపించడం అద్భుతమే.. రూపంలోనే కాకుండా కొందరు లక్షణాల్లోనూ ఏకత్వం చూపిస్తారు. మరికొందరు కవలల్లో ఆలోచనలు భిన్నంగా ఉండటం ఎక్కువగా కనిపిస్తుంది. కవలలు జన్మించడం ఆ తల్లిదండ్రులకు మధురానుభూతి, శిశువులకు మరుపురాని అనుభూతి. బిడ్డలిద్దరినీ ఒకేలా తయారు చేసి అమ్మానాన్నలు సంబరపడిపోతుంటారు. వారికంటూ ఓ రోజు ఉండటం విశేషం. కవలల దినోత్సవం ప్రతి సంవత్సరము ఫిబ్రవరి 22 న జరుపుకుంటారు . ప్రపంచవ్యాప్తంగా దాదాపు 125 మిలియన్ల ‘మల్టీపుల్స్’ (ఒకే కాన్పులో జన్మించిన ఒకరికన్నా ఎక్కువమంది) ఉన్నారు. ప్రపంచం లో మొట్టమొదట సారి కవలల దినోత్సవాన్ని పోలెండ్ వారు 1976లో నిర్వహించారు. కవలలందరికి ప్రపంచ కవలల దినోత్సవ శుభాకాంక్షలు.
0 కామెంట్‌లు