జగిత్యాల,ఫిబ్రవరి 16 (ఇయ్యాల తెలంగాణ) : కన్న తల్లి,దండ్రులను పోషించక నిరాధరిస్తున్న కొడుకులు ,కూతుర్లకు,వారి కోడళ్లకు తెలంగాణ అల్ సీనియర్ సిటీజేన్స్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు హరి ఆశోక్ కుమార్ ఆధ్వర్యంలో అసోసియేషన్ ప్రతినిధులు కౌన్సిలింగ్ చేయడంతో తాము తమ తల్లిదండ్రులను పోషిస్తూ, బాగోగులుచేసుకోవడానికి సమ్మతించి ఒప్పంద పత్రం రాసిచ్చారు.ఆదివారం జిల్లా కేంద్రంలోని అసోసియేషన్ కార్యాలయం కౌన్సిలింగ్ కేంద్రం కు జిల్లాలోని వివిధ మండలాలకు చెందిన ఆ కొడుకులు, కూతుర్లను,కోడళ్లను ఆ వృద్ధ తల్లిదండ్రుల అభ్యర్థన పై పిలిపించి వయోవృద్ధుల చట్టం పై అవగాహన కల్పించి, తల్లిదండ్రులను పోషించక నిరాదరణకు గురిచేస్తే ట్రిబ్యునల్ అధికారి అయిన ఆర్డీవో 6 మాసాలకు పైగా జైలు శిక్ష,జరిమానా విధించే వీలు ఆ చట్టంలో ఉందని,మాయ మాటలతో, బెదిరింపులతో వారి ఆస్తులను రిజిస్ట్రేషన్ చేసుకున్నా అట్టి ఆస్తులు తిరిగి ఆ తల్లిదండ్రుల పేరిట మార్పిడి చేసే అధికారం జిల్లా కలెక్టర్ కు ఉందని కౌన్సిలింగ్ చేశారు.
జిల్లా కేంద్రానికి చెందిన రాకల కాంతయ్య, వజ్రమ్మ అనే వృద్ధ తల్లిదండ్రులను ఆమె పెద్ద కుమారుడు ,పెద్ద కోడలు,చిన్న కొడుకు,చిన్న కోడలు పోషించక వేధింపులకి గురి చేస్తున్నారని ,వరంగల్ జిల్లా కేంద్రానికి చెంది జగిత్యాల పట్టణంలో నివసిస్తున్న వృద్ధ తల్లిదండ్రులు ధమ్మేటి నర్సింహులు,దుర్గమ్మ లను జగిత్యాల లోనే చిరు వ్యాపారాలు చేసుకుంటున్న ఇద్దరు కుమారులు,కోడళ్లు నిరాదరిస్తూ వేధింపులకు గురిచేస్తున్నారని , జిల్లా కేంద్రానికే చెందిన అక్కుల రాజయ్య, శాంతమ్మల ను వారి ఇద్దరు కూతుళ్లకు సమానంగా ఆస్తులు పంచి ఇచ్చినప్పటికీ పోషించడం లేదనే కారణంగా ,గొల్లపల్లి,పెగడపల్లి,ధర్మపురి ,మల్యాల మండలాలకు చెందిన వృద్ధ తల్లిదండ్రులు సీనియర్ సిటీజేన్స్ జిల్లా అధ్యక్షుడు హరి ఆశోక్ కుమార్ కు ఫిర్యాదు చేశారు.ఈ మేరకు సీనియర్ సిటీజేన్స్ అసోసియేషన్ ప్రతినిధులు హరి ఆశోక్ కుమార్ ఆధ్వర్యంలో గౌరిశెట్టి విశ్వనాథం,వెల్ముల ప్రకాశ్ రావు,బైరి రాధ,కరుణ తదితరులు ఆ కనికరం లేని కొడుకులు,కోడళ్లకు ,కూతుర్లకు ఆదివారం కౌన్సెలింగ్ ఇవ్వడం తో వారు ఆ తల్లిదండ్రులను పోషిస్తామని,లేకుంటే తమపై చట్ట ప్రకారము ట్రిబ్యునల్ చైర్మన్ అయిన ఆర్డీవో కు కేసు దాఖలు చర్యలు తీసుకోవాలని స్టాంపు పేపర్ పై ఒప్పంద పత్రం రాసిచ్చారు.
0 కామెంట్‌లు