హైదరాబాద్, ఫిబ్రవరి 04 ఇయ్యాల తెలంగాణ : మాదిగల తరతరాల పోరాట ఫలితం తెలంగాణ అసెంబ్లీ సాక్షిగా ఫలించింది. తెలంగాణ రాష్త్రంలో ఎస్సీ వర్గీకరణ కమీషన్ నివేదికకు తెలంగాణ క్యాబినెట్ ఆమోదం తెలిపింది. తెలంగాణ అసెంబ్లీ సమావేశంలో వర్గీకరణ విషయమై చర్చలు జరిపింది. ఎస్సీల్లో మెుత్తం 59 ఉప కులాలను ఏకసభ్య కమిషన్ గుర్తించిందని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. వారిని మూడు గ్రూపులుగా వర్గీకరించాలని కమిషన్ సిఫార్సు చేసినట్లు ముఖ్యమంత్రి వెల్లడించారు. ఎస్సీ వర్గీకరణకు కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉన్నట్లు తెలిపారు. అన్ని రాష్ట్రాల కంటే ముందే వర్గీకరణను తామే అమలు చేస్తామని మరోసారి సీఎం ప్రకటించారు. వర్గీకరణపై ఏకసభ్య కమిషన్ ఏర్పాటు చేశామని, ఆ కమిషన్ తాజాగా రిపోర్టు ఇచ్చిందని ఆయన చెప్పారు. ఆ కమిషన్ కూడా ఎస్సీ వర్గీకరణ చేయాలనే సిఫార్సు చేసినట్లు అసెంబ్లీ సాక్షిగా సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. ఎస్సీ వర్గీకరణ అంశంలో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పునకు తెలంగాణ సర్కార్ కట్టుబడి ఉన్నట్లు తెలియజేశారు. ఎస్సీల్లో మెుత్తం 59 ఉప కులాలను ఏకసభ్య కమిషన్ గుర్తించిందని సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. వారిని మూడు గ్రూపులుగా వర్గీకరించాలని కమిషన్ సిఫార్సు చేసినట్లు ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. ఎస్సీలను గ్రూప్ 1, 2, 3 కేటగిరీలుగా వర్గీకరించాలని కమిషన్ సూచించినట్లు రేవంత్ తెలిపారు. మెుత్తం 15 శాతం రిజర్వేషన్లను 3 గ్రూపులకు పంచుతూ సిఫార్సు చేసినట్లు సీఎం తెలిపారు. గ్రూప్-1లో 15 ఉప కులాలకు ఒక శాతం రిజర్వేషన్ ఇవ్వాలని చెప్పినట్లు సీఎం పేర్కొన్నారు. 15 ఉపకులాల జనాభా 3.288 శాతంగా ఉందని వెల్లడించారు. గ్రూప్-2లోని 18 ఉప కులాలకు 9 శాతం రిజర్వేషన్లు ఇవ్వాలని కమిషన్ చెప్పినట్లు 18 ఉప కులాల జనాభా 62.748గా ఉందని సీఎం తెలిపారు. గ్రూప్-3లోని 26 ఉప కులాలకు 5 శాతం రిజర్వేషన్‌ను ఏకసభ్య కమిషన్ సిఫార్సు చేసినట్లు సీఎం చెప్పారు. ఈ 26 ఎస్సీ ఉప కులాల జనాభా 33.963 శాతంగా ఉందని పేర్కొన్నారు.
" మూడు దశాబ్దాలుగా ఎస్సీ వర్గీకరణ పోరాటం కొనసాగుతున్నదని, నేడు ఎస్సీ వర్గీకరణ అమలు చేయడం నాకు ఎంతో సంతృప్తినిచ్చిందని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. ఎంతోమంది ముఖ్యమంత్రులకు రాని అవకాశం తనకు లభించిందని, సుప్రీంకోర్టు తీర్పు మేరకు వర్గీకరణకు శాశ్వత పరిష్కారం తీసుకురావాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుందన్నారు. 20 ఏళ్లుగా రాజకీయాల్లో ఉన్నా. తన రాజకీయ జీవితంలో ఆత్మ సంతృప్తిని కలిగించిన రోజుగా సీఎం అభివర్ణించారు. ఇలాంటి అవకాశం తనకు రావడం సంతోషమని చరిత్రపుటల్లో ఇది శాశ్వతంగా నిలిచిపోతుందన్నారు. వర్గీకరణ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపడానికి రాష్ట్ర ప్రభుత్వం ఎస్సీ ఉపకులాల వర్గీకరణ అమలుకు చర్యలు చేపట్టిందని స్పష్టం చేశారు.బాబాసాహెబ్ డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ అందించిన రాజ్యాంగం వల్లే సాధ్యమైందన్నారు. రంగుల గోడలు.. అద్దాల మేడలు కాదు.. చివరి పేదవాడికి సంక్షేమ ఫలాలు అందించాలన్న అంబేడ్కర్ ఆశయామని అందుకు అనుగుణంగా తమ ప్రభుత్వం పనిచేస్తోందని తెలియజేశారు.అనంతరం సభ్యులు ఒక్కొకరిగా వర్గీకరణపై తమ అభిప్రాయాల్ని సభా ముఖంగా వ్యక్తంచేశారు.
0 కామెంట్‌లు