Ticker

6/recent/ticker-posts

Ad Code

కేబినెట్‌ విస్తరణకు Clearance వచ్చేనా !


హైదరాబాద్‌, ఫిబ్రవరి 7, (ఇయ్యాల తెలంగాణ) : ఆరు బెర్తులు, ఎందరో ఆశావహులు. ఇది తెలంగాణ క్యాబినెట్‌ విస్తరణపై ఏడాదిగా కొనసాగుతున్న సస్పెన్స్‌. ఇప్పటికీ మంత్రివర్గ విస్తరణపై ఎటూ కొలిక్కి రాకపోవడంతో ఒక్కోసారి ఆశావహులు ఆశలు..చల్లబడి..మరోసారి చిగురిస్తున్నాయట. అయితే ఇప్పుడు మరోసారి తెలంగాణ క్యాబినెట్‌ విస్తరణ వార్త ఇంట్రెస్టింగ్‌గా మారింది. లేటెస్ట్‌ డెవలప్‌మెంట్స్‌, సీఎం, పీసీసీ చీఫ్‌కు ఢల్లీి నుంచి పిలుపురావడం బట్టి చూస్తుంటే..క్యాబినెట్‌ విస్తరణ పక్కా అన్న అంచనాకు వస్తున్నారు ఆశావహులు.సరిగ్గా ఇదే టైమ్‌లో సీఎం రేవంత్‌ రెడ్డి హఠాత్తుగా ఢల్లీి పర్యటనకు వెళ్లడంతో మళ్లీ ఆశావహుల్లో ఆశలు చిగురిస్తున్నాయి. సీఎంతో పాటు పీసీసీ చీఫ్‌ మహేశ్‌ కుమార్‌ గౌడ్‌ను అధిష్టానం పెద్దలు పిలవడం, ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేతో భేటీ ప్రాధాన్యత సంతరించుకుంది. దీంతో ఈసారి కచ్చితంగా మంత్రివర్గ విస్తరణ ఉంటుందని పార్టీ వర్గాలు భావిస్తున్నాయి.అయితే ఎవరెవరికి మంత్రివర్గంలో స్థానం కల్పించాలన్నదానిపైనే కాంగ్రెస్‌ అధిష్టానం సీఎం రేవంత్‌, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, పీసీసీ చీఫ్‌ మహేష్‌ కుమార్‌ గౌడ్‌తో డిస్కస్‌ చేసినట్లు తెలుస్తోంది. ఇదే సమయంలో క్యాబినెట్‌లో చోటు దక్కించుకునేందుకు పలువురు ఎమ్మెల్యేలు తమ స్థాయిలో లాబీయింగ్‌ చేస్తుండగా, ఏ క్షణంలోనైనా మంత్రివర్గ విస్తరణపై ప్రకటన వచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది.తెలంగాణలో కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి వచ్చి ఏడాది దాటిపోయింది. 2023 డిసెంబర్‌లో ప్రభుత్వం కొలువైన సందర్భంగా ఏర్పాటైన మంత్రివర్గమే ఇప్పటికీ కొనసాగుతోంది. సీఎం రేవంత్‌ రెడ్డి సహా మంత్రివర్గంలో మొత్తం 12మంది ఉండగా మరో ఆరుగురికి అవకాశం ఉంది. లోక్‌సభ ఎన్నికల తర్వాత మంత్రివర్గం విస్తరణ అన్నారు. 


ఆ తర్వాత దసరా, దీపావళి, సంక్రాంతి అన్ని ముహూర్తాలు గడిచిపోయాయి. ఏడాది పాలన కూడా పూర్తౌెంది.కానీ ఇప్పటికీ పూర్తిస్థాయి మంత్రివర్గం ఏర్పాటు కాలేదు. దీంతో అమాత్య పదవులపై ఆశలు పెట్టుకున్న ఆశావహులు తెగ బాధ పడిపోతున్నారు. మంత్రి వర్గ విస్తరణపై చాలా మంది ఎమ్మెల్యేలు ఆశగా ఎదురుచూస్తున్నారు. సీఎం రేవంత్‌ రెడ్డి ఎప్పుడు ఢల్లీి వెళ్లినా.. ఈసారి తమకు మంత్రి పదవి దక్కడం ఖాయమని తమ అనుచరులతో తెగ చెప్పుకుంటున్నారు.అంతేకాదు కొంతమంది అయితే ఏకంగా తమ అనుకూల విూడియాలో పెద్దఎత్తున ప్రచారం చేసుకుంటున్నారన్న చర్చ జరుగుతోంది. సీఎం రేవంత్‌ ఢల్లీి వెళ్లడం, ఎమ్మెల్యేలు ఎదురుచూసి చూసి చతికిల పడటం సర్వసాధారణం అయిపోయింది.మంత్రివర్గ విస్తరణ వాయిదా పడుతూ వస్తున్నా..ఎమ్మెల్యేల లాబీయింగ్‌ మాత్రం ఆగడం లేదన్న చర్చ జరుగుతోంది. తమ పరిచయాలు, అనుకూల వర్గాల ద్వారా ఢల్లీి పెద్దలతో రాయబారం నడుపుతున్నారట. మంత్రి పదవిని దక్కించుకోవడానికి ఉన్న అన్ని అవకాశాలను వాడుకుంటున్నారు నేతలు.ఒకవైపు సీఎం రేవంత్‌ రెడ్డితో టచ్‌లో ఉంటూనే మరోవైపు ఢల్లీి పెద్దలను కలిసే ప్రయత్నం చేస్తున్నారు. మంత్రివర్గంలో ఎలాగైనా ఈసారి తమ పేరు ఉండాల్సిందేనని కొందరు సీనియర్లు పట్టుదలతో ఉన్నారట.అసలు మంత్రివర్గ విస్తరణ ఆలస్యం కావడానికి కారణాలు ఏమై ఉంటాయన్నది కాంగ్రెస్‌ నేతలెవ్వరికి అంతుపట్టకపోవడంతో నిరాశ నిట్టూర్పుతో ఎదురు చూస్తున్నారు. ఎందుకు కాంగ్రెస్‌ అధిష్టానం మంత్రివర్గ విస్తరణకు గ్రీన్‌ సిగ్నల్‌ ఇవ్వడం లేదని ఆశావహులు తలలు పట్టుకుంటున్నారు.మంత్రివర్గ విస్తరణపై సీఎం రేవంత్‌ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఇప్పటికే అధిష్టానం పెద్దలతో పలుమార్లు సంప్రదింపులు జరిపినా క్లారిటీ రావడం లేదంటున్నారు. ఈసారి సీఎం ఢల్లీి టూర్‌ మంత్రివర్గ విస్తరణ కోసమేనని భావిస్తున్నారు. ఇప్పుడైనా మంత్రివర్గ విస్తరణకు కాంగ్రెస్‌ అధిష్టానం గ్రీన్‌ సిగ్నల్‌ ఇస్తుందా..లేక మళ్లీ వాయిదా పడుతుందా అనేది చూడాలి మరి.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు