🌴 చెట్టు చెట్టు నాటుతుంటే హరితహారం
నిలిచిన మొక్కకు రక్షణిస్తే హరితహారం
ఊరు ఊరంతా కలిసి ఉద్యమించి చెట్లు నాటితే
తెలంగాణ రాష్ట్రమంతా బంగారు హరితహారమే !
🌴 గింజలను నారువేస్తే చాలు మొలిచే మొక్కలెన్నో
గింతనీరు అందిస్తే చాలు నిలిచే స్నేహగంధాలెన్నో
ప్రపంచీకరణ పేరిట చెట్లు కొట్టినంత నిష్క్రమణ
కాబోదు నరికివేసినా చిగురువేసే తరువులెన్నో !
🌴 తరువును తగిలిస్తే తడియారనీ దుఃఖమెంతో
తరువును నరికేస్తే నిలువనీడలేని నరులెందరో
చిన్న చినుకు చాలు చిగురిస్తూ
తన తరుశాఖలతో నేస్తములా నిలిచే చెట్టెనో !
🌴 విత్తనం ఏపాటి చెట్టగునో
చెట్టు ఏయేట వృక్షమగునో
విభవము ఎవరెరుగగలరు
గొంగళిపురుగే సీతాకొకట్లేగునో !
🌴 కడ ఊపిరి దాక నీడనిచ్చే నేస్తం తరువు
పశుపక్ష్యాదుల సమస్త జీవులను ఆదరించే తరువు
తననూ నిలువునా కాల్చేసినా కూల్చేసినా
నెపమెరుగక ఉపకారం చేస్తే స్థితప్రజ్ఞ తరువు !
🌴 తనను నిలిపితే చల్లని నీడనిస్తుంది
తనను నరికినా చక్కని ఆసనమవుతుంది
అపకారికి సైతం ఉపకారం చేసే తరువు
తనను కాల్చిన శిథిలతో వెచ్చని నేస్తమవుతుంది !
🖊🖊🖊 డా.ఐ.చిదానందం 🖊🖊🖊
చరవాణి - 8801444335
0 కామెంట్‌లు