Ticker

6/recent/ticker-posts

Ad Code

ట్రిపుల్‌ ఇంజన్‌ అంటున్న BJP


న్యూఢిల్లీ, ఫిబ్రవరి 16, (ఇయ్యాల తెలంగాణ) : దేశ రాజధాని ఢిల్లీలో పాగా వేసేందుకు పక్కా ప్రణాళికతో ముందుకు వెళ్తోంది భారతీయ జనతా పార్టీ. ఈ క్రమంలోనే ఢిల్లీలో డబుల్‌ ఇంజన్‌ కాదు.. ‘ట్రిపుల్‌ ఇంజన్‌’ సర్కార్‌ అంటోంది. 27 ఏళ్ల తర్వాత ఢిల్లీ అధికార పీఠం దక్కించుకున్న బీజేపీ.. ఇప్పుడు మున్సిపల్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఢిల్లీ ఎన్నికలపై ఫోకస్‌ పెట్టింది. ఇప్పటికే గ్రౌండ్‌ లెవల్‌లో కసరత్తు మొదలు పెట్టింది. మున్సిపల్‌ స్థాయిలోనూ బీజేపీ విజయం సాధించి.. మేయర్‌ పీఠం దక్కించుకుంటే? ‘ట్రిపుల్‌ ఇంజన్‌’ సర్కార్‌ బీజేపీ ఏలుబడిలోకి వచ్చినట్టవుతుంది.అందుకే ఎంసీడీ ఎన్నికల్లోనూ పట్టు సాధించాలని ఆశిస్తోంది భారతీయ జనతా పార్టీ. ఇందుకోసం అమ్‌ ఆద్మీ పార్టీ కౌన్సిలర్లకు గాలం వేస్తోంది కమల దళం. తాజాగా నలుగురు ఆప్‌ కౌన్సిలర్లు బీజేపీలో చేరారు. ఇప్పటి వరకు మొత్తం 12 మంది ఆప్‌ కౌన్సిలర్లు బీజేపీలోకి జంప్‌ అయ్యారు. చాలా మంది ఆప్‌ కౌన్సిలర్లు అసెంబ్లీ ఎన్నికల ఫలితాల కంటే ముందే బీజేపీలో చేరారు. దీంతో బీజేపీ బలం మరింత పెరిగింది.ఇక ఢిల్లీ మున్సిపల్‌ కార్పొరేషన్‌ పరిధిలో 250 కౌన్సిలర్‌ స్థానాలున్నాయి. తాజా అసెంబ్లీ ఎన్నికల్లో 8 మంది బీజేపీ కౌన్సిలర్లు, ముగ్గురు ఆప్‌ కౌన్సిలర్లు ఎమ్మెల్యేలుగా నెగ్గారు. అలా ఎంసీడీలో 12 కౌన్సిలర్‌ స్థానాలు ఖాళీ అయ్యాయి. వాటికి ఉప ఎన్నికలు జరగాల్సి ఉంది. 


ఈ నేపథ్యంలోనే ఇప్పటి నుంచే కసరత్తు మొదలు పెట్టారు కమలనాథులు. మునిసిపల్‌ కార్పొరేషన్‌ అఫ్‌ ఢిల్లీలో తాజాగా బీజేపీ బలం 112, ఆప్‌ బలం 119గా ఉంది. అయితే లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికల ఫలితాల తర్వాత ఎంసీడీలో బీజేపీ బలం పెరిగింది. ఢిల్లీలోని ఏడుగురు లోక్‌సభ ఎంపీలు, ముగ్గురు రాజ్యసభ ఎంపీలు, ఎంసీడీ పరిధిలోని 14 మంది ఎమ్మెల్యేలకు కూడా మేయర్‌ ఎన్నికల్లో ఓటు హక్కుంది. మేయర్‌ ఎన్నికల్లో ఓటు హక్కున్న 14 మంది ఎమ్మెల్యేలు, ఏడుగురు ఎంపీలు బీజేపీకి చెందినవారే. అంటే ఏప్రిల్‌ జరిగే ఎన్నికల్లో మేయర్‌ సీటు గెలుచుకునే అవకాశాలు బీజేపీకి బలంగా ఉన్నాయి. ఢిల్లీ ప్రజలు ట్రిపుల్‌ ఇంజన్‌ సర్కార్‌ను కోరుకుంటున్నారని , అందుకే ఆప్‌ కౌన్సిలర్లు కూడా బీజేపీలో చేరుతున్నారని అన్నారు ఢిల్లీ  బీజేపీ అధ్యక్షుడు వీరేంద్ర సచ్‌దేవా.మరోవైపు ఢిల్లీలో ప్రభుత్వ ఏర్పాటుకు బీజేపీ రెడీ అవుతోంది. ఇందుకు సంబంధించిన సన్నాహాలను మొదలుపెట్టింది. ఇందులో భాగంగా ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారానికి ముహుర్తం కూడా ఫిక్స్‌ చేసింది. ఫిబ్రవరి 19 లేదా 20వ తేదీన ఢిల్లీ నూతన ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారోత్సవం జరిగే అవకాశం ఉందని పార్టీ వర్గాలు వెల్లడిరచాయి. అయితే కౌన్‌ బనేగా ఢిల్లీ సీఎం? హస్తినాకి కొత్త బాస్‌ ఎవరనే దానిపై ఇంకా ఉత్కంఠ నెలకొంది. ఫిబ్రవరి 17, 18 తేదీల్లో శాసనసభా పక్ష సమావేశం ఏర్పాటు చేసి ముఖ్యమంత్రి అభ్యర్థిని ఎన్నుకోనున్నారు. మరోవైపు గెలిచిన 48 మంది ఎమ్మెల్యేలలో 15 మంది పేర్లను షార్ట్‌ లిస్ట్‌ చేశారు. వారిలో తొమ్మిది మందిని ముఖ్యమంత్రి, మంత్రులు, స్పీకర్‌ పదవులకు ఎంపిక చేయనున్నట్లు సమాచారం.ఇదిలాఉండగా, సీఎం రేసులో న్యూఢిల్లీనియోజకవర్గం నుంచి మాజీ సీఎం కేజ్రీవాల్‌ను ఓడిరచిన పర్వేష్‌ వర్మ సహా పలువురి పేర్లు వినిపిస్తున్నాయి. మరి ఎవరిని ఫైనల్‌ చేస్తారన్నది మోదీతో భేటీ తర్వాత ఓ క్లారిటీ వస్తుందని ఢిల్లీ బీజేపీ నేతలు చెబుతున్నారు. ప్రస్తుతం ప్రధాని మోదీ అమెరికా పర్యటనలో ఉన్నారు. ఆయన రాగానే ఢిల్లీ పీఠంపై కూర్చునేదీ ఎవరో తేలిపోనుంది

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు