గల్లీతో పాటు ఢిల్లీలో అధికారం - ఆప్ కు ఊహించని తీర్పు
హస్తిన కాషాయదళం వశమైంది !
![](https://blogger.googleusercontent.com/img/b/R29vZ2xl/AVvXsEgOAt4yVXQn30-FvbxvTvkQ4MsVCif-M2CklZJiJ8DSs-7vDuMAnyFnYBFCxpZQSpbTXDoxUTziGcCa0ufHvPasGBqJ6XlPEEOnuuZcXjqsfwowYDIx9Eh3mkVZr2fq8OlnnHPcpqc-A2jAnkGLmTpYjrzYD_HZ3pUvA6xTNYb2DJV41jd_ttSnNYENHno/w640-h320/modi%20bjp%20copy.jpg)
ఢిల్లీలో27 ఏళ్లుగా పవర్ లెస్‌గా ఉన్న కమలం పార్టీ ప్రచారం చివరి రోజు ఏకంగా 22 రోడ్ షోలు నిర్వహించింది. కేంద్రంలో మూడోసారి అధికారం చేపట్టినా ఢిల్లీ అసెంబ్లీలో ఎందుకు పట్టు సాధించలేకపోతున్నామన్న ఆలోచన బీజేపీలో కనిపించింది. అందుకే ఈసారి ఢిల్లీ పీఠం ఎక్కాల్సిందేనన్న కసి కాషాయదళంలో పెరిగింది. కేజ్రీవాల్ టార్గెట్‌గా ప్రధాని మోడీ దగ్గర్నుంచి కేంద్రమంత్రులు, ఎన్డీఏ పాలిత రాష్ట్రాల సీఎంల దాకా ప్రచారాన్ని హోరెత్తించారు. షీష్ మహల్ అంటే కేజ్రీవాల్ కట్టుకున్న అద్దాల మేడ సంగతి తేలుస్తామన్నారు. అన్నట్లుగానే కాషాయదళం కథ మార్చేసింది. ఢిల్లీలో పట్టు నిలుపుకొంది. కచ్చితంగా గెలవాల్సిన టైమ్‌లో సత్తా చాటింది.
ఢిల్లీ ఎన్నికల్లో చక్రం తిప్పాలన్న ఆప్ పార్టీకి షాక్ తగిలింది. బీజేపీ చేతిలో దారుణంగా ఓడిపోయింది. అన్నా హజారే అడుగు సిద్ధాంతాలతో రాజకీయాల్లోకి వచ్చిన కేజ్రీవాల్‌కు పరాభవం తప్పలేదు. బీజేపీ అభ్యర్థి పర్వేశ్ సాహిబ్ సింగ్ చేతిలో ఓడిపోయారు. ఆయనే కాదు ఆప్ కీలక నేతలు సిసోడియా, సౌరభ్ భరద్వాజ్‌లకు కూడా ఓటమి తప్పలేదు. ఏకచక్రాదిపత్యం ప్రదర్శించిన ఆప్ ఓటమికి కారణాలు చాలానే ఉన్నాయి.2020 ఎన్నికల్లో బీజేపీని సింగిల్ డిజిట్‌కు పరిమితం చేసిన కేజ్రీవాల్ పార్టీ ఇప్పుడు మాత్రం చేతులెత్తేసింది. కర్ణుడి చావుకు సవాలక్ష కారణాలన్నట్లుగా ఆమ్ ఆద్మీ పార్టీ పతనానికి కూడా చాలా రీజన్స్ పని చేశాయి.
1. ప్రభుత్వ వ్యతిరేకత
2015 అలాగే 2020 ఎన్నికల్లో ఢల్లీిలో ఆప్ ఘన విజయాలు సాధించింది. తొలి రెండు టర్మ్ లలో హెల్త్ అండ్ ఎడ్యుకేషన్ రంగాల్లో అద్భుతమైన పనితీరు చూపింది. కరెంట్ అలాగే వాటర్ బిల్ సబ్సిడీలు మొదట్లో ఓటర్లను బాగానే సంతోషపెట్టాయి. మరోవైపు లోక్ సభ ఎన్నికల్లో బీజేపీ ఘన విజయం సాధించినా ఢల్లీి అసెంబ్లీ ఎన్నికలకు వచ్చే సరికి మాత్రం పట్టు సాధించడంలో ఇబ్బంది పడిరది. కాలం గడుస్తున్నా కొద్దీ ఢల్లీి ఎయిర్ క్వాలిటీ రోజురోజుకూ తగ్గడం, ఇచ్చిన హావిూలు నెరవేరకపోవడం ఢల్లీి ఓటర్లను పునరాలోచించుకునేలా చేశాయి. కేంద్రంలోని ఃఏఖ ప్రభుత్వం తమకు అడ్డంకులు సృష్టిస్తోందని ంంఖ చెబుతూ వచ్చింది. గత పదేళ్లలో ఇలాంటి ఆరోపణలను ఓటర్లు పట్టించుకోలేదు. బీజేపీ డబుల్ ఇంజిన్ హావిూ ఆకర్షించడంతో ఈసారి హస్తిన ఓటర్లు కమలానికి పట్టం కట్టారు.
2. షీష్ మహల్
ఎన్నికలకు ముందు నుంచే అరవింద్ కేజ్రీవాల్ పై బిజెపి వ్యూహాత్మకంగా ముప్పేట దాడి షురూ చేసింది. శీష్ మహల్ పై ఫోకస్ పెట్టింది. కేజ్రీవాల్ అధికారంలో ఉన్నప్పుడు రెనోవేషన్ చేసిన సీఎం నివాసాన్ని టార్గెట్ చేస్తూ జనంలోకి తీసుకెళ్లింది. రెనోవేషన్ పై కాగ్ నివేదిక కూడా ఇవ్వడం బీజేపీకి కలిసి వచ్చింది. సీఎం నివాసం పునరుద్ధరణ పని మొదలు పెట్టినప్పుడు ప్రాథమిక అంచనా 7.91 కోట్లుగా తేలగా, 2020లో పని అప్పగించినప్పుడు అది 8.62 కోట్లకు పెరిగింది. అయితే 2022లో ఆ అద్దాల మేడ పని పూర్తి చేసే సమయానికి, ఖర్చు 33.66 కోట్లకు పెరిగింది. దీనికి కౌంటర్ గా ఆప్ చేసిన వాదన జనం ముందు నిలబడలేకపోయింది. కామన్ మ్యాన్ పాలిటిక్స్ అంటూ రాజకీయాల్లోకి వచ్చి ఇలాంటి భవనం సీఎంకు ఎందుకన్న చర్చ జనంలో సాగేలా చేయడంలో బీజేపీ సక్సెస్ అయింది. అందుకే ఆమ్ ఆద్మీ ఓటమికి ఇది కూడా ముఖ్య కారణమైంది.
3. లిక్కర్ పాలసీ
ఢిల్లీలో రద్దైన లిక్కర్ పాలసీ చుట్టూ ఒక దశలో తీవ్రమైన ఆరోపణలు వచ్చాయి. సీఎంగా ఉన్న కేజ్రీవాల్, డిప్యూటీ సీఎం హోదాలో మనీష్ సిసోడియా సహా ఇతర ఆప్ నేతలు జైలుకు కూడా వెళ్లొచ్చారు. ఢిల్లీ కొత్త పాలసీలో భాగంగా లిక్కర్ బాటిళ్లపై ఒక బాటిల్ కొంటే మరొకటి ఫ్రీ ఆఫర్ తేవడాన్ని బీజేపీ తప్పుబట్టింది. కేజ్రీవాల్ ప్రభుత్వం ఢిల్లీని తాగుబోతుల సిటీగా మారుస్తోందని బిజెపి చేసిన ఆరోపణలు జనంలోకి బాగానే వెళ్లాయి. లిక్కర్ పాలసీలో ఎలాంటి అవినీతి జరగలేదని, ప్రతీకార రాజకీయాల కోసమే అరెస్ట్ చేశారని ఆప్ నేతలు సమర్థించుకున్నారు. కానీ అవేవీ జనం ముందు నిలబడలేదు. పైగా కేజ్రీవాల్, సిసోడియా అరెస్టుతో ఢిల్లీలో ఆప్ సర్కార్ లో అలజడి పెరిగింది. అతిషీని సీఎం చేశారు. సరిగ్గా ఎన్నికలకు కేజ్రీవాల్ 5 నెలలు తీహార్ జైలులో ఉన్నారు. అటు సిసోడియా అయితే ఏకంగా ఏడాదిన్నర జైలు జీవితం గడిపారు. దీంతో 2020లో ఆప్ ఇచ్చిన హావిూలు అటకెక్కాయి. కోర్టులు కేసులు, చిక్కుల్లో పడడంతో రాజకీయంగా ముందడుగు వేయలేకపోయారు.
0 కామెంట్‌లు