మాజీ ఎం.ఎల్. సి కీ. శే. మార్పు బాలకృష్ణమ్మ 12వ వర్ధంతి సభ సందర్బంగా |
ఉపాధ్యాయ నేస్తమా!ఆపన్న హస్తమా!
ఓర్పుకు సంకేతమా!'మార్పు'కు శ్రీకారమై! llఉపాధ్యాయll
ఉపాధ్యాయ హక్కులకు నీవె ధాత
ప్రజాతంత్ర విద్యార్థి ఉద్యమ సంధాత
బడుగులకై భూదానంచేసిన ప్రధాత
ప్రజాస్వామ్య హక్కుల తెలిపిన నేత ll ఉపాధ్యాయ ll
ప్రభుత్వ వ్యతిరేకత నాడు ప్రశ్నించినావు
రైతాంగా పోరాటానికి బాసటగా నిలిచినావు
ప్రజల తాగు నీటికి పోరు సలిపినావు
రైతుల సాగునీటి సమస్య సాధించినావు ll ఉపాధ్యాయ ll
దళితవర్గ పోరాటాలకు అండగ ఉన్నావు
భూస్వామ్య పద్ధతి సమూలంంగ ఎండగట్టావు
గిరిజనుల పోరుకు ఇతోధిక కృషి చేశావు
నిరాడంబరతకు నీవె నిదర్శనమయ్యావు ll ఉపాధ్యాయ ll
అణువంతైనా స్వార్థానికి తావివ్వలేదు
కుట్ర కేసులకు ఇసుమంతైనా బెదరలేదు
విద్యాభివృద్ధికి చేసిన కృషి ఊరికే పోదు
ఉపాధ్యాయులకు చేసిన మేలు మిమ్ము మరిచిపోదు ll ఉపాధ్యాయll
: రచన :
డాక్టర్ శ్రీవాటి శ్రీనాథ్
అధ్యక్షులు
డాక్టర్ విజయ భాస్కర్
ప్రధాన కార్యదర్శి
తెలంగాణ రాష్ట్ర టీచర్స్ ఫెడరేషన్
0 కామెంట్‌లు